breaking news
radical Islamism
-
'ఆ దుస్తులతోనే రండి.. లేదంటే పోండి'
ఫ్రాన్స్: బీచ్‌ల్లోకి నిండైన ఈత వస్త్రాలతో(బుర్కినీలతో) స్విమ్మింగ్‌కు రాకుండా కేన్స్ మేయర్ నిషేధం విధించారు. దీంతోపాటు ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో బీచ్‌లో పూర్తి దుస్తులతో బీచ్‌లకు రావొద్దని గట్టిగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే భారీ మొత్తంలో ఫైన్ చెల్లించాలని హెచ్చరించారు. సాధారణంగా స్మిమ్మింగ్‌కు వెళ్లే సమయంలో కొన్ని మతాలకు చెందిన మహిళలు నిండైన వస్త్రాలతో బీచ్‌లకు వెళుతుంటారు. అయితే గత నెలలో ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఓ ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉగ్రవాది ట్రక్కుతో ఫ్రాన్స్‌లో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా ఉగ్రవాదులు ముసుగులు ధరించి దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హై అలర్ట్ అమలవుతున్న ఫ్రాన్స్‌లోని పలు బీచ్‌లలో ఫుల్ స్మిమ్మింగ్ సూట్ లతో వస్తే రావొద్దని వస్తే బికినీ వస్త్రాల్లో రావాలని లేదంటే బీచ్ రావొద్దని హెచ్చరిస్తున్నారు. ర్యాడికల్ ఇస్లామిస్టులు ఇలాగే ముసుగులతో వచ్చి దాడులకు పాల్పడుతుంటారని అధికారులు భావిస్తుండటం వల్లే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
ఉగ్రవాద నిరోధం కోసం 13వేల మందికి...!
న్యూఢిల్లీ: తజికిస్థాన్ పోలీసులు తాజాగా 13వేల మంది పురుషులకు గడ్డాలు గీయించారు. సంప్రదాయబద్ధమైన ముస్లిం వస్త్రాలను అమ్మే 160 దుకాణాలను మూసివేయించారు. దేశంలో రాడికల్ ఇస్లామిజాన్ని నిరోధించేందుకు తజికిస్థాన్ ఈ మేరకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. మధ్య ఆసియా ముస్లిం మెజారిటీ దేశమైన తజికిస్థాన్.. ముస్లిం తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పొరుగు దేశం ఆఫ్ఘనిస్థాన్ ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు ఈ మేరకు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నదని అల్ జజీరా చానెల్ ఓ కథనంలో తెలిపింది. అంతేకాకుండా బురఖా ధరించకుండా 1700 మంది మహిళల్ని ఆ దేశ ప్రభుత్వం ఒప్పించిందని, లౌకిక నాయకత్వంలో కొనసాగుతున్న తజికిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్ ప్రభావం తమపై పడకుండా చాలాకాలంగా జాగ్రత్త వహిస్తోందని వివరించింది. ఈ క్రమంలోనే గతవారం తజికిస్థాన్ పార్లమెంటు అరబ్ ధ్వనించే పదాలను నిషేధించింది. అలాగే, ఫస్ట్ కజిన్స్ మధ్య వివాహ సంప్రదాయాన్నీ నిషేధించింది. ఫస్ట్ కజిన్స్ పెళ్లి చేసుకునేందుకు ఇస్లాం మతంలో అనుమతి ఉంది. ఇక గత ఏడాది తజికిస్థాన్ సుప్రీంకోర్టు ఇస్లామిక్ రినైజాన్స్ పార్టీని నిషేధించింది. దేశంలో మతహింస చోటుచేసుకోవడంతో రాడికల్ ఇస్లామిజమే ఇందుకు కారణమంటూ తొలి ఇస్లామిక్ రాజకీయ పార్టీ అయిన దీనిని రద్దు చేసింది. దేశంలో లౌకిక భావనను పెంపొందించి.. విదేశీ ప్రభావాలను నిరోధించేందుకు వీలుగా తజికిస్థాన్ అధ్యక్షుడు ఇమొమాలి రఖ్మోన్ కొత్త చట్టాలు తేవాలని భావిస్తున్నారు. 1994 నుంచి దేశాన్ని పాలిస్తున్న ఆయన ప్రస్తుత పదవీకాలం గడువు 2020లో ముగియనుంది.