breaking news
to the people
-
ప్రజల్లోకి వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని నెలలుగా అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ కాంగ్రెస్ పారీ్టలో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేశారని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అందుకు తగ్గ ప్రతిఫలం దక్కుతుందన్న నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కేవలం భారీ సభలకే పరిమితమైతే చాలదు. ప్రజల్లోకి వెళ్లాలి. వారితో మమేకమై పని చేయాలి. అప్పుడే వారి విశ్వాసాన్ని పొందగలం’’ అంటూ నేతలకు, శ్రేణులకు ఉద్బోధించారు. బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీలోని పలు విభాగాల చీఫ్‌లు, ముఖ్య నేతలతో ఆయన సమీక్ష జరిపారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై చర్చించారు. పార్టీ అగ్ర నేత రాహుల్గాంధఋ తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఓట్లను సీట్లుగా మార్చాలి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.92 కోట్ల ఓట్లొచ్చినా సీట్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదని ఖర్గే గుర్తు చేశారు. అందుకే దేశం కోరుతున్న మార్పు సాకారం కావాలంటే కాంగ్రెస్ శ్రేణులన్నీ అట్టడుగు స్థాయిలో రాత్రింబవళ్లు కష్టపడాలని సూచించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర విజయానికి కృషి చేయాలన్నారు. బీజేపీ పదేళ్ల వైఫల్యాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. విపక్ష ఇండియా కూటమి బలోపేతం అవుతుండటంతో పాలక ఎన్డీఏలో కలవరపాటు మొదలైందన్నారు. ప్రత్యర్థుల అబద్ధపు ప్రచారాన్ని ఎదుర్కోవాలన్నారు. దేశంలో కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని చెడగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. -
పునర్విభజనతో ప్రజల వద్దకు పాలన
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గండుగులపల్లి (దమ్మపేట): ప్రజాభీష్టం, పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం విభజిస్తోందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మధిర, ఎర్రుపాలెం మండలాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఆదివారం గండుగులపల్లిలో మంత్రిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. మధిర, ఎర్రుపాలెం మండలాలను ఖమ్మం రెవెన్యూ డివిజ¯ŒSలో కలపాలని మధిర నగర పంచాయతీ చైర్పర్స¯ŒS మొండితోక నాగరాణి సుధాకర్ విజ్ఞప్తి చేశారు. మంత్రి మాట్లాడుతూ.. పాలనను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ జిల్లాలు విభజించాలని నిర్ణయించారని చెప్పారు. జిల్లా, రెవెన్యూ డివిజన్ల విభజనపై ప్రభుత్వానికి ఆ¯ŒSలై¯ŒSలో అనేక వినతులు, ఫిర్యాదులు అందాయన్నారు. రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి జిల్లావ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖ చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆ శాఖ ఎస్ఈ లింగయ్య, ఈఈ రవీంద్ర కుమార్, డీఈఈ తానేశ్వర్ను మంత్రి తుమ్మల ఆదేశించారు. సత్తుపల్లి–పట్వారిగూడెం రోడ్డు పనులను ఎన్నాళ్లు చేస్తారని ప్రశ్నించారు. సత్తుపల్లి మండలం గంగారంలో విస్తరణ పనులను ఈ నెల 24న పర్యవేక్షిస్తానన్నారు. గంగారం నుంచి మందలపల్లి వరకు రాష్రీ్టయ రహదారి విస్తరణ ఎలా చేశారో.. తాళ్లమడ నుంచి సత్తుపల్లి వరకు కూడా అలాగే చేయాలని ఆదేశించారు. అశ్వారావుపేటలో రూ.17 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ విస్తరణ పనులు పూర్తిచేసిన తర్వాతనే సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరవుతాయని స్పష్టం చేశారు. అప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ పనులను రైతులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో డీసీసీబీ చైర్మ¯ŒS మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ వైస్ చైర్మ¯ŒS బోయినపల్లి సుధాకర్, టీఆర్ఎస్ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, మచ్చా శ్రీనివాసరావు, ఎస్ఏ రసూల్, చల్లగుâýæ్ల నరసింహారావు, కోటగిరి బుజ్జి, పసుమర్తి చంద్రరావు, చింతనిప్పు సత్యనారాయణ, చక్కిలాల లక్ష్మణరావు, కాసాని నాగప్రసాద్, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, కురిశెట్టి సత్తిబాబు, పానుగంటి రాంబాబు తదితరులు ఉన్నారు.


