breaking news
nri ysrcp
-
డల్లాస్‌లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
డల్లాస్ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎన్ఆర్ఐ వైఎస్సార్సీ విభాగం ఆధ్యర్యంలో డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. డల్లాస్‌లోని ప్రవాసాంధ్రులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఏపీలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనంటూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అండగా నిలిస్తామని ఎన్ఆర్ఐలు తెలిపారు. తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఏపీలో రానున్న ఎన్నికల్లో పునావృతమవుతాయని, టీడీపీ ఓటమి ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. నాలుగున్నర ఏళ్లుగా వైఎస్ జగన్ ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారని, ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
డల్లాస్‌లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
వైఎస్ఆర్కు ఎన్నారైల ఘన నివాళి
ఎన్నారై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు పట్టణాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతిని నిర్వహించారు. గత జూలైలో అట్లాంటాలో విజయవంతంగా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించినట్లుగానే వర్థంతి వేడుకలు జరిపారు. దేశ వ్యాప్తంగా వైఎస్ మద్దతుదారులు ఈ కార్యక్రమంలో భారీఎత్తున పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన అనంతరం పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తధాన శిబిరాలతోపాటు పేదవారికి అన్నధాన కార్యక్రమం, పండ్లపంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా డల్లాస్, మేరీలాండ్, ఫిలడెల్పియాలో జరిగిన వర్ధంతి కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, చలమలశెట్టి సునీల్, గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎన్నారై వైఎస్ఆర్సీపీ కమిటీ సభ్యులు వల్లూరి రమేశ్ రెడ్డి, వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్, కోర్ కమిటీ సభ్యులు మక్తాపురం కిరణ్, కాకుమాని ప్రసన్న, దేవపట్ల రామ్ గోపాల్, పోలం విజయ్ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం విజయవంతమైంది.