breaking news
nanum raudidan
-
సూపర్ హిట్ రీమేక్‌లో రాజ్ తరుణ్
ఈ శుక్రవారం రాజుగాడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అందుకే తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు రాజ్ తరుణ్. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈసినిమా నానుమ్ రౌడీ దాన్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు రాజ్ తరుణ్. కానీ నానుమ్ రౌడీ దాన్ అప్పట్లో నేను రౌడీనే పేరుతో తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే తెలుగులో రిలీజ్ అయిన సినిమా రీమేక్‌తో రాజ్ తరుణ్ ఏమేరకు ఆకట్టుకోగలడో చూడాలి. గతంలో కాటమరాయుడు సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. తెలుగులో వీరుడొక్కడేగా రిలీజ్ అయిన వీరం సినిమాను మళ్లీ కాటమరాయుడు పేరుతో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేశారు. తెలుగులో పోలీస్‌గా రిలీజ్ అయిన తేరి సినిమాను కూడా రవితేజ హీరోగా రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. -
నయనే చెప్పాలి
నటి నయనతారపై దర్శకుల ఒత్తిడి పెరుగుతోంది. అలాంటి ఒత్తిడిని ఆమె ఆనందంగా స్వాగతిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే నయనతార తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో అగ్రనాయకిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు మాయ చిత్రం తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఈ అమ్మడి తలుపుతడుతున్నాయన్నది తెలిసిందే. ప్రస్తుతం నయన నటిస్తున్న చిత్రాల్లో ఆ తరహా చిత్రాలే అధికం. పలు చిత్రాల్లో నటించిన నయనతార ఇప్పటివరకూ ఒకే ఒక్క చిత్రంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. మిగతా వాటికి అరువుగొంతే. ఆ ఒక్క చిత్రం తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నటించిన నానుమ్ రౌడీదాన్ . ఆ చిత్రానికి నయనతార సొంతంగా చెప్పిన డబ్బింగ్ చాలా ప్లస్ అయ్యిందన్నారు. ఈ భామ తాజాగా సెంట్రిక్ పాత్రల్లో నటిస్తున్న అరమ్, దోరా చిత్రాలకు తననే డబ్బింగ్ చెప్పాలని దర్శకుల నుంచి ఒత్తిడి పెరుగుతోందట. నయన కలెక్టర్‌గా నటిస్తున్న చిత్రం అరమ్. మింజూర్ గోపీ దర్శకుడు. ఈయన తెలుపుతూ నయనతార తమిళ భాషను చాలా ఫ్లూయంట్‌గా మాట్లాడతారన్నారు. తమ చిత్రానికి ఆమె డబ్బింగ్ ఎస్సెట్ అవుతుందన్నారు. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో చిత్రం దోరా. దాస్ రామసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హారర్ కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రానికి నయనతార డబ్బింగ్ చెప్పాలని దర్శకుడు కోరుకుంటున్నారట. అందుకు నయనతార కూడా సమ్మతించినట్లు సమాచారం. దీంతో తమిళంలో నయనతార చిత్రాలకు ఆమె సొంత గొంతునే వినవచ్చునంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇటీవల నడిగర్‌సంఘం జల్లికట్టుకు మద్దతుగా నిర్వహించిన మౌనపోరాటానికి డుమ్మా కొట్టిన ఈ కేరళ బ్యూటీ మెరీనాతీరానికి వెళ్లి ప్రజల పోరాటానికి మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారిందన్నది గమనార్హం.