breaking news
Locket chain
-
ఆకతాయిల నుంచి రక్షించే లాకెట్.. ఎలాగంటారా..
ఆకతాయిలుంటున్న సమాజంలో మహిళలకు రక్షణ కరవైంది. వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే విధంగా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత కల్పిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నా ఆకతాయిల ఆగడాలను పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మహిళలకు భద్రత కల్పించేలా పలు యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అందులో భాగంగా అపరిచితులు వెంబడిస్తునప్పుడు మనం ప్రమాదంలో ఉన్నామనే విషయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేసేలా ప్రత్యేక ‘స్మార్ట్ జ్యూవెలరీ’ని రూపొందించారు. ఈ ‘సేఫర్ స్మార్ట్ జ్యూవెలరీ’లో లాకెట్ ఉంటుంది. అది మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేసుకొని మనకు కావాల్సినవారి నంబర్లు సెట్ చేసుకోవాలి. దీన్ని చెయిన్‌లా మెడలో వేసుకుని ప్రమాదం వచ్చినప్పుడు లాకెట్ వెనుక బటన్ని రెండుసార్లు నొక్కితే చాలు. మనకు కావాల్సిన వారికి మనం ప్రమాదంలో ఉన్నామని మెసేజ్ వెళ్తుంది. ఇదీ చదవండి: విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే.. అంతేకాదు, యాప్ నుంచి మీ లైవ్ లొకేషన్ కూడా షేర్ అవుతుంది. దీంతో మిమ్మల్ని వారు సులభంగా చేరుకోగలుగుతారు. అలాగే, ప్రమాదంలో ఉన్నవారు సమీపంలోని హాస్పిటల్ లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్లేలా నావిగేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లోని యాప్‌ల ద్వారా ఈ స్మార్ట్లాకెట్ను కనెక్ట్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. -
బహుమతి అపురూపం
ఓపెనింగ్ సీన్.. కారడవిలోనో.. నదిలో కొట్టుకొస్తున్న తెప్పలోనో మెడలో లాకెట్ చైన్‌తో ఓ పిల్లాడు ఉంటాడు. పిల్లలు లేని దంపతులకు దొరుకుతాడు. కట్ చేస్తే.. ఆ పిల్లాడు పెరిగి హీరో అవుతాడు. సినిమా క్లైమాక్స్‌కు రెండు రీళ్ల ముందు సదరు హీరో ఆ లాకెట్ ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్న ఫొటోలను చూసి తన అసలైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటాడు. ఈస్ట్‌మన్ కలర్ సినిమాల్లో లాకెట్ బేస్డ్ సినిమాలు చాలానే వచ్చాయి. 3డీ సినిమాలు జోరుమీదున్న ఈ టైంలో లాకెట్లు కూడా 3డీ హంగులు అందుకుంటున్నాయి. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ఫ్యాషన్ ముచ్చట్లు.. మనం ఎంతగానో అభిమానించే వారికి ఎన్నడూ మరచిపోలేని అపురూపమైన గిఫ్ట్ ఇవ్వాలని అందరూ ఆశపడుతుంటారు. మన మనసు మెచ్చిన వ్యక్తికి మనం ఇచ్చే బహుమతి తీపి జ్ఞాపకాలను అందించేదై ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారి కోసమే కస్టమైజ్డ్ బహుమతులు నేటి ఫ్యాషన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతున్నాయి. పసిడి వెలుగులకు క్రియేటివిటీ జోడించి మీరు మెచ్చిన లేదా మీకు నచ్చిన వ్యక్తి రూపాన్ని లాకెట్‌గా మలచి అందిస్తున్నారు. గోల్డెన్ సర్ప్రైజ్ మీ పెళ్లి నాటి మనోహర దృశ్యమైనా.. అప్పుడే పుట్టిన పిల్లాడి పాదాలైనా.. మీ గారాలపట్టి ముఖారవిందమైనా.. ఈ 3డీ ప్రింటెడ్ జ్యువెలరీలో ఇట్టే ఇమిడిపోతాయి. ఏది ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో.. ఆ చిత్రాన్ని తయారీదార్లకు ఇస్తే చాలు. ఆధునిక టెక్నాలజీతో ఆ దృశ్యానికి 3డీ రూపం ఇచ్చి.. దాన్ని లాకెట్గానో, రింగ్గానో మలిచేస్తారు. వధూవరుల ముఖాలు ప్రతిబింబించేలా ఎంగేజ్మెంట్ రింగ్స్ తయారు చేస్తున్నారు. ఇలాంటి పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ http://www.augrav.com/ ఆన్లైన్లో ఆఫర్ చేస్తోంది. ఈ వెబ్సైట్లోకి వెళ్లి డిజైన్ సెలెక్ట్ చేసుకుని, కావాల్సిన వ్యక్తి ఫొటో అప్లోడ్ చేస్తే చాలు.. మీ కస్టమైజ్డ్ గిఫ్ట్ రెండు మూడు వారాల్లో రెక్కలు కట్టుకుని మీ చెంత వాలుతుంది. యువర్స్ చాయిస్ బారసాల, పుట్టినరోజు, ఎంగేజ్మెంట్, వివాహం, షష్టిపూర్తి.. ఇలా అకేషన్స్‌లో 3డీ ప్రింటెడ్ జ్యువెలరీ గిఫ్ట్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. బంగారు వన్నెల్లో మెరిసిపోయే ఈ బహుమతులకు కస్టమర్ ఆర్డర్ మేరకు నవరత్నాలతో ఫినిషింగ్ కూడా ఇస్తున్నారు. సైజు, వెయిట్, డిజైన్ బట్టి వీటి ఖరీదు రూ.12 వేల నుంచి రూ.లక్షల వరకూ పలుకుతున్నాయి. మరింకెందుకు ఆలస్యం.. అపురూపమైన బహుమతిని నేడే అందుకోండి. - శిరీష చల్లపల్లి