breaking news
march for jobs
-
నియామక నిబంధనలు
-
‘నాపై ఉన్న అన్ని కేసుల్లో కేసీఆర్ ఉన్నారు’
-
‘నాపై ఉన్న అన్ని కేసుల్లో కేసీఆర్ ఉన్నారు’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం నిప్పులు చెరిగారు. ఎవరిని అవమానిస్తున్నారో అనే విషయం కూడా తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరుద్యోగుల ర్యాలీ నిర్వహించాలని అనుకుంటే అడుగడుగునా ఆంక్షలుపెట్టి అప్పుడే సమైక్యపాలనను తలపించే వాతావరణం సృష్టించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రనే నేర చరిత్రగా, హింసాత్మక చరిత్రగా పోలీసులు అభివర్ణించడం దారుణమైన అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నిరుద్యోగ నిరసన ర్యాలీకి తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ర్యాలీ విషయంలో అనుమతి నిరాకరించిన పోలీసులు సభ ప్రతిపాదన తెచ్చారు. అయితే, ఆ సభ కూడా నిర్వహించేందుకు అనువుగాని ఆరు ప్రదేశాల్లో జరుపుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీనిపై మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణలో నాగోల్ మెట్రో గ్రౌండ్లో సభ నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. అయితే, ఏమాత్రం అనువుగాని ప్రాంతంలో సభకు అనుమతిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి టీ జేఏసీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జేఏసీ నేతలతో సమావేశం నిర్వహించిన కన్వీనర్ కోదండరాం అనంతరం మీడియాతోమాట్లాడారు. అవేమిటో ఆయన మాటల్లోనే చూస్తే.. ‘తెలంగాణ ఉద్యమ చరిత్రను పోలీసులు నేర చరిత్రగా అవమానిస్తున్నారు. అసలు ఎవరిని అవమానిస్తున్నారో అనే విషయం అటు పోలీసులు, ప్రభుత్వం మరిచిపోయింది. నాపై నేర పూరిత కేసులు ఉన్నాయని అంటున్నారు. అవన్నీ కూడా ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు.. ఆ కేసుల్లో నాతోపాటు కేసీఆర్ కూడా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను హింసాత్మక ఉద్యమంగా అభివర్ణించడం అత్యంత దారుణం. అప్పుడే సమైక్య పాలన అనవాళ్లు చూపిస్తున్నారు. ఏ కారణాలకోసం తెలంగాణ తెచ్చుకున్నామో వాటిని పూర్తిగా పక్కకు పడేశారు. ఉద్యోగుల అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. అందుకే ఈ ర్యాలీ ఉంది. వారు ముందుకొస్తే అసలు ర్యాలీ అవసరం ఏముంటుంది? ఈ ర్యాలీతో నాకేం ప్రతిష్ట వస్తది.. నా బాధంతా నిరుద్యోగుల కష్టాలు చెప్పాలనేగ. ఓయూ, నిజాం కాలేజ్ గ్రౌండ్, నెక్లెస్ రోడ్డు, ఎల్బీ స్టేడియం, ఇందిరా పార్క్వంటి ప్రదేశాల్లో సభ నిర్వహించుకునేందుకు అనుమతి కోరాం. ర్యాలీ అనుమతి అడిగాం. ఇందుకోసం మేం ఫిబ్రవరి 1నే పోలీసులకు పిటిషన్ పెట్టుకుంటే 21 రోజుల వరకు మాకు అనుమతి ఇవ్వలేదు. మాతో ఎవరు చర్చకు రాలేదు. పోలీసుల వద్దకు మేమే వెళ్లి చర్చించాం. నిన్నటి వరకు స్పందించకుండా కోర్టు ఆర్డరుతో హడావుడిగా నివేదిక ఇచ్చి మాపై అడ్డగోలుగా ఆరోపణలు చేశారు. హింసన్నారు, దుష్టశక్తులు, జల్లికట్టు అన్నారు. ర్యాలీలో తీవ్రవాదులు ఉన్నారంటూ ఆరోపించారు. ఉద్యోగాలు కావాలని అడిగిన వారంతా ఉగ్రవాదులా.. నిజంగా తీవ్రవాదులు ఉంటే అది తీవ్రవాద కార్యక్రమమే అనుకోండి. నిరుద్యోగులు తీవ్రవాదులుగా కనిపించడం శోచనీయం. దారుణం ఏంటంటే ఆయా గ్రౌండ్లు ఖాళీగా ఉండి నిర్వహణ దారుల నుంచి అనుమతి వచ్చినా పోలీసుల వారిపై ఒత్తిడి చేశారు. మా డిమాండ్లను ప్రభుత్వం ముందు స్పష్టంగా ఉంచాం. పిటిషన్‌పై పోలీసుల స్పందన లేకపోవడం వల్లే కోర్టుకు వెళ్లాం. నాపై ఆ కేసులన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలోనివే. నిరసన ప్రాథమిక హక్కు. మేం దాన్ని వదులుకోం. పోలీసులు తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే అరెస్టులు మొదలయ్యాయి. 600మందిని ఇప్పటికే అరెస్టు చేశారు.. రేపటికి అవి వేల సంఖ్యకు పోతాయి. ఎక్కడ అరెస్టు చేస్తే అక్కడే శాంతియుత నిరసన చేయండి. ఏ కారణాలతో తెలంగాణ తెచ్చుకున్నామో అవే కారణాలతో హింసిస్తున్నారు. మా చేతనైనంత వరకు నిరసన చేస్తాం.. ఇందిరా పార్క్ నుంచే నిరసన ప్రారంభిస్తాం. మా హక్కును వదులుకోం. మా గొంతును అణిచివేస్తున్నారు. ఎవరిని అవమానిస్తున్నారో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. నాగోల్ మెట్రో గ్రౌండ్ ప్రతిపాదనను నిన్ననే తిరస్కరించినం.. నాగోల్ సభకు యోగ్యమైన స్థలం కాదు. ఏ సౌకర్యాలు లేవు. పైగా ఎక్కడివారిని అక్కడ అరెస్టు చేసేందుకు అనుకూలంగా ఉంది. అలా అరెస్టు