తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం నిప్పులు చెరిగారు. ఎవరిని అవమానిస్తున్నారో అనే విషయం కూడా తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరుద్యోగుల ర్యాలీ నిర్వహించాలని అనుకుంటే అడుగడుగునా ఆంక్షలుపెట్టి అప్పుడే సమైక్యపాలనను తలపించే వాతావరణం సృష్టించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రనే నేర చరిత్రగా, హింసాత్మక చరిత్రగా పోలీసులు అభివర్ణించడం దారుణమైన అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నిరుద్యోగ నిరసన ర్యాలీకి తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.