ఆంధ్రప్రదేశ్ ‘డబుల్’
హైదరాబాద్: పంచాయత్ యువ క్రీడా ఔర్ ఖేల్ అభియాన్ (పైకా) జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. జార్ఖండ్‌లోని రాంచీలో గురువారం ఈ పోటీలు ముగిశాయి. అండర్-16 విభాగం టీమ్ చాంపియన్‌షిప్‌లో ఏపీ బాలబాలికల జట్లు విజేతలుగా నిలిచాయి.
బాలుర విభాగంలో 25 పాయింట్లతో ఏపీ అగ్రస్థానంలో నిలవగా, బాలికల విభాగంలో 17 పాయింట్లు సాధించిన రాష్ట్ర జట్టు ప్రథమ స్థానం అందుకుంది. ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టింగ్‌లో 5 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్య పతకం సాధించింది. ఎం.రమేశ్ బాబు (పశ్చిమ గోదావరి), కె. శివశంకర్ రెడ్డి (కర్నూలు) కోచ్‌లుగా వ్యవహరించారు.
పతకాలు గెలుచుకున్న లిఫ్టర్లు (బాలురు): పి. యేసుబాబు (ప్రకాశం)-56 కేజీలు (స్వర్ణం), కె. కార్తీక్ (తూర్పుగోదావరి)-69 కేజీలు (స్వర్ణం), జి. రాజశేఖర్ (కృష్ణా) -85 కేజీలు (స్వర్ణం), ఆరిఫ్ (కర్నూలు)-ప్లస్ 94 కేజీలు (స్వర్ణం), ఎస్. ఇమామ్సాహబ్ (కర్నూలు)-94 కేజీలు (రజతం). బాలికలు: ఎం. ప్రశాంతి (కృష్ణా)-58 కేజీలు (స్వర్ణం), ఎం. రేవతి (విజయనగరం)-44 కేజీలు (రజతం), అనురాధ (విజయనగరం)-48 కేజీలు (రజతం), పి. షకీలా (కర్నూలు), ప్లస్ 69 కేజీలు (రజతం), బి. శ్రీశరణ్య (వైజాగ్)-53 కేజీలు (కాంస్య
రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల క్రీడల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో ‘డి’ బ్లాక్ జట్టు విజేతగా నిలిచింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ‘డి’ బ్లాక్ జట్టు 7 వికెట్ల తేడాతో ‘ఎల్’ బ్లాక్ జట్టుపై విజయం సాధించింది. తొలుత ఎల్ బ్లాక్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. మోహన్ 26, నరేష్ 24 పరుగులు చేశారు. 67 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన డి బ్లాక్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసి గెలిచింది.