breaking news
outer road
-
డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్: ముగ్గురి మృతి
పహాడీషరీఫ్: డీసీఎం వ్యాన్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు మార్బుల్స్ మధ్య నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్ నుంచి డీసీఎం వ్యాన్ (ఏపీ 28 టీఏ2410) కల్వకుర్తి వైపు మార్బుల్స్ లోడ్‌తో ఏడుగురు కార్మికులను ఎక్కించుకుని వెళుతోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్డు తుక్కుగూడ గ్రామం వద్దకు రాగానే డీసీఎం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనాన్ని టోల్గేట్ డివైడర్‌కు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో షాపూర్ గ్రామానికి చెందిన రాములు(32), సాయిలు(40), కూకట్‌పల్లికి చెందిన శ్రీను(35)లు మార్బుల్స్ మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఎ.సంగయ్య(50), సత్యనారాయణ(48), పండరీ (32), ఎర్ర సాయిలు(40)కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఔటర్ రింగ్‌రోడ్‌పై టోల్ మోత!
-
ఔటర్‌పై టోల్ మోత!
► 30 నుంచి 40 శాతం పెరగనున్న చార్జీలు ► పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసిన హెచ్ఎండీఏ ► నిర్వహణ భారం పెరగడం.. ఆదాయం తగ్గడమే కారణం ► ఇతర హైవేలపై అధ్యయనం తర్వాత పెంపునకు నిర్ణయం ► ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. త్వరలో అమల్లోకి కొత్త చార్జీలు సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)పై టోల్ మోత మోగనుంది. వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ రుసుములను భారీ గా పెంచేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కసరత్తు చేస్తోంది. టోల్ చార్జీలు సుమారు 30 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓఆర్ఆర్ నిర్వహణ వ్యయం అధికమవ్వడం.. ఆదాయం తక్కువగా వస్తుండడంతో చార్జీల పెంపు అంశం తెరపైకి వచ్చింది. ప్రతిపాదిత టోల్ చార్జీలను రెండు మూడు రోజుల్లో హెచ్ఎండీఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిం చనున్నట్లు తెలిసింది. దీనిపై ఆమోద ముద్ర పడితే నూతన చార్జీలు అమల్లోకి వస్తారుు. టోల్ చార్జీలు ఇలా.. నగరంపై వాహన భారం తగ్గించడంతోపాటు ప్రయాణికులను సులభంగా గమ్యానికి చేర్చేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ చుట్టూ 2008లో 158 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఎనిమిది వరుసలతో 2008లో ప్రారంభమైన ఈ నిర్మాణం.. తుదిదశకు చేరుకుంది. 156.90 కి.మీ. ఓఆర్ఆర్ పనులు ముగియడంతో ఆ దారిలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారుు. నిత్యం 65 వేలకుపైగా వాహనాలు తిరుగుతుండగా.. టోల్ చార్జీల రూపంలో హెచ్ఎండీఏకు ఏడాదికి సుమారు రూ.100 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అరుుతే టోల్ ద్వారా వస్తున్న ఈ మొత్తం కంటే ఓఆర్ఆర్ నిర్వహణ ఖర్చు అధికంగా ఉండడంతో హెచ్ఎండీఏపై భారం పడుతోంది. దీని నుంచి గట్టెక్కేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఔటర్‌పై ప్రతి కిలోమీటర్‌కు కారు, జీపు, వ్యాన్లకు రూ.1.05, మినీ బస్సులకు రూ.1.69, బస్సు, రెండు యాక్సెల్ ట్రక్కు రూ.3.53, మూడు యాక్సెల్ ట్రక్కులకు రూ.3.85, 4 నుంచి 7 యాక్కెల్ ట్రక్కులకు రూ.5.54, 7కు పైగా యాక్సెల్ కలిగిన వాహనాలకు రూ.6.74 టోల్ చార్జీ వసూలు చేస్తున్నారు. హైవేలపై పోలిస్తే చాలా తక్కువ.. జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ చార్జీలతో పోల్చుకుంటే.. ఓఆర్ఆర్ టోల్ చార్జీలు చాలా తక్కువగా ఉన్నారుు. ఇటీవల హెచ్ఎండీఏ అధికారులు పలు నేషనల్ హైవేల్లో చేసిన అధ్యయనంలో ఇది తేలింది. అంతేగాక ఆ రహదారులతో పోల్చుకుంటే.. ఓఆర్ఆర్ నిర్వహణ వ్యయం అధికంగా ఉంది. పైగా జాతీయ రహదారులు ఆరు లేన్లకు మించకపోగా.. ఓఆర్ఆర్ ఎనిమిది లేన్లతో కూడుకున్నది. దీంతోపాటు ఔటర్ చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ మేరకు నిధులను ఖర్చు చేయాల్సి వస్తోంది. రూ.6,696 కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో జైకా నుంచి రూ.3,558 కోట్లను హెచ్ఎండీఏ రుణంగా తీసుకుంది. దీనిని క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంది. జాతీయ రహదారులకు ఇటువంటి ఇబ్బంది లేదు. ఉన్న రోడ్లనే వెడల్పు చేస్తూ వచ్చారు. తద్వారా కొంత మేరకు నిర్మాణ ఖర్చు తగ్గినట్లే. ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఔటర్ నిర్వహణ సంక్లిష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. టోల్ చార్జీలు పెంచే అంశంలో ఇదే విషయాన్ని ప్రభుత్వానికి వివరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలోనే చార్జీల పెంపు ప్రతిపాదనను అధికారులు తీసుకెళ్లగా.. సర్కారు వివరణ అడిగింది. ఈ క్రమంలో పైఅంశాలనే ప్రభుత్వానికి వివరించే అవకాశాలు ఉన్నాయి.