breaking news
Pedestrians Into Air
-
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
న్యూయార్క్: అమెరికాలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో కనీసం 20 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. అందులో ఒక కారు ప్రమాదం జరిగిన తరువాత పాదచారులపైకి దూసుకెళ్లడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని స్థానిక మీడియా పేర్కొంది. న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీ సమీపంలోని షోహారీ కౌంటీలో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ఎస్యూవీ మోడల్ కారు సమీపంలోని ఓ కేఫ్‌లోకి చొచ్చుకెళ్లిందని పోలీసులు చెప్పారు. ఆ కారులో కొందరు పెళ్లి విందుకు వెళ్తున్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. మృతుల్లో కార్లలో ప్రయాణిస్తున్నవారెందరు? పాదచారులెందరున్నారో ఇంకా వెల్లడికాలేదు. కానీ కేఫ్ బయట పలువురి మృతదేహాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభమైంది. ప్రమాదానికి కారణం తెలియరాలేదు. -
గాల్లో ఐదుగురు బంతిలా ఎగిరిపడ్డారు
చెన్నై: చెన్నైలో ఓ కారు భీభత్సం సృష్టించింది. అడ్డొచ్చిన వారిని గాల్లోకి బంతుల్లాగా ఎగరేసింది. దాని వేగం భారిన పడిన మొత్తం ఐదుగురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా కూడా చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో ఉంచిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందులో రికార్డయిన ప్రకారం చెన్నైలోని మంగళవారం రాత్రి ఓ వీధిలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్లగా మరో ముగ్గురు వ్యక్తులు కాస్త రోడ్డు మీదుగానే నడుస్తూ వెళుతున్నారు. అదే సమయంలో ఓ గోడకు ఢీకొని అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చిన ఎర్రటి శాంత్రో కారు వారిని బలంగా ఢీకొట్టింది. అందులో ముగ్గురు చెల్లా చెదురుగా పడిపోగా మరో ఇద్దరు కొద్ది సేపు కారు బానెట్‌పైనే ఉండిపోయి కొద్ది సేపటి తర్వాత గాల్లోకి బంతుల్లాగా ఎగిరిపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగితావారు గాయాలపాలయ్యారు. అయితే, ఆ కారు డ్రైవర్‌ను వెంకటేశ్ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడు మంచి అనుభవం ఉన్న డ్రైవరేనని, కానీ గోడకు కారు ఢీకొనడంతో బ్రేక్ వేయాల్సింది అనుకోకుండా ఎక్స్లేటర్మీద కాలు పెట్టడం వల్ల అమాంతం కారు పాదచారులపైకి దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు.