breaking news
Prime Sale
-
కరోనా ఎఫెక్ట్: అమెజాన్ కస్టమర్లకు షాక్!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిత్యం లక్షల సంఖ్యలో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ సారి యువకులు సైతం ఈ కరోనా మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ఇటీవలే ప్రైమ్ డే సేల్ పేరిట ఓ భారీ సేల్‌ను ప్రకటించింది. ప్రతి ఏడాది నిర్వహించే సేల్‌లో భాగంగా ఈ సారి కూడా అమెజాన్ ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి వాటిపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. అయితే.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అమెజాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ప్రతి ఏడాది నిర్వహించే ప్రైమ్ డే సేల్‌ను వాయిదా వేస్తున్నట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది. గత ఏడాది సైతం కరోనా కారణంగా ఈ సేల్‌ను అమెజాన్ ఆగస్టు నెలలో నిర్వహించింది. కరోనా వ్యాప్తి, పలు చోట్ల లాక్ డౌన్ల నేపథ్యంలో డెలివరీలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతోనే అమెజాన్ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ సైతం కరోనా కారణంగా పలు స్మార్ట్ ఫోన్ల లాంఛ్ ఈవెంట్లను వాయిదా వేసింది. సంస్థ వార్షికోత్సవ వేడుకలను కూడా వాయిదా వేసినట్లు రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ తెలిపారు. చదవండి: లక్షల మందిని రక్షించిన సింగిల్ రిపోర్ట్! -
'బై వన్ గెట్ వన్ ఫ్రీ: భారీ ఆఫర్లు
ముంబై: ఆన్లైన్ రీటైలర్ అమెజాన్రో ప్రైమ్ డే సేల్కు తెరతీసింది. భారత్ మార్కెట్లో ప్రైమ్ డే సేల్‌ను మొట్టమొదటిసారి ప్రారంభించిన అమెజాన్ ఇండియా భారీ ఆఫర్లను అందిస్తోంది. గ్లోబల్‌గా ప్రైమ్ డే సేల్ సోమవారం సాయంత్రం 6 గంటలనుంచి ప్రారంభించింది. తద్వారా స్మార్ట్ఫోన్లు సహార ఎలక్ట్రానిక్స్‌పై భారీ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా టీవీ కొనుగోలు చేసిన ప్రైమ్ ఖాతాదారులకు మరో టీవీని ఉచితంగా అందిస్తోంది. 'ప్రైమ్' సేల్ లో 20 టాప్ బ్రాండ్లతోపాటు అన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందించనున్నామని అ మెజాన్ ప్రైమ్ హెడ్ అక్షయ్ సాహీ చెప్పారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బ్రాండ్ 'బీయింగ్ హ్యూమన్' ఈ- సైకిల్స్ ప్రత్యేకంగా లాంచ్ చేయనుంది. అలాగే టి.సి.ఎల్ టెలివిజన్ సెట్లలో మరో 'బై వన్ గెట్ వన్ ఫ్రీ ' ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రైమ్ వినియోగదారులు 4కే ప్యూర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ (55 అంగుళాలు) పై టీసీఎల్హెచ్డీ రెడీ టీవీ (32 అంగుళాలు)ఉచింతగా అందిస్తోంది. భారత్ తోపాటు మరో 12 దేశాల్లో ప్రైమ్ డే సేల్‌ను నిర్వహిస్తోంది.