breaking news
North Korean crisis
-
ఉత్తర కొరియాకు చైనా ఝలక్
బీజింగ్ : వరుస అణుపరీక్షలతో ప్రపంచాన్ని భయపెడుతున్న ఉత్తర కొరియా మీద ఆంక్షల బాంబు ఇప్పడే పడింది. ఉత్తర కొరియాకు అత్యంత సన్నిహిత, ఆత్మీయ దేశంగా ఉన్న చైనా.. తొలి అడుగు వేసింది. ఉత్తర కొరియాకు 90 శాతం వ్యాపార భాగస్వామిగా ఉన్న చైనా.. ఐక్యరాజ్య సమితి ఆంక్షల దృష్ట్యా తన నిస్సహాయతను ప్రకటించింది. చైనాలో ఉన్న ఉత్తర కొరియా పరిశ్రమలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూసివేయాలని చైనా వాణిజ్య శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. వరుస అణుపరీక్షల నేపథ్యంలో ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అందులో భాంగంగానే చైనా ఉత్తరి కొరియా పరిశ్రమల మీద నిషేధాజ్ఞాలు జారీ చేసింది. ఉత్తర కొరియాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా చైనా ఉంది. ఇరు దేశాల మధ్య 90 శాతం వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో చైనా కూడా సమితి ఆంక్షలను అమలు చేయడంతో ఉత్తర కొరియా అర్థికంగా పతనమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర కొరియాపై చైనా ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. అమెరికా ఉన్నతాధికారి రెక్స్ టెల్లిర్‌సన్ వచ్చే వారం బీజింగ్‌లో పర్యటించనున్నారు. ఉత్తర కొరియా ఆర్థిక మూలాలను దెబ్బతీయండం కోసమే ఆయన చైనాలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యితో చర్చలు జరుపుతారు. -
భారత్ చెబితే ఉత్తర కొరియా వింటుంది: అమెరికా
న్యూయార్క్: ఉత్తర కొరియా అణు సంక్షోభ సమస్యను భారత్ తీర్చగలదని అమెరికాకు చెందిన ఉన్నత శ్రేణి కమాండర్ అడ్మిరల్ హ్యారీ హ్యారీస్ విశ్వాసం వ్యక్తం చేశారు. మిగితా దేశాలతో పోలిస్తే భారత్‌ది చాలా బలమైన గొంతు అని, సమస్యను చాలా చక్కగా వివరించగల సొత్తు భారత్ సొంతమని ఆయన తెలిపారు. 'భారత్‌ది చాలా పెద్ద స్వరం అని నేను అనుకుంటున్నాను. భారత్ స్వరాన్ని ప్రజలు వింటారు. ఉత్తర కొరియా విషయంలో భారత్ సహాయం చేయగలదు. ఉత్తర కొరియా చేస్తున్న పనులు ఎంత ప్రమాదకరమైనవని అమెరికా భావిస్తుందో అదే విషయాన్ని భారత్ మరింత స్పష్టంగా ఉత్తర కొరియాకు అదే విదంగా ప్రపంచానికి చెప్పగలదు' అని ఆయన అన్నారు. ఈ విషయంలో భారత్ ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటుందో ఆ దేశమే నిర్ణయించుకోవాలని చెప్పారు. గత నెలలో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన అనంతరం అమెరికా ఉత్తర కొరియా మధ్య తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.