breaking news
mumbai T-jac
-
గవర్నర్‌ను కలసిన ముంబై టీఆర్ఎస్, టీజేఏసీ నేతలు
- పలు సమస్యలు పరిష్కరించాలని వినతి - సానుకూలంగా స్పందించిన విద్యాసాగర్‌రావు సాక్షి, ముంబై: రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును ముంబై టీ-జేఏసీ, టీఆర్ఎస్ ప్రతినిధులు రాజ్‌భవన్‌లో కలసి పలు అంశాలపై చర్చించారు. మహారాష్ట్ర కాంగార్ వెల్ఫేర్ బోర్డులో తెలుగు నాకా కార్మికుల రిజిస్ట్రేషన్ కావడం లేదనీ, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించాలని టీఆర్ఎస్ ముంబై శాఖ అధ్యక్షుడు బి.హేమంత్ కుమార్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కార్మికుల రక్షణ కోసం ఐడీ కార్డులు, స్కిల్డ్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలని కోరారు. తెలంగాణ నుంచి వలస జీవులు తెచ్చుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధృవీకరణ పత్రాలను గుర్తింపునిచ్చి, స్థానిక కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేలా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని హేమంత్‌కుమార్ కోరారు. వీటన్నిటిపై సానుకూలంగా స్పందించిన సీహెచ్ విద్యాసాగర్ రావు ముంబై నాకా కార్మికుల రిజిస్ట్రేషన్‌ను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. నాకా కార్మికులకు ముంబై-భీవండీలో రక్షణ కరవైందని, వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఎంటీజేఏసీ వైస్ చెర్మైన్ కె.నర్సింహగౌడ్ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముంబై శాఖ ప్రధాన కార్యదర్శి శివరాజ్ బొల్లె, సుంక అంజయ్య మాదిగ, ఎంటీజేఏసీ చెర్మైన్ మూల్ నివాసి మాల, కన్వీనర్లు గాజుల మహేష్, కె.సురేష్ రజక్, ఎన్.లక్ష్మన్ మాదిగ, టీ.రాములు గంగపుత్ర, ఎం.శ్రీనివాస్ బెస్త, బోగ సుదర్శన్ పద్మశాలి, కొమ్ము అంజన్న, ఉప్పు భూమన్న, సిరిమల్లె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
కేసీఆర్‌తో ముంబై టీ-జాక్ భేటీ
ముంబైలో ఉంటున్న వలసబిడ్డల సమస్యల ఏకరువు తెలంగాణ రాష్ట్రంలో ఆదుకోవాలని వేడుకోలు కొత్త ప్రభుత్వం వచ్చాక నెరవేరుస్తానని కేసీఆర్ హామీ సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె.చంద్రశేఖర్ రావుతో ముంబై టీ-జాక్ సభ్యులు ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముంబైలో ఉంటున్న వలసబిడ్డలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన ఎదుట ఏకరువు పెట్టారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రొఫెసర్ కోదండరాం,మల్లేపల్లి లక్ష్మయ్య నేతృత్వంలో హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ముంబై టీ జాక్ సభ్యులు వెళ్లిన విషయం తె లిసిందే. ఆదివారం సదస్సు అనంతరం కేసీఆర్ నివాసంలో భేటీ అయ్యారు. ముందుగా తెలంగాణ సాధించినందుకు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ముంబై, భివండీలో వలస బిడ్డలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులధ్రువీకరణ పత్రాలు, నాకా కార్మికుల భద్రత, రైళ్ల కొరత, వలస జీవులకు తెలంగాణ రాష్ర్టంలో ఉపాధి, స్థలం, ఉన్నత విద్యారంగంలో అడ్మిషన్లు, తెలుగు పాఠ్యపుస్తకాలు సకాలంలో అందజేత, ముంబైలో తెలంగాణ భవనం తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. నవ తెలంగాణలో స్వీయ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ముంబైలో ఉంటూ తెలంగాణ ఏర్పాటుకు సంఘీభావం, మద్దతు తెలిపినందుకు, వివిధ ఆందోళనలో హైదరాబాద్‌కు వచ్చి పాల్గొన్నందుకు ముంబై టీ-జాక్ సభ్యులందరినీ ఆయన అభినందించారు. కేసీఆర్‌తో భేటీ అయిన వారిలో ముంబై టీ ఐకాస చైర్మన్ మూల్నివాసి మాల, వైస్ చైర్మన్ కె.నర్సింహౌడ్, తెలంగాణ విద్యావంతుల వేదిక మహారాష్ట్ర కన్వీనర్ జి.గంగాధర్, బొల్ల శివరాజ్, పాండురంగ్ పద్మశాలి, సరిమల్లె శ్రీనివాస్, వడ్లకొండ రాము తదితరులున్నారు.