lifeline
-
ఉగాండా గతి మార్చిన భారత్
అది 1972... గడియారపు ముళ్లు వేగంగా తిరుగుతున్నాయి. చేతిలో కేవలం తొంభై రోజుల గడువు. కళ్ల ముందే తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాలు కుప్పకూలుతుంటే కట్టుబట్టలతో, కన్నీటి మూటలతో ఒక జాతి పరాయి దేశాల వైపు అడుగులు వేసింది. ఆనాడు ఉగాండా నేల విడిచి వెళ్లిన చాలా మందిలో తీరని వేదన. కానీ, కాలం పగ తీర్చుకోలేదు.. ఆ గాయాన్ని మాన్పేసింది.అర్ధ శతాబ్దం గడిచింది. నాడు బహిష్కరించిన అదే మనుషులు, నేడు ఎర్ర తివాచీ పరిచారు. అప్పుడు అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారే, ఇప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారారు. చక్కెర మిల్లులు, స్టీలు పరిశ్రమలు, బ్యాంకింగ్ వ్యవస్థ... ఇలా అన్ని రంగాల్లో భారతీయులు వ్యాపారం సాగిస్తూ దేశ వృద్ధికి తోడ్పడుతున్నారు.90 రోజుల గడువు.. తరాల కష్టం బుగ్గిపాలు1972 ఆగస్టులో ఉగాండా సైనిక పాలకుడు ఇడి అమీన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. స్థానికులను దోపిడీ చేస్తున్నారనే సాకుతో దాదాపు 80,000 మంది భారత సంతతి ప్రజలను కేవలం 90 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యాపారాలు, చక్కెర మిల్లులు, బ్యాంకులు, ఆస్తులను వదిలి వారంతా బ్రిటన్, కెనడా, భారత్‌లకు శరణార్థులుగా వెళ్లారు. ఫలితంగా ఉగాండాలో 90 శాతం వ్యాపారాలు మూతపడ్డాయి. సరఫరా గొలుసు కుప్పకూలి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది.గణాంకాలు ఇలా..1972-75 మధ్య ఉగాండా జీడీపీ 5% మేర పడిపోయింది.1972లో 740 మిలియన్ షిల్లింగ్‌లుగా ఉన్న ఉత్పత్తి 1979 నాటికి 254 మిలియన్లకు దిగజారింది.ముసెవెని పిలుపుతో మారిన దశ1986లో యోవేరి ముసెవెని అధికారం చేపట్టాక పరిస్థితి తలకిందులైంది. అమీన్ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించిన ఆయన, భారతీయులను తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఆస్తులను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ‘మనం పోగొట్టుకున్నది కేవలం వ్యక్తులను కాదు, దేశ ఆర్థిక పునాదులను. భారతీయులు ఉగాండా రక్తంలో భాగం’ అని యోవేరి ముసెవెని (అధ్యక్షుడు) అన్నారు.ఆర్థిక సామ్రాజ్యాల పునరుద్ధరణతిరిగి వచ్చిన భారతీయులు వ్యాపారాలు చేయడంతోపాటు దేశ భవిష్యత్తును మార్చేశారు. ప్రస్తుతం ఉగాండా జనాభాలో కేవలం 1 శాతం కంటే తక్కువగా ఉన్న భారతీయులు దేశ ఆదాయపు పన్నులో 65 శాతం వాటాను అందిస్తున్నారంటే వారి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.సుధీర్ రుపారేలియాబహిష్కరణ సమయంలో లండన్‌కు పారిపోయి చిన్న ఉద్యోగాలు చేసిన సుధీర్ కేవలం 25,000 డాలర్లతో తిరిగి వచ్చి నేడు ఉగాండాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. బ్యాంకింగ్, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆయనది తిరుగులేని ముద్ర.మధ్వానీ గ్రూప్గుజరాత్ నుంచి వలస వచ్చిన ముల్జీభాయ్ మాధ్వానీ స్థాపించిన ఈ సంస్థ నేడు తూర్పు ఆఫ్రికాలోనే అతిపెద్ద వ్యవసాయ-పారిశ్రామిక సంస్థగా ఎదిగింది. ‘కకీరా షుగర్ వర్క్స్’ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ 70,000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఈ గ్రూప్ జీవనాధారంగా ఉంది.మెహతా, ముక్వానో గ్రూప్స్మెహతా గ్రూప్ అధినేత మహేంద్ర మెహతాకు భారత ప్రభుత్వం ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలాగే ముక్వానో గ్రూప్ సబ్బులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ఉత్పత్తిలో ఎంతో ఎదిగింది.భారత్ - ఉగాండా సంబంధాలుప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1.2 బిలియన్ డాలర్లను దాటింది. ఫార్మా, మౌలిక సదుపాయాలు, ఉక్కు, విద్య వంటి రంగాల్లో భారతీయ సంస్థల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. చైనా పెట్టుబడులతో పోలిస్తే భారతీయ వ్యాపారవేత్తలు స్థానిక ప్రజలతో మమేకమై పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తూ అక్కడ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు.అయితే, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారతీయుల ఆర్థిక ఆధిపత్యంపై కొన్ని వర్గాల్లో అసహనం ఉన్నప్పటికీ, ఇండియన్స్ లేని ఉగాండా ఆర్థిక వ్యవస్థను ఊహించడం అసాధ్యమని మెజారిటీ ప్రజల నమ్మకం. ఒకప్పుడు బహిష్కరణకు గురైన ఒక జాతి, అదే దేశానికి ఆర్థిక రక్షకులుగా మారడం అనేది ప్రపంచ చరిత్రలోనే అరుదైన దృశ్యం.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య -
కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం
దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం భారంగా మారుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) ఒక సంజీవనిలా పనిచేస్తోంది. ఈ పథకం ద్వారా లభించే ‘ఆయుష్మాన్ కార్డు’ ఉంటే చాలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచితంగా చికిత్స పొందే వీలుంది.ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ఏమిటి?ఆయుష్మాన్ భారత్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ఆరోగ్య బీమా పథకం. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుంది. ఈ సదుపాయాన్ని పొందడానికి ఇచ్చే డిజిటల్ గుర్తింపు కార్డునే ‘ఆయుష్మాన్ కార్డు’ లేదా ‘పీఎం-జేఏవై కార్డు’ అంటారు.కార్డు వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలుఆసుపత్రిలో చేరినప్పుడు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సుమారు 1,900 పైగా వ్యాధులు, శస్త్రచికిత్సలకు ఇందులో కవరేజీ ఉంటుంది. ఆసుపత్రిలో చేరడానికి 3 రోజుల ముందు నుంచి, డిశ్చార్జ్ అయిన 15 రోజుల వరకు అయ్యే పరీక్షలు, మందుల ఖర్చులు కూడా పథకంలో వర్తిస్తాయి. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ పథకం కింద నమోదైన ఏ ఆసుపత్రిలోనైనా (ప్రభుత్వ లేదా ప్రైవేట్) చికిత్స పొందవచ్చు.ఆయుష్మాన్ కార్డు ఎలా పొందాలి?ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా సరళతరం చేసింది. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.ముందుగా ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్సైట్ (https://beneficiary.nha.gov.in) ను సందర్శించండి లేదా ‘Ayushman App’ డౌన్లోడ్ చేసుకోండి.వెబ్సైట్లో ‘Beneficiary’ ఆప్షన్‌ను ఎంచుకోండి.మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వచ్చిన OTP ద్వారా లాగిన్ అవ్వండి.మీ రాష్ట్రం, పథకం పేరు (పీఎంజేఏఐ) ఎంచుకోండి.మీ జిల్లాను ఎంచుకున్న తర్వాత.. ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ ద్వారా మీ పేరును సెర్చ్ చేయండి.లిస్టులో మీ పేరు పక్కన ఉన్న ‘Identify’ లేదా ‘e-KYC’ బటన్‌పై క్లిక్ చేయండి.ఆధార్ OTP లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ పూర్తి చేయండి.మీ ప్రస్తుత ఫోటోను లైవ్‌లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయండి. మీ ఆధార్‌లోని వివరాలు, ప్రస్తుత వివరాలు సరిపోలితే వెంటనే ఆమోదం లభిస్తుంది.అప్రూవల్ అయిన తర్వాత ‘Download Card’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ డిజిటల్ ఆయుష్మాన్ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు.ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ (వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా) ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరు ప్రత్యేకంగా ‘వయో వందన’ కార్డు కోసం పైన పేర్కొన్న పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవచ్చు.ఏవైనా సందేహాలుంటే లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్ 14555 కు కాల్ చేయవచ్చు లేదా సమీపంలోని మీ-సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు.ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు -
గుజరాతీ రుచులకు గ్లోబల్ క్రేజ్
ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లే వారు అయినా, ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లే విద్యార్థులు అయినా.. విమానం ఎక్కేముందు వారి సూట్‌కేసుల్లో దుస్తుల కంటే ఎక్కువగా ఆహార ప్యాకెట్లు కనిపిస్తుంటాయి. దీనికి కారణం విదేశాల్లో భారతీయ ఆహారం అంతగా దొరకకపోవడం లేదా ఖర్చు అధికంగా ఉండటం. అందుకే ఇక్కడి నుంచి విదేశాలు వెళ్లేవారు తమతో పాటు ఇక్కడి ఆహారాన్ని మోసుకెళుతుంటారు. ముంబై, అహ్మదాబాద్‌ల నుంచి విదేశాలకు వెళ్లేవారికి ఇక్కడి గల్లