నిరుద్యోగ ర్యాలీ నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చింది. నాగోల్‌లోని మెట్రో గ్రౌండ్‌లో తెలంగాణ జేఏసీ నిరుద్యోగుల నిరసన సభను నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే, తాము నిరుద్యోగుల నిరసన సభ నిర్వహించేదే మొత్తం తెలంగాణ సమాజానికి తెలియాలని, అందుకే హైదరాబాద్ నడిబొడ్డున సభ నిర్వహించాలనుకుంటే తమకు శివారు ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీ జేఏసీ తమ పిటిషన్‌ను వెనక్కి ఉపసంహకరించుకుంది.