breaking news
One-third
-
వాయిదాలపై చెల్లిద్దాం..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో మూడింట ఒక వంతు రుణ ఆధారితమేనని ‘ఫి కామర్స్’ సంస్థ వెల్లడించింది. 2024 సంవత్సరంలో 20,000 మర్చంట్ లావాదేవీలను అధ్యయనం చేసి ఈ వివరాలు విడుదల చేసింది. ప్రతి మూడు డిజిటల్ చెల్లింపుల లావాదేవీల్లో క్రెడిట్‌కార్డు, వడ్డీతో కూడిన ఈఎంఐలు ఒకటి ఉండడం గమనార్హం. మొత్తం లావాదేవీల్లో యూపీఐతో చేసినవి 65 శాతంగా ఉన్నట్టు ఫి కామర్స్ తెలిపింది. స్వల్ప, మధ్య స్థాయి చెల్లింపులను ఎక్కువగా యూపీఐ సాయంతో చేస్తుంటే, పెద్ద లావాదేవీలు క్రెడిట్ కార్డులు, ఈఎంఐల రూపంలో ఉంటున్నాయి. ఫీజుల చెల్లింపులు, వైద్య పరమైన చెల్లింపులకు క్రెడిట్‌కార్డులను ఉపయోగిస్తున్నారు. పండుగల సందర్భంగా కొనుగోళ్లు, స్కూళ్లలో ప్రవేశాలు, సీజన్ వారీ అవసరాలకు రుణాలనే నమ్ముకుంటున్నారు. అంటే స్వల్పకాల రుణాలకు వినియోగదారులు క్రెడిట్ కార్డులు, రుణ ఈఎంఐలపై ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యా సంబంధిత చెల్లింపులకు 10 శాతం, హెల్త్‌కేర్ చెల్లింపులకు 15 శాతం, ఆటో విడిభాగాల కొనుగోళ్లకు 15 శాతం మేర రుణ సాధనాల ఆధారితంగానే చెల్లిస్తున్నారు. ఒకేసారి చెల్లింపుల కంటే రుణ ఆధారిత చెల్లింపులకు ఆసక్తి చూపిస్తున్నట్టు.. వినియోగదారుల ధోరణిలో మార్పునకు ఈ ఫలితాలు నిదర్శమని ఈ నివేదిక పేర్కొంది. -
Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ మోదీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. అయితే జన గణన, డీ లిమిటేషన్ వంటివాటితో నిమిత్తం లేకుండా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే మూడో వంతు రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా వర్తింపజేయాలన్నారు. బుధవారం లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చను విపక్షాల తరఫున ఆమె ప్రారంభించారు. రిజర్వేషన్ల అమలులో ఏ మాత్రం ఆలస్యం చేసినా అది భారత మహిళల పట్ల దారుణ అన్యాయమే అవుతుందని అన్నారు. ‘కుల గణన జరిపి తీరాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఇందుకోసం తక్షణం కేంద్రం చర్యలు చేపట్టాలి‘ అని పునరుద్ఘాటించారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగతాన్నీ, భావోద్వేగాలను కూడా రంగరిస్తూ సాగిన ప్రసంగంలో సోనియా ఏమన్నారంటే... ‘దేశాభివృద్ధిలో మహిళల పాత్రను సముచితంగా గుర్తుంచుకునేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది సరైన సమయం. అందుకే, నారీ శక్తి విధాన్ అధినియమ్‌కు కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా మద్దతిస్తుంది. దాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలి. ఆ దారిలో ఉన్న అడ్డంకులను తలగించాలి‘. వంటింటి నుంచి అంతరిక్షం దాకా... ‘మసిబారిన వంటిళ్ల నుంచి ధగధగా వెలిగిపోతున్న స్టేడియాల దాకా, అంతరిక్ష సీమల దాకా భారత మహిళలది సుదీర్ఘ ప్రయాణం. అటు పిల్లలను కని, పెంచి, ఇటు ఇల్లు నడిపి, మరోవైపు ఉద్యోగాలూ చేస్తూ అంతులేని సహనానికి మారుపేరుగా నిలిచింది మహిళ. అలాంటి మహిళల కష్టాన్ని, గౌరవాన్ని, త్యాగాలను సముచితంగా గుర్తించినప్పుడు మాత్రమే మానవతకు సంబంధించిన పరీక్షలో మనం గట్టెక్కినట్టు‘. స్వాతంత్య్ర పోరులోనూ నారీ శక్తి ‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, అనంతరం ఆధునిక భారత నిర్మాణంలో కూడా భారత మహిళలు పురుషులతో భుజం కలిపి సాగారు. కుటుంబ బాధ్యతల్లో