breaking news
LP Set
-
మూడేళ్లుగా ఎందుకు నిర్వహించడం లేదు?
ఎల్పీసెట్పై ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: భాషా పండితుల (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ) ప్రవేశాలకు సం బంధించి ఎల్పీ సెట్ మూడేళ్లుగా ఎందుకు నిర్వహించడం లేదని ఉమ్మడి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. మూడేళ్లుగా ఎల్పీ సెట్ నిర్వహిం చకపోవడాన్ని సవాలు చేస్తూ నగరానికి చెందిన బాల్రాజ్, మరో ఏడుగురు వేసిన పిటిషన్పై జస్టిస్ కోదండరామ్ గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జున్ వాదనలు వినిపిస్తూ, ఎల్పీ సెట్ నిర్వహించకపోవడం వల్ల పిటి షనర్లు భాషా పండితుల కోర్సు పూర్తి చేయలేకపోతున్నారన్నారు. బీఏ (తెలుగు) పూర్తిచేసిన వారికి బీఈడీ చేసే అర్హత లేదని, భాషా పండిత ట్రైనింగ్ కోర్సు చేయాల్సి ఉంటుందని, ఇందులో ప్రవేశానికి ఎల్పీ సెట్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. తద్వారానే ప్రవేశాలు కల్పించాలని ఉత్త ర్వులు చెబుతున్నాయన్నారు. -
26 నుంచి ఎల్పీ సెట్-2015 కౌన్సెలింగ్
గుంటూరు: భాషా పండిట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 26, 27, 28 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎల్పీ సెట్-2015 కన్వీనర్ వీఎస్ భార్గవ తెలిపారు. సెప్టెంబర్ 16న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎల్పీ సెట్-2015 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2015-16 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు తెలుగు, హిందీ భాషా పండిట్ శిక్షణ సంస్థల్లో ప్రవేశానికి చేపడుతున్న వెబ్ కౌన్సెలింగ్కు ఆయా అభ్యర్థులు WWW.lpcetap.cgg.gov.in వెబ్సైట్లో ఈనెల 26,27,28 తేదీల్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో ఆప్షన్లు ఇచ్చుకున్న అభ్యర్థులకు సీటు కేటాయించిన కళాశాల జాబితా ఈనెల 30న తిరిగి అదే వెబ్సైట్లో పొందుపరుస్తామని వివరించారు. సదరు అభ్యర్థులు తమ ఉత్తీర్ణత ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ఈనెల 31న హాజరు కావాలని సూచించారు.