breaking news
promotional scheme
-
రూ.407కే విమాన టికెట్
న్యూఢిల్లీ: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏషియా భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. రూ. 407లకే విమానంలో ప్రయాణించే అత్యల్ప ధరల్ని ప్రకటించింది. "2017 ఎర్లీ బర్డ్ సేల్" అనే ప్రచార పథకంలో ఈ తగ్గింపు టిక్కెట్లను అందిస్తోంది. ఈ ప్రమోషనల్ ఆఫర్ జనవరి 22 న ముగియనుంది. అలాగే ఈ ఆఫర్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లతో మే 1, 2017- ఫిబ్రవరి 6, 2018మధ్య ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఎయిర్ఏషియా తాజా ఆఫర్ కింద గౌహతి -ఇంఫాల్ రూ. 407, గోవా-హైదరాబాద్ రూ. 877, హైదరాబాద్-బెంగళూరు రూ.938 , జైపూర్-పూణే రూ. 2.516, పుణే- బెంగళూరు రూ. 821 బెంగళూరు-హైదరాబాద్ రూ. 663 ధరలను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ పరిధిలోకి ఇతర కొన్ని మార్గాలలో కూడా ఉన్నట్టు తెలిపింది. ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ ఏషియా కూడా తాజా ఆఫర్ ను తీసుకొచ్చింది.. దేశీయ మార్కెట్లో విమానయాన ప్రయాణంలో నెలకొన్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు తగ్గింపు ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్, ఎయిర్ భారతదేశం, గోఎయిర్, స్పైస్‌జెట్ , ఇండిగో సంస్థ నూతన సంవత్సర డిస్కౌంట్లను ప్రకటించడంతోపాటు భారీ విస్తరణకు దిగుతున్న సంగతి తెలిసిందే. అసోచామ్ ఐఎటిఎ ప్రకారం నవంబర్ 2016 లో దేశీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 22.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. -
ఎయిర్ ఏషియా మరో ప్రమోషనల్ ఆఫర్
న్యూఢిల్లీ : బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏషియా ఇండియా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.తన కొత్త ప్రమోషనల్ స్కీంలో భాగంగా తగ్గింపు ధరల ఆఫర్ కింద విమాన టిక్కెట్లను రూ.899లకే ( అన్నీ కలుపుకొని) అందుబాటులో ఉంచింది. అక్టోబర్ 23తో ముగియనున్న ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లు 2017 మార్చి 31 మధ్య ప్రయాణాలకు వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. రూ. 899 ధరలు గౌహతి-ఇంఫాల్ మధ్య ప్రయాణానికి వర్తించనున్నట్టు తెలిపింది. అలాగే ఈ ఆఫర్ కింద కొచ్చి- బెంగుళూరు టిక్కెట్టు ధర రూ.999ల నుంచి ప్రారంభమవుతాయి. కొచ్చి-హైదరాబాద్ 2,699గా, గోవా- రూ.3199గా, జైపూర్ - పుణే రూ. 2399 గా ఉండనున్నాయి. మరిన్ని వివరాలు ఎయిర్ ఏషియా వెబ్ సైట్ లో..