మునిగి సమాజం, దేశం పట్ల తమ బాధ్యతలను ఎన్నడూ విస్మరించలేదు. సరోజినీ నాయుడు, సుచేతా కృపాలనీ, అరుణా అసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్, రాజ్ కుమార్ అమృత్ కౌర్, ఇంకా ఎందరెందరో మహిళామణులు మనకు గర్వకారణంగా నిలిచారు. గాం«దీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ తదితరుల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ వంతు పాత్ర పోషించారు‘. రాజీవ్ కల.. అప్పుడే సాకారం ‘చట్ట సభల్లో మహిళలకు సముచిత ప్రాతి నిధ్యం దక్కాలన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు ఆమోదం పొందినప్పుడే అది పూర్తిగా సాకారవుతుంది. నేనో ప్రశ్న అడగాలనుకుంటున్నా. భారత మహిళలు తమ రాజకీయ బాధ్యతలను తలకెత్తుకునేందుకు 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇప్పుడు కూడా వారిని ఇంకా ఆరేళ్లు, ఎనిమిదేళ్లు... ఇలా ఇంకా ఆగమంటూనే ఉన్నారు. భారత మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన సరైనదేనా?‘ మహిళా శక్తికి ప్రతీక ఇందిర... ఇక దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వం భారత మహిళల శక్తి సామర్థ్యాలను తిరుగులేని ప్రతీకగా ఇప్పటికీ నిలిచి ఉంది. వ్యక్తిగతంగా నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన సందర్భం. మహిళలకు స్థానిక సంస్థల్లో మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ నా జీవిత భాగస్వామి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తొలిసారిగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. కానీ రాజ్యసభలో ఆ బిల్లును కేవలం ఏడు ఓట్లతో ఓడించారు. అనంతరం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాస్ చేయించింది. ఫలితంగా నేడు 15 లక్షలకు పైగా మహిళలు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా రాణిస్తున్నారు‘. -
పేదల్లో మూడోవంతు భారత్‌లోనే!
ఐరాస సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల తాజా నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: ప్రపంచంలోకెల్లా అత్యంత నిరుపేదల్లో మూడోవంతు మంది భారత్‌లోనే ఉన్నారని ‘ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల’ తాజా నివేదిక వెల్లడించింది. అలాగే ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల మరణాలు కూడా భారత్‌లోనే అత్యధికమని తేల్చింది. ఈ నివేదికను కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది ఓ సవాలని, దీన్ని కచ్చితంగా అధిగమిస్తామని అన్నారు. ‘‘పేదరికం అన్నది చాలా పెద్ద సవాలు.. తదుపరి నివేదిక వచ్చేసరికి మనం కచ్చితంగా కాస్త మెరుగుపడగలమని నాకు విశ్వాసముంది’’ అని పేర్కొన్నారు. ‘అందరితో కలిసి, అందరికీ అభివృద్ధి’ అని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పేదరిక నిర్మూలనకు చాలా చిత్తశుద్ధితో కృషి చేస్తారన్నారు. ఈ నివేదికలో చాలా అభివృద్ధి సూచికలపై చర్చ ఉన్నప్పటికీ.. వాటిలో భారత్‌కు అనుకూలంగా ఏదీ లేదన్నారు. నివేదికలో ముఖ్యాంశాలు ►భారత్‌లో 60 శాతం మంది ఇప్పటికీ బహిర్భూమికే వెళుతున్నారు. ►ప్రపంచంలో సంభవిస్తున్న ప్రసూతి మరణాల్లో 17 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. ►నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ తర్వాత స్థానంలో చైనా ఉంది. ►ప్రపంచ నిరుపేదల్లో 13 శాతం మంది చైనాలో, 9 శాతం మంది నైజీరియాలో, 5 శాతం మంది బంగ్లాదేశ్‌లో ఉన్నారు.