breaking news
Meem Afzal
-
మోడీ, కేజ్రీవాల్ అవకాశవాదులు: కాంగ్రెస్
వారణాసి: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్.. వారణాసికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ విమర్శించింది. వారిద్దరూ పచ్చి అవకాశవాదులని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుజ్రీవాలా దుయ్యబట్టారు. తమ అభ్యర్థి అజయ్ రాయ్ స్థానికంగా ప్రజాదరణ ఉన్న నాయకుడని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రసంగంలోని ఒక లైనును పట్టుకుని ఆయనపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కాగా అజయ్ రాయ్‌కు నిశ్శబద్దంగా స్థానికులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని మరో కాంగ్రెస్ నేత మీమ్ అఫ్జల్ అన్నారు. -
'నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడతారో ఆయనకే తెలిదు'
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ బుధవారం నిప్పులు చెరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ర్యాలీల్లో మోడీ తమ పార్టీపై చేసే ఆరోపణలు పసలేనివని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ర్యాలీలలో మోడీ అసలు ఏమి మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించవలసిన అంశాన్ని మోడీ ముందుగా తయారు చేసుకోరని, నోటికి వచ్చినట్లు అప్పటికప్పుడు ప్రసంగిస్తూ పలు వివాదాలకు తెర తీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని యువరాజు అని పేర్కొనడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని మోడీ తరచుగా యువరాజు అని పేర్కొనడంపై కాంగ్రెస్ గతవారం ఘాటుగా స్పందించిన విషయాన్ని అఫ్జల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.