breaking news
National sport
-
ఈ విషయంలో కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం
Supreme Court Rejects Plea To Recognize Hockey As India's National Game: హాకీని జాతీయ క్రీడగా అధికారికంగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని భారత దేశపు అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిల్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని తగు రీతిలో తాము ఆదేశించలేమంటూ స్పష్టం చేసింది. క్రికెట్ వల్ల హాకీ తన ప్రభావాన్ని కోల్పోతోందని.. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. విశాల్ తివారీ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఇందులో తాము చేయడానికి ఏమీ లేదని, పిటిషనర్ కోరిన విధంగా తాము కేంద్రాన్ని ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలపై ప్రజల్లో చైతన్యం రావాలని అభిప్రాయపడింది. మహిళా బాక్సర్ మేరీకోమ్ వంటి క్రీడాకారిణిలు ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించారని, ఆ స్ఫూర్తి అందరిలో కనిపించాలని పేర్కొంది. బెంచ్ ఆదేశాలతో విశాల్ తివారీ తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. చదవండి: టీమిండియా గెలుపు.. నాగిని డ్యాన్స్‌తో ఖుషీ చేసుకున్న మాజీ క్రికెటర్ -
తెలంగాణకు మూడు రజతాలు
రోయింగ్‌లో రాణింపు * ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్‌కు రజతం * జాతీయ క్రీడలు తిరువనంతపురం: తొలిసారి జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్రం పతకాల వేట ప్రారంభించింది. క్రీడల రెండో రోజున రోయింగ్‌లో తెలంగాణకు మూడు రజత పతకాలు లభించాయి. పురుషుల కాక్స్‌వెయిన్స్ లెస్ పెయిర్స్ విభాగంలో మంజీత్ సింగ్-దవీందర్ సింగ్ జంట రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సాధించింది. పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ 2000 మీటర్ల విభాగం ఫైనల్లో జస్కరణ్ సింగ్-కన్నన్ ద్వయం కూడా రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల కాక్స్డ్ ఎయిట్ 2000 మీటర్ల ఫైనల్ రేసులో ప్రశాంత్ నాయర్, హరీష్ పూనాటి, దలీప్ షెఖావత్, అనిల్ సిలోట్, మంజీత్ సింగ్, శ్రీకాంత్ వెల్ది, బీరి సింగ్, ప్రవీణ్, దవీందర్ సింగ్‌లతో కూడిన తెలంగాణ జట్టు రెండో స్థానాన్ని దక్కించుకొని రజతం గెల్చుకుంది. టెన్నిస్ టీమ్ విభాగంలో తెలంగాణ పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో విష్ణువర్ధన్, కాజా వినాయక్ శర్మ, షేక్ అబ్దుల్లాలతో కూడిన తెలంగాణ పురుషుల జట్టు 2-0తో హరియాణాపై నెగ్గగా... నిధి చిలుముల, సౌజన్య భవిశెట్టి, ఇస్కా తీర్థలతో కూడిన తెలంగాణ మహిళల జట్టు 2-0తోనే హరియాణా జట్టును ఓడించింది. మరోవైపు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నాలుగో పతకం లభించింది. తొలి రోజున శ్రీనివాసరావు స్వర్ణం, బంగారు ఉష, వెంకటలక్ష్మీ కాంస్యాలు అందించగా... రెండో రోజున విజయనగరం జిల్లాకే చెందిన రామకృష్ణ 69 కేజీల విభాగంలో రజతం సాధించాడు. రామకృష్ణ స్నాచ్‌లో 124 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 157 కేజీలు ఎత్తి ఓవరాల్‌గా 281 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు