Narayana Medical College
-
నారాయణ మెడికల్ కాలేజీలో దారుణం
-
నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్! విద్యార్థి ఆత్మహత్య
సాక్షి,నెల్లూరుజిల్లా: నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌కు విద్యార్థి బలయ్యాడు. తోటి విద్యార్థుల లైంగిక వేధింపులతో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు అంతస్తు నుంచి దూకి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విద్యార్థి మృతిని నారాయణ కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం, స్టూడెంట్స్ ర్యాగింగ్ వల్లే ప్రదీప్ చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నారాయణ మెడికల్ కాలేజీలో అక్రమాలు..ఏసీబీ తనిఖీల్లో కీలక ఆధారాలు
-
నారాయణ మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ సాక్షి, అమరావతి: ‘తమ బిడ్డలకు వైద్య విద్య థియరీ పరీక్షల్లో 90 శాతం, 88 శాతం మార్కులొచ్చాయి. అయితే ప్రాక్టికల్ పరీక్షల్లో మాత్రం ఫెయిల్ చేశారు.’ ఇది అన్యాయమంటూ పలువురు వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం నగరంలోని నారాయణ మెడికల్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు సరిగా ప్రాక్టికల్స్ చేయలేదని యాజమాన్యం చెబుతోందని తెలిపారు. అయితే, థియరీ పరీక్షల్లో 90, 88, 85 మార్కులు ఎలా వచ్చాయో తెలపాలంటూ డిమాండ్ చేశారు. వైద్యకళాశాల డీన్, అధ్యాపకులు మళ్లీ పరీక్షలు రాసుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు తమ వద్దకు ట్యూషన్‌కు రావాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. వైద్య కళాశాల వద్ద ఆందోళన అనంతరం పలువురు మెడికోల (వైద్య విద్యార్థులు) తల్లిదండ్రులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు కళాశాల డీన్ మాట్లాడుతూ గత నెలలో నారాయణ కళాశాలలో నిర్వహించిన ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ పార్ట్–2 ప్రాక్టికల్ పరీక్షల్లో కొంత మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. ఇందుకు కళాశాలను నిందించడం దురదృష్టకరమన్నారు. అంతమంది ఫెయిల్ అవ్వడానికి కారణమేంటి? ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్–2 పరీక్షల్లో నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్ కావడంతో పలువురు తల్లిదండ్రులు ఈ విషయాన్ని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బాబ్జీ దృష్టికి తీసుకువచ్చారు. యాజమాన్యం చేసిన తప్పిదాల వల్లే తమ పిల్లలు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలియజేయాలని నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్‌ను విశ్వవిద్యాలయం వివరణ కోరింది. కళాశాలలో సుమారు 250 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉండగా, 106 మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. వీరిలో 56 మంది ప్రాక్టికల్స్, థియరీ రెండింటిలో ఫెయిల్ అవ్వగా, 50 మంది థియరీలో ఉత్తీర్ణత సాధించి, ప్రాక్టికల్స్‌లో మాత్రమే ఫెయిల్ అయ్యారు. -
ఆ జీవో చెల్లదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) సిఫార్సులు లేకుండానే సూపర్ స్పెషాలిటీ కోర్సు ఫీజులు పెంచుతూ టీడీపీ హయాంలో ఇచ్చిన జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు 2019లో ఇచ్చిన తీర్పును సమర్ధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నారాయణ మెడికల్ కాలేజి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుధాంశు ధూలియాలతోకూడిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులు పెంచడం సరికాదన్న హైకోర్టు తీర్పును సమర్థించింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకే ఫీజులు వసూలు చేయాలని, అంతకన్నా ఎక్కువగా వసూలు చేసిన సొమ్మును విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం, నారాయణ మెడికల్ కాలేజి చెరో రూ.2.5 లక్షలు ఆరు వారాల్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి జమ చేయాలని, ఆ మొత్తాన్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా), సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీలకు బదిలీ చేయాలని తీర్పులో పేర్కొంది. జరిగిందిదీ.. ఏఎఫ్ఆర్సీ 2011లో సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల రుసుములు నిర్ణయించింది. మూడేళ్లకోసారి ఈ ఫీజులు సవరిస్తూ ఉంటుంది. 