breaking news
pro.jaya sankar
-
20 నుంచి సాగుపై జెడ్పీ ప్రత్యేక సమావేశాలు
ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభం మార్చి ఆఖరు కల్లా వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్‌ల నిర్మాణం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించేందుకు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రత్యేకంగా జెడ్పీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా మొదటి సమావేశం ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుందని తెలిపారు. మంగళవారం ఆయన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘ఆహార భద్రతకు పాలీహౌజ్‌ల సాంకేతిక పరిజ్ఞానం’ అనే అంశంపై జరిగిన ఒకరోజు సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూరగాయల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, దీనికోసం పాలీహౌజ్ టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి రూ.250 కోట్లు వెచ్చించి వెయ్యి ఎకరాల్లో పాలీ హౌజ్‌ల నిర్మాణం చేపట్టనున్నామని వివరించారు. హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల లోపు ఉన్న రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో వీటి నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. ఒక్కో రైతుకు 75శాతం సబ్సిడీతో మూడెకరాల్లో అనుమతి ఇస్తామన్నారు. అలాగే, వచ్చే నాలుగు నెలల్లో రూ.455 కోట్ల ఖర్చుతో 1.32 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, బోయిన్పల్లి మార్కెట్ యార్డుల్లో శీతల గిడ్డంగుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రత్యేక అధికారి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి. భూపాల్‌రాజ్, నవరత్న క్రాప్ సైన్స్ ఎం.డి. సరితారెడ్డి, అపెడా జనరల్ మేనేజర్ టి.సుధాకర్, రైతులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. -
పలుచోట్ల జయశంకర్ వర్ధంతి
సాక్షి, ముంబై: మహారాష్ట్ర తెలంగాణ మంచ్ తరఫున తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ. జయశంకర్ 3వ వర్ధంతిని ధారావి కుంబర్వాడ సుతార్ చర్చ్‌లో శనివారం ఉదయం 11 గంటలకు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ప్రొ. జయశంకర్ చిత్ర పటానికి అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్, మంచ్ అధ్యక్షుడు గుడుగుంట్ల వెంకటేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత మంచ్ నాయకులు కార్యదర్శి కార్యవర్గం గొలుసుల లింగయ్య, కోశాధికారి ఆవుల రాములు, కార్యదర్శి సాకి శేఖర్, దూదిమెట్ల సైదులు, ఆర్గనైజర్ బత్తుల శంకర్, కారింగు అంజయ్య తదితరులు జయశంకర్‌కు నివాళులర్పించారు. 5 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తి జయశంకర్ అని రచయిత మచ్చ ప్రభాకర్ కొనియాడారు. ప్రతియేటా జయశంకర్ స్మృతి సభను జరుపుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో తమ మంచ్ పూర్తి క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ‘తెలంగాణ రత్న’ బిరుదునివ్వాలి.. సాక్షి, ముంబై: ప్రొఫెసర్ కె.జయశంకర్‌కు ‘తెలంగాణ రత్న’ బిరుదు ఇవ్వాలని ముంబై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), చెంబూర్ కార్మిక విభాగం డిమాండ్ చేశాయి. జయశంకర్ వర్ధంతి సందర్భంగా శనివారం వీరు సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌కు ‘తెలంగాణ రత్న’ బిరుదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముంబై టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బల్లె శివరాజ్ , అధ్యక్షుడు బద్ది హేమంత్ కుమార్, చెంబూర్ కార్మిక విభాగం అధ్యక్షుడు చంద్ర గౌండ్, సుంక అంజయ్య, పి.దర్శయ్య, లక్ష్మి ఇమామి, పద్మ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఖార్ ప్రాంగణంలో.. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 3వ వర్ధంతిని తెలంగాణ కార్మిక సంఘం (బాంద్రా-ఖార్) ఆధ్వర్యంలో శనివారం ఖార్ ప్రాంగణంలో ఘనంగా జరుపుకున్నారు. జయశంకర్ చిత్రపటానికి నాకా కార్మికుల సమక్షంలో సంఘం పెద్దలు పుప్పాల పెద్ద సత్తయ్య, మచ్చ ప్రభాకర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రముఖులు కార్యవర్గం పిట్టల గణేష్, జట్టి కృష్ణ, గుండె చంద్రం, అంబల్ల యాదయ్య, రాంరెడ్డి, పోతుల రాములు తదితరులు పాల్గొన్నారు.