looti
-
పాకిస్థాన్‌లో అంతే.. ‘లూటీ చేయడానికి ఏమన్నా మిగిలాయా?’
ఇస్లామాబాద్ : పదుల సంఖ్యలో కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాలతో రద్దీగా ఉండే ఏరియా. ఆ ప్రాంతానికి చెందిన కంపెనీల్లో ఉద్యోగులు కంప్యూటర్లతో కుస్తీలు పడుతుంటారు. అయితే, ఎప్పటిలాగే విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు వచ్చారు.ఉద్యోగులు వచ్చిన రెండు గంటల తర్వాత పోలీసులు, దర్యాప్తు అధికారులు దాడులు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని వెళ్లిపోయారు. ఈ దాడులపై సమాచారం అందుకున్న స్థానికులు ఆఫీసుల్లో చొరబడి లూఠీ చేశారు. చేతికి ఏది అందితే దాన్ని పట్టుకొని వెళ్లిపోయారు. దొంగిలిచ్చేందుకు వచ్చిన స్థానికులు సైతం లూటీ చేసేందుకు ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని ఆరా తీసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పాకిస్థాన్(Pakistan)లోని ఇస్లామాబాద్ సెక్టార్ ఎఫ్-11లో ఉన్న ఓ నకిలీ కాల్ సెంటర్‌పై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) అధికారులు దాడులు చేశారు. 24 మందిని అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. అయితే, చైనీయులు నడుపుతున్న కాల్ సెంటర్‌పై దాడులు జరిగాయన్న సమాచారం ఆ నోటా ఈనోటా పాకింది. అంతే సమాచారం అందుకున్న స్థానికులు ఆ కాల్ సెంటర్లో చొరబడ్డారు. చేతికి అందిన ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, కీబోర్డులు, ఎక్స్‌టెన్సన్లు.. ఏదిపడితే అది ఎత్తుకెళ్లారు. ఫర్నీచర్, కట్లరీ సెట్లను కూడా లూటీ చేశారు. ఈ లూటీపై సమాచారం అందుకున్న మరి కొంతమంది ఫేక్ కాల్ సెంటర్‌కు వచ్చారు. తమకూ ఏదైనా దొరుకుతుందేమోనని ల్యాప్‌ట్యాప్స్‌ను చోరీ చేసిన వారిని ఆరా తీసిన దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ అవుతున్న వీడియోల్ని చూసేయండి.Pakistanis have Looted Call Centre operated by Chinese in Islamabad; Hundreds of Laptop, electronic components along with furniture and cutlery stolen during holy month of Ramadan pic.twitter.com/z6vjwBRRsq— Megh Updates 🚨™ (@MeghUpdates) March 17, 2025 -
లాక్డౌన్: ఆదిలాబాద్‌లో వైన్‌షాప్ లూటీ
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని టానిక్ వైన్స్‌లో లూటీ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం వైన్స్ పైన రేకులు తొలగించి చొరబడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లాక్‌డైన్ అమలువుతున్న సమయంలో ఎన్నో రోజులుగా మూసి ఉన్న వైన్స్‌లో డబ్బులు ఉండే పరిస్థితి లేదని తెలిపారు. ఈ ఘటన కేవలం మద్యం బాలిళ్ల కోసం జరిగిందా.. ఇతర కారణాలు ఎమైనా ఉన్నాయా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్ సమయంలో ఇటీవలే ఆదిలాబాద్‌లోని కంటైన్మెంట్ ప్రాంతంలో మద్యం బాటిళ్లు పట్టుబడటంతో ఎక్సైజ్ అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ జిల్లాలోని పలు గ్రామాల్లో గుడుంబా, నాటుసారా మళ్లీ గుప్పుమంటుంది. దీంతో ఎక్సైజ్ అధికారులు నాటుసారా, గుడుంబా తయారు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
చీరాల బైపాస్ రోడ్డులో దారి దోపిడి
-
కాంగ్రెస్ పాలనలో ధనదోపిడీ
–ఉత్తమకుమారుడికి గాలి మాటలు –మాది చేతల ప్రభుత్వం –మంత్రి జగదీశ్‌రెడ్డి నల్లగొండ రూరల్ : కాంగ్రెస్ పాలనలో ధనదోపిడీ జరిగిందని.. ఆ పార్టీ నాయకులు అందినకాడికి జేబలు నింపుకున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ మండలం నర్సింగ్‌భట్లలో సోమవారం గంగదేవమ్మ చెరువు లిఫ్ట్ ఇరిగేషన్‌ను జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యే వేముల వీరేశం, దుబ్బాక నర్సింహారెడ్డి, ఎంపీపీ దైద రజితావెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఎంపీటీసీ బొడుపుల శంకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో 98 లక్షల ఎకరాలకు నీరందించామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడం గాలిమాటలేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇస్తే పంట భూములు, పంటలు కనిపించవేమిటని ప్రశ్నించారు. నీళ్లు చాటుగా పోయేవి కాదుగదా ఎక్కడిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు పిట్టల దొర తీరును తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బ్రాహ్మణ వెల్లెంల ద్వారా సాగు నీరందిస్తామన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నేటికీ ఆ పనులు పూర్తి చేయలేదన్నారు. ఏన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు కోమటిరెడ్డిని ఎన్నుకుంటే సాగునీరు ఇవ్వలేదన్నారు. గంగదేవమ్మ చెరువు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పది గ్రామాలకు, 5వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఈ పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. తాము మాటలు చెప్పమని చేతల ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ఒక విజన్ వుందని దాని ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దరికి చేరుస్తున్నామన్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి మాట్లాడుతూ మంత్రి సహకారంతో లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేశామని, త్వరలో దోమలపల్లి చెరువును నింపుతామన్నారు. అనంతరం ఎస్ఐ ధనుంజయను గ్రామస్తులు సన్మానించారు. నిరుద్యోగ యువత కోసం కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించాడు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బకరం వెంకన్న, సర్పంచ్‌లు పనస శంకర్‌గౌడ్, ప్రకాశ్‌రెడ్డి, అంజిరెడ్డి, అమృతా సురేందర్, మహేశ్‌గౌడ్, పంకజ్‌యాదవ్, భిక్షం, ఏసు, వెంకన్న, వెంకట్‌రెడ్డి, విజయ తదితరులు పాల్గొన్నారు. -
పండగ పేరుతో ప్రయాణీకుల నిలువ దోపిడి