2017 వచ్చినప్పటికీ ఏఎఫ్ఆర్సీ సిఫార్సులు చేయలేదు. ఏఎఫ్ఆర్సీ తగిన సమయంలో సిఫార్సులు చేయకపోవడంతో 2017 జూన్ 9న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఫీజులు పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ జీవోను కొంతమంది విద్యార్థులు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు 2019లో జీవో చెల్లదని ఆదేశాలు ఇచ్చింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకే ప్రభుత్వం జీవో ఇవ్వాలని స్పష్టం చేసింది. దీన్ని నారాయణ మెడికల్ కాలేజ్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో అక్రమాలు
నెల్లూరు(క్రైమ్): ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో జరుగుతున్న అక్రమాలు బయటపడ్డాయి. పరీక్షల్లో పాస్ అయ్యేలా చూస్తానంటూ విద్యార్థుల నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. విద్యార్థుల జవాబు పత్రాలు తీసుకుని తన ఇంట్లోనే పరీక్షలు రాయిస్తూ.. చివరకు పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. వివరాలు.. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో డాక్టర్ శింగంశెట్టి భాస్కర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. సరస్వతీ నగర్‌లోని పూజ సత్యదేవమ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఆయన ప్లాట్‌లో ఎంబీబీఎస్ పరీక్షలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయంటూ నెల్లూరు దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ తన సిబ్బందితో కలిసి భాస్కర్ ప్లాట్‌పై శుక్రవారం దాడి చేశారు. భాస్కర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తుల్ని, ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెసెంజర్‌ను మేనేజ్ చేసి.. పట్టుబడిన ఐదుగురు విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. రూ.3.50 లక్షలిస్తే పరీక్షలు పాస్ చేయిస్తానంటూ భాస్కర్‌రావుతో పాటు ప్రసాద్, మహేంద్ర, జయకుమార్ అనే వ్యక్తులు విద్యార్థులతో ఒప్పందం చేసుకున్నారు. వీరి పథకం ప్రకారం.. విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాలి. జవాబు పత్రాల్లో ఖాళీ ఉంచి ఇన్విజిలేటర్‌కు ఇచ్చేయాలి. ఈ మేరకు ఐదుగురు విద్యార్థులూ శుక్రవారం బయోకెమిస్ట్రీ పేపర్–2 పరీక్షకు హాజరై.. ఖాళీ జవాబు పత్రాలు ఇచ్చేశారు. కాలేజీ సిబ్బంది పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను బండిల్స్‌గా చేసి స్పీడ్ పోస్టు ద్వారా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పంపిస్తుంటారు. దీనిని భాస్కర్ ముఠా తమకు అనుకూలంగా మలుచుకుంది. స్పీడ్ పోస్టు తీసుకెళ్లే మెసెంజర్‌ను కూడా తమ వైపునకు తిప్పుకున్నారు. అతని వద్ద ఉన్న బండిల్స్ నుంచి తాము ఒప్పందం కుదుర్చుకున్న విద్యార్థుల జవాబు పత్రాలు తీసుకునేవారు. అనంతరం భాస్కర్ తన ఇంటికి తీసుకెళ్లి ఆ జవాబు పత్రాలను మళ్లీ విద్యార్థులతో నింపించేవాడు. పని పూర్తయిన తర్వాత వాటిని యథావిధిగా మెసెంజర్‌కు ఇచ్చేసేవాడు. అతను రాత్రి 7.30కు వాటిని విజయవాడకు పంపేవాడు. శుక్రవారం కూడా ఇలాగే జవాబు పత్రాలను తీసుకుని విద్యార్థులతో పరీక్షలు రాయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? అసిస్టెంట్ సూపరింటెండెంట్ భాస్కర్, అతని బృందంతో పాటు, ఐదుగురు విద్యార్థులను ఠిపోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఎంత కాలం నుంచి సాగుతోంది? ఇంకా ఎంత మంది ఈ దందాలో ఉన్నారు? ఎంత మంది విద్యార్థుల నుంచి నగదు వసూలు చేశారు? తదితర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
క్రీడా ఆణిముత్యం సింధూ
