సీఎంకు ‘కొత్త’ కృతజ్ఞతలు
కొత్తగూడెం: కొత్తగూడెం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముసాయిదా విడుదల చేయడంపట్ల కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావుతోపాటు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కొత్తగూడెం జిల్లాలో మరిన్ని మండలాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు.