breaking news
NGO bhavan
-
సమైక్య పోరుకు సన్నద్ధం కావాలి
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో సైతం ఓడించడానికి సీమాంధ్రులు సమైక్యపోరుకు సన్నద్ధం కావాలని గజల్ శ్రీనివాస్ అన్నారు. నగరంలోని ఎన్జీఓ భవన్‌కు మంగళవారం ఆయన విచ్చేసి ఎన్జీఓ సంఘనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఈనెల 9న నిర్వహించనున్న సమైక్యరన్‌లో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
ఉద్యమం ఉధృతం
పనబాక లక్ష్మి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆమె ఇంటి గేటు వద్ద దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు. నెల్లూరులో ఎన్జీఓ భవన్లో నీటిపారుదల శాఖ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. వీఆర్సీ కూడలిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయంపైకి ఎక్కి మండుటెండలో నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. గూడూరులో జేఏసీ ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ కూడలిలో దీక్షలు కొనసాగుతున్నాయి. కావలిలో వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ట్రంకు రోడ్డుపై సమైక్యాంధ్ర జేఏసీ నిర్వాహకులు రాస్తారోకో చేసి ఆటాపాట నిర్వహించారు. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కాశీపేట సెంటర్ వరకు భిక్షాటన చేశారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో రైతులు పాల్గొన్నారు. సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. నగరంలో ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బుధవారం కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించారు. అలాగే బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడి ఇంటి ముట్టడికి యత్నించారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, సమైక్యవాదులు 78వ రోజు నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు. ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆమె ఇంటి గేటు వద్ద దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు. నెల్లూరులో ఎన్జీఓ భవన్లో నీటిపారుదల శాఖ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. వీఆర్సీ కూడలిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయంపైకి ఎక్కి మండుటెండలో నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. గూడూరులో జేఏసీ ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ కూడలిలో దీక్షలు కొనసాగుతున్నాయి. కావలిలో వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ట్రంకు రోడ్డుపై సమైక్యాంధ్ర జేఏసీ నిర్వాహకులు రాస్తారోకో చేసి ఆటాపాట నిర్వహించారు. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కాశీపేట సెంటర్ వరకు భిక్షాటన చేశారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో రైతులు పాల్గొన్నారు.