చేసేందుకు నాగోల్ అనుమతిచ్చారు. సభ నిర్వహణ జరగకుంటే మేం అనుమతిచ్చినా చేసుకోలేకపోయారని చెప్పడమే ప్రభుత్వ ఉద్దేశం. రేపు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి తీరుతాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం కొరవడుతోంది. ఏరికోరి తెచ్చుకున్న రాష్ట్రంలో సమైక్యపాలన వాతావరణం అప్పుడే కనిపిస్తోంది’ అని కోదండరాం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని సంబంధిత కథనాలకై చదవండి.. ర్యాలీపై వెనక్కి తగ్గేదిలేదు: టీజేఏసీ టీజేఏసీ ర్యాలీకి షరతులతో అనుమతి! టీజేఏసీది హింసాత్మక చరిత్ర జల్లికట్టు తరహాలో నిరుద్యోగ ర్యాలీకి ప్లాన్! -
‘మెట్రో గ్రౌండ్లో సభ పెట్టుకోండి.. మాకొద్దు’
-
‘మెట్రో గ్రౌండ్లో సభ పెట్టుకోండి.. మాకొద్దు’
హైదరాబాద్: నిరుద్యోగ ర్యాలీ నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చింది. నాగోల్‌లోని మెట్రో గ్రౌండ్లో తెలంగాణ జేఏసీ నిరుద్యోగుల నిరసన సభను నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే, తాము నిరుద్యోగుల నిరసన సభ నిర్వహించేదే మొత్తం తెలంగాణ సమాజానికి తెలియాలని, అందుకే హైదరాబాద్ నడిబొడ్డున సభ నిర్వహించాలనుకుంటే తమకు శివారు ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీ జేఏసీ తమ పిటిషన్‌ను వెనక్కి ఉపసంహకరించుకుంది. తాము మాత్రం నాగోల్ మెట్రో గ్రౌండ్లో సభను నిర్వహించబోమని టీ జేఏసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై మరికాసేపట్లో వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ సభ నిర్వహణ కోసం హైకోర్టులో జరిగిన వాదోపవాదాలను టీజేఏసీ తరుపు న్యాయవాదులు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదని అన్నారు. ఎన్ని షరతులు పెట్టినా అంగీకరించామని, జల్లికట్టుతో నిరుద్యోగ నిరసన ర్యాలీని పోల్చారని మొత్తానికి ప్రజాస్వామ్య బద్ధమైన డిమాండ్‌ను, హక్కులను తెలంగాణ ప్రభుత్వం అణిచివేసిన పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. ఫంక్షన్‌హాలులో సమావేశాలు నిర్వహించుకోండని చెప్తున్నారంటే ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని సంబంధిత కథనాలకై చదవండి.. ర్యాలీపై వెనక్కి తగ్గేదిలేదు: టీజేఏసీ టీజేఏసీ ర్యాలీకి షరతులతో అనుమతి! టీజేఏసీది హింసాత్మక చరిత్ర జల్లికట్టు తరహాలో నిరుద్యోగ ర్యాలీకి ప్లాన్! -
ర్యాలీపై వెనక్కి తగ్గేదిలేదు: టీజేఏసీ
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ కన్వినర్ ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. శుక్రవారం శివరాత్రి కారణంగా ఆదివారం నిర్వహించలేమని టీజేఏసీ స్టీరింగ్ కమిటీ అభిప్రాయపడుతోంది. ఏదో రకంగా రేపే (బుధవారం) సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు నిరుద్యోగ ర్యాలీ నిర్వహించాలనే పట్టుదలతో టీజేఏసీ ముందుకు సాగుతోంది. హైకోర్టుకు తమ అభిప్రాయాన్ని తెలియజేయనున్నారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోతే పిటిషన్ ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు టీజేఏసీ పేర్కొంది. అంతకుముందు టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు సిద్ధమైంది. బుధవారం(22న) కాకుండా ఆదివారం(26న) నిర్వహించుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. అయితే ర్యాలీకి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని హైకోర్టుకు జేఏసీ తెలిపింది. శాంతియుత ర్యాలీ ఏర్పాట్ల వివరాల గురించి న్యాయస్థానం అడిగింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా వేసింది. -
టీజేఏసీ ర్యాలీకి షరతులతో అనుమతి!
-
టీజేఏసీ ర్యాలీకి షరతులతో అనుమతి!
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు సిద్ధమైంది. బుధవారం(22న) కాకుండా ఆదివారం(26న) నిర్వహించుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. అయితే ర్యాలీకి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని హైకోర్టుకు జేఏసీ తెలిపింది. శాంతియుత ర్యాలీ ఏర్పాట్ల వివరాల గురించి న్యాయస్థానం అడిగింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా వేసింది. మరోవైపు హైకోర్టు సూచనపై జేఏసీ నేతలతో కోదండరాం చర్చలు జరుపుతున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ జరిపి తీరుతామని జేఏసీ నేతలు చెబుతున్నారు. ర్యాలీకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వమని పోలీసులు స్పష్టం చేశారు.