breaking news
Qualified Institutional buyers
-
టార్సన్స్ ప్రోడక్ట్స్‌కు 77 రెట్లు సబ్స్క్రిప్షన్
న్యూఢిల్లీ: లైఫ్ సైన్సెస్ సంస్థ టార్సన్స్ ప్రోడక్ట్స్ ఇనీ షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఆఖరు రోజు నాటికి 77.49 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం 1.08 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తుండగా 84.02 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల కేటగిరీ దాదాపు 185 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగం 116 రెట్లు, రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల (ఆర్ఐఐ)కేటగిరీ 11 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. షేరు ధర శ్రేణి రూ. 635–662గా ఉంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ రుణాలను తీర్చేందుకు, ఇతరత్రా పెట్టుబడి అవసరాలకు ఉపయోగించుకోనుంది. ప్రయోగ శాలల్లో, ఫార్మా సంస్థల్లో, డయాగ్నోస్టిక్ కంపెనీల్లో ఉపయోగించే ల్యాబ్ వేర్‌ను టార్సన్స్ ప్రోడక్ట్స్ తయారు చేసి, విక్రయిస్తోంది. -
క్యూఐబీ ద్వారా జీవీకే 1,000 కోట్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ. 694 కోట్ల ఆదాయంపై రూ.235 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 500 కోట్ల ఆదాయంపై రూ. 171 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. తగినంత గ్యాస్ సరఫరా లేక విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయకపోవడం, అధిక వడ్డీరేట్లు నష్టాలు పెరగడానికి ప్రధాన కారణంగా కంపెనీ పేర్కొంది. 2013-14 పూర్తికాలానికి రూ. 2,820 కోట్ల ఆదాయంపై రూ. 369 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించగా, అంతక్రితం ఏడాది రూ. 2,608 కోట్ల ఆదాయంపై రూ. 336 కోట్ల నికర నష్టం వచ్చింది. ఎయిర్పోర్ట్ విభాగం తప్ప విద్యుత్, రహదారుల విభాగాలు నష్టాల్లోనే ఉన్నాయి. క్యూ4లో ఎయిర్పోర్ట్ విభాగం లాభాలు రూ. 155 కోట్ల నుంచి రూ. 211 కోట్లకు పెరిగింది. క్యూఐబీకి ఓకే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్(క్యూఐబీ)కు వాటాలను విక్రయించడం ద్వారా గరిష్టంగా రూ. 1,000 కోట్ల వరకు మూలధనం సమీకరించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులోనే గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా రూ.500 కోట్లు సేకరించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.