జానారెడ్డి ఇంటి వద్ద మాలమహానాడు ధర్నా
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కుందూరు జానారెడ్డి ఇంటి ఎదుట మాలమహానాడు కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రతిపక్ష నాయకులు, విపక్ష నాయకులు అసెంబ్లీలో మాట్లాడటంతో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు.
ఇదే క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇంటిని ముట్టడించారు. ఎస్సీ వర్గీకరణకు ఒప్పుకుంటే నాయకులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. ధర్నాకు దిగిన మాలమహానాడు కార్యకర్తలను పోలీసులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రేపు బీజీపే శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తామని మాలమహానాడు కార్యకర్తలు తెలిపారు.