breaking news
oc
-
లబ్ధి కోసమే ఓసీలకు రిజర్వేషన్లు
హైదరాబాద్: రాజకీయ లబ్ధికోసమే బీజేపీ ప్రభుత్వం ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ బిల్లును తీసుకువచ్చిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యం లో ఓసీలకు కల్పించిన రిజర్వేషన్ బిల్లును వెం టనే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఓసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పాస్ చేయడం నిం డు దర్బార్‌లో ద్రౌపదీ వస్త్రాపహరణం జరి గి నట్లు ఉందన్నారు. ఆనాడు కౌరవులు మహాసభలో కళ్లుమూసుకుని దీనికి మద్దతు పలికినట్లుగా ఈనాడు లోక్‌సభలో ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపారన్నారు. రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంటే తప్ప బడుగులకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఇలాంటి విధానాల వల్ల రిజర్వేషన్ల ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాలవారంతా ఏకమై రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. టీపీఎఫ్ అధ్యక్షుడు నలమాస కృష్ణ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ ప్రధాన కార్యదర్శి మెంచు రమేశ్, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటి, సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, రవి చంద్ర, తెలంగాణ రైతాంగ సమితి నాయకుడు సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడు అలా..ఇప్పుడు ఇలా!
తాడేపల్లిరూరల్: తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టగానే అంచెలంచెలుగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేసేందుకు కొత్త కొత్త విధానాలను అమలు చేస్తోంది. దానిలో భాగంగా మహ్మద్ ఇంటి పేరు కలిగిన ముస్లిం లకు తీవ్ర ద్రోహం తలపెట్టింది. ప్రస్తుతం వారికి ఓసి సర్టిఫికెట్ ఇస్తాం, బిసి సర్టిఫికెట్లు ఇవ్వమంటూ చెప్పడంతో, చదువుకునే విద్యార్థుల్లోను, వారి తల్లిదండ్రుల్లోను ఆందోళన ప్రారంభమైంది. 2014లో బీసీ–ఈ గా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ఓసి సర్టిఫికెట్ ఇస్తామని తెలపడంతో, గతంలో విద్యను అభ్యసించిన వారు బీసీ–ఈ సర్టిఫికెట్ పొంది ఉన్న వారు ఓసి సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఆందోళన చెందుతున్నారు. 2014లో పదో తరగతి పూర్తిచేసుకున్న ఓ విద్యార్థి ప్రస్తుతం బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుకునేందుకు సర్టిఫికెట్ అవసరం కావడంతో మంగళగిరిలోని ఓ ఈ–సేవా కేంద్రంలో కుల ధ్రువీకరణ పత్రం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం మహ్మద్‌లకు బీసీ–ఈ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని, ఓసీ సర్టిఫికెట్ ఇస్తామని, కావాలంటే తీసుకోవచ్చని చెప్పడంతో, ఆ విద్యార్థి తల్లితండ్రులకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. తల్లిదండ్రులు కూడా ఈసేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయగా, వెబ్సైట్లో ఓసీ సర్టిఫికెట్టే ఓపెన్ అవుతుందని, బీసీ–ఈ ఓపెన్ కావడం లేదని, 2014 తర్వాత మహ్మద్‌లకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వడంలేదని తెలియచేశారు. మీ ప్రాంతంలోని తహసీల్దార్‌ను వివరణ అడగాలని చెప్పడంతో తాడేపల్లికి చెందిన ఎం.డి.చాంద్‌బాషా తహసీల్దార్‌ను కలిసి తన గోడును వివరించుకున్నాడు. ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి ఈ సమస్యను చెప్పుకోవాలని సూచించారు. 2014లో ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలు 2018లో ఎందుకివ్వరో తెలిపాలని ప్రశ్నించినా, తహసీల్దార్ దగ్గరనుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో సామాన్యుడైన చాంద్‌బాషా ఏం చేయాలో అర్థంకాక వెనుదిరిగి వెళ్లాడు. ఇప్పుడేం చేయాలి నా కుమారుడు అమీర్‌కు 2014లో బీసీ–ఈ సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నాం. ఓసీ సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. ఒకే విద్యార్థి రెండు రకాల కుల ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉంటే, భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులకు తెలియదా. మహ్మద్ ఇంటిపేరు కలవారిని చిన్నచూపు చూస్తూ ఓసీలుగా ధ్రువీకరించడం ఏంటో అర్థం కావడంలేదు. –ఎండీ.చాంద్‌బాషా లంచం ఇస్తే ఎలా ఇచ్చారు వేరేవారికి ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలను చూపించి, చేతులు తడిపితే తప్ప బీసీ–ఈ సర్టిఫికెట్ ఇవ్వలేదు. తాడేపల్లి మున్సిపాలిటీలో బీసీలకు కార్పొరేషన్ లోన్లు అందచేయడంతో వాటికి దరఖాస్తు చేసుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రం అడిగాం. మొదట ఓసి సర్టిఫికెట్టే ఇస్తామన్నారు. నులకపేటలో మహ్మద్‌లకు ఇచ్చిన బీసీ–ఈ కుల ధ్రువీకరణపత్రాలను చూపించి చేతులు తడిపితే తప్ప ఇవ్వలేదు. – ఎండీ మస్తాన్‌వలి -
విజయనగరంలో బీసీ వర్సెస్ ఓసీ
-
జమ్మికుంటలో 'ఓసీ' మహాగర్జన
జమ్మికుంట(కరీంనగర్): జమ్మికుంటలోని ఎంటీఆర్ గార్డెన్స్‌లో సోమవారం 'ఓసీ' మహాగర్జన జరుగుతోంది. ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో వెలమ, బ్రాహ్మణ, రెడ్డి, వైశ్యతో పాటు పలు ఓసీ కులాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓసీల సమస్యలు, రిజర్వేషన్ల అంశంపై ఈ సభలో ఏకరువు పెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లా భాస్కర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.