breaking news
Mall Practice Cases
-
చూచిరాత ఫలితం..
సాక్షి,సిటీబ్యూరో: ఉస్మానియా యూనివర్శిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో జరిగిన మాస్ కాపీయింగ్ కేసులో విద్యార్థులు సైతం నిందితులుగా మారనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఈ మేరకు ప్రాథమికం గా నిర్ణయం తీసుకున్నారు. కాపీయింగ్‌కు సహకరించడానికి నగదు చెల్లించి, ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజీ కేంద్రంగా పరీక్ష రాసిన 104 మ ం ది విద్యార్థులపై చర్యలు తప్పవని దర్యాప్తు అధికా రులు పేర్కొంటున్నారు. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆర్కే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ను అరెస్టు చేసిన విషయం విదితమే. ఉస్మానియా యూనివర్శిటీకి (ఓయూ) సంబంధించి గత అక్టో బర్లో డిగ్రీ సప్లమెంటరీ పరీక్షలు జరిగాయి. ఇం దుకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో ముషీరాబా ద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజీ ఒకటి. సాధారణంగా పరీక్ష కేంద్రానికి యూనివర్శిటీ ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాల సెట్లను అందిస్తుంది. అ యితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ సెం టర్లో పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య కంటే కొన్ని ఎక్కువగానే జవాబు పత్రాల సెట్లు ఇస్తుంది. దీనిని ఆర్కే డిగ్రీ కాలేజ్ తమకు అనుకూలం గా మార్చుకుంది. సప్లమెంటరీ పరీక్ష రాసే 104 మంది విద్యార్థులతో కుమ్మక్కై వేరే కేంద్రానికి సంబ ంధించి హాల్‌టిక్కెట్ జారీ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తమ కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది. వీరికోసం యూనివర్శి టీ నుంచి అదనంగా వచ్చే జవాబు పత్రాల సెట్లను వాడుకుంది. ఈ విద్యార్థుల నుంచి ఒక్కో సబ్జెక్ట్‌కు దాదాపు రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇలా మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొందరి పేర్లతో రెండేసి ఆన్సర్ షీట్లు సిద్ధమయ్యాయి. గతే డాది అక్టోబర్ 21న ఆర్కే డిగ్రీ కళాశాల కేంద్రం లో జరిగిన కంప్యూటర్ సైన్స్–3 పరీక్ష పేపర్లు దిద్దుతున్న యూనివర్శిటీ పరీక్షల విభాగం అధికారులు ఈ మాల్ ప్రాక్టీస్ స్కామ్‌ను పసిగట్టారు. ఆర్.హరికృష్ణ అనే విద్యార్థి పేరుతో రెండు ఆన్సర్ బుక్లెట్స్ వర్శిటీకి వచ్చాయి. ఇతడికి పరీక్ష కేంద్రంలో 7257771 నెంబర్‌తో కూడిన బుక్లెట్ ఇవ్వగా... దీంతో పాటు 7257384 నెంబర్‌తో కూ డిన బుక్లెట్ సైతం అతడి నుంచి కాలేజీ ద్వా రా వర్శిటీకి చేరింది. దీంతో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇతడి ఫలితాన్ని ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ వర్శిటీ అధికారులను సం ప్రదించగా... ఆర్కే కాలేజీ నుంచి అటెండెన్స్ షీట్ తీసుకురావాల్సిందిగా సూచించారు. హరికృష్ణ తీసుకువెళ్లిన షీట్లో ఉన్న వివరాల ప్రకారం 7257771 బుక్లెట్ అతడికి జారీ అయింది. దీని పై చీఫ్ సూపరింటెండెంట్ ముద్ర ఉండగా... 725 7384 నెంబర్‌తో కూడిన బుక్లెట్పై కాలేజీ ప్రిన్సి పాల్ ముద్ర ఉంది. దీంతో లోతుగా ఆరా తీసిన అధికారులు మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించారు. ఏకంగా బుక్‌లెట్స్‌ను విద్యార్థులకు ముందే అంది ంచిన ఆర్కే కాలేజ్ కేంద్రంగా దీనికి సహకరించారని, ఈ కేంద్రంలో పరీక్ష రాసిన మొత్తం 104 మంది విద్యార్థులు ఇదే తరహాలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు గుర్తించారు. వీరికి వేర్వేరు పరీక్ష కేం ద్రాలు కేటాయించినా... పరీక్ష రాసింది మాత్రం ఆర్కే కాలేజీలో అని తేల్చారు. దీంతో వర్శిటీ అధికారులు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయ గా, ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ కాలేజీ యాజమాన్యం, చీఫ్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్స్ తదితరులపై చీటింగ్, ఫోర్జరీ, ఏపీ పబ్లిక్ ఎగ్జామ్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్య ం దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్‌కు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన ఎస్సై బి.జగదీశ్వర్రా వు మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తిస్తూ సమాధాన పత్రాలతో పాటు అనేక ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి కాలేజీ ప్రిన్సిపాల్ స్వర్ణలత పాత్ర రూఢీ కావడంతో ఆమె ను అరెస్టు చేశారు. ఈ 104 మంది విద్యార్థులను కొందరు దళారులు ఆర్కే డిగ్రీ కాలేజీ నిర్వాహకు ల వద్దకు తీసుకువచ్చినట్లు పోలీసులు తేల్చారు. నగదు చెల్లించి మాల్ ప్రాక్టీస్ ద్వారా పరీక్ష రాసినందున వీరినీ నిందితుల జాబితాలో చేర్చారు. వీరిని అరెస్టు చేయాలా? లేక నోటీసులు జారీ చేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. -
ఇంటర్ పరీక్షలు షురూ!
⇒ మొదటి రోజు 94.56 శాతం హాజరు ⇒ నిమిషం నిబంధనతో వెనుదిరిగిన పలువురు విద్యార్థులు ⇒ 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజైన బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పేపరు–1 పరీక్షకు 94.56 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్, వొకేషనల్ కోర్సుల్లో పరీక్షలకు హాజరయ్యేందుకు 4,75,832 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 4,49,984 మంది విద్యార్థులు హాజరయ్యారు. 25,848 మంది గైర్హాజరయ్యారు. 12 మంది విద్యార్థులపై అధికారులు మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్‌చేశారు. నిమిషం నిబంధన కారణంగా పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోకపోవడంతో పలు ప్రాంతాల్లో విద్యార్థులు వెనుదిరిగినట్లు తెలిసింది. ప్రశ్న పత్రంలో ఒక తప్పు దొర్లినట్లు విద్యార్థులు తెలిపారు. ‘ప్రైవేటు’విద్యార్థులు ఏప్రిల్ 15లోగా ఫీజు చెల్లించాలి మే/జూన్ నెలల్లో జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు మినహాయింపుతో రాయాలనుకునే ప్రైవేటు విద్యార్థులు (కాలేజీల్లో రెగ్యులర్‌గా చదువుకోనివారు) ఏప్రిల్ 15లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు బుధ వారం ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు రూ.500 హాజరు మినహాయింపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. పదో తరగతి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఏడాది గ్యాప్ ఉన్నవారు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు, రెండేళ్లు గ్యాప్ ఉన్న వారు ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరు కావొచ్చని తెలిపింది. ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన సైన్స్ విద్యార్థులు సైన్స్ నుంచి ఆర్ట్స్‌కు మారవచ్చని పేర్కొంది. ఆర్ట్స్‌లోనూ ఒక గ్రూపు నుంచి మరో దానికి మారవచ్చని వెల్లడించింది. బైపీసీ ద్వితీయ సంవత్సరం పాసైన వారు గణితం రాయాలనుకుంటే అదనపు సబ్జెక్టుగా రాసుకోవచ్చని పేర్కొంది. హాజరు మినహాయింపు కోసం విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.