నారాయణ మెడికల్ కళాశాలలో విజయోత్సవ వేడుక నెల్లూరు రూరల్: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం అందించిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకటసింధూ క్రీడా ఆణిముత్యమని పలువురు ప్రముఖులు కొనియాడారు. చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల సెమినార్ హాల్లో విజయోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత క్రీడాకారిణి సింధూ సోదరి దివ్య కేక్‌ను కట్ చేశారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీరనాగిరెడ్డి మాట్లాడారు. వీరోచిత పోరాట ప్రతిభ కనబర్చిన సింధూ విద్యార్థులకు ఆదర్శమని చెప్పారు. నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఏజీఎం భాస్కర్‌రెడ్డి, ప్రముఖ డాక్టర్ కలికి హైమావతి, తదితరులు పాల్గొన్నారు. సింధూకు తల్లిదండ్రులే స్ఫూర్తి రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ మహిళల విభాగంలో రజత పతకం సాధించిన సింధూకు తల్లిదండ్రులే స్ఫూర్తి అని సోదరి దివ్య పేర్కొన్నారు. నారాయణ మెడికల్ కళాశాలలో ఎమ్మెస్ కోర్సును అభ్యసిస్తున్న దివ్య విజయోత్సవ వేడుకల్లో మాట్లాడారు. సింధూ ఆరో సంవత్సరం నుంచే తండ్రితో పాటు గ్రౌండ్స్‌కు వెళ్లేదని, అక్కడి నుంచే బాడ్మింటన్ ఆడేదని గుర్తు చేసుకున్నారు. సింధూ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారని చెప్పారు. కోచ్ గోపీచంద్ కృషితోనే ఈ స్థాయికి ఎదిగిందన్నారు. తన చెల్లెలు ఈ స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. నారాయణ మెడికల్ కళాశాలలో సింధూ విజయోత్సవ వేడుకలను నిర్వహించేందుకు మంత్రి నారాయణ, కళాశాల యాజమాన్యం సహకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. -
నారాయణ మెడికల్ కాలేజీలో సింధు అభినందన సభ
-
పీజీ మెడికల్‌లో పెరిగిన సీట్లు
తెలంగాణలో 36, ఏపీలో 20 విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): ఈ ఏడాది తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కొత్తగా 56 పీజీ మెడికల్ సీట్లు పెరిగాయి. రెండు రాష్ట్రాల్లోని మొత్తం 39 కళాశాలల్లో తెలంగాణలో 1196, ఏపీలో 1393 సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తెలంగాణలో 36 సీట్లు, ఏపీలో 20 సీట్లు అదనంగా పెరిగాయి. ఏయూ పరిధిలో కొత్తగా విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాలలో 3 అనస్తీషియా, కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో 6 అనస్తీషియా, ఎస్వీ పరిధిలోని నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో 2 ఆప్తమాలజీ, కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలో 6 జనరల్ సర్జరీ, 3 పిడియాట్రిక్స్ సీట్లు పెరిగాయి. ఓయూ పరిధిలో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో 2 ఫోరెన్సిక్, 2 సైక్రియాటీ, 7 మైక్రోబయాలజీ, సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో 1 సైక్రియాటీ, 4 పాథాలజీ, 3 అనస్తీషియా, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో 1 పిడియాట్రిక్స్, 2 జనరల్ మెడిసిన్, క రీంనగర్ సీఏఆర్ కళాశాలలో 6 జనరల్ సర్జరీ, 1 పిడియాట్రిక్స్, 3 జనరల్ మెడిసిన్, రంగారెడ్డి జిల్లా భాస్కర్ మెడికల్ కళాశాలలో 3 జనరల్ మెడిసిన్, 1 ఈఎన్టీ సీట్లు పెరిగాయి. 21 నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్: ఈనెల 21 నుంచి పీజీ మెడికల్ (వెబ్) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు రెండు రోజుల కిందట ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది నుంచి కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీ కింద పీజీ మెడికల్ సీట్లు భర్తీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి లేఖ అందినట్లు సమాచారం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి పూర్తి సాంకేతిక సహకారంతో సీట్లు భర్తీ చేసుకుంటామని ఆ లేఖలో కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విడివిడిగా కౌన్సెలింగ్ చేయాల్సిన పరిస్థితి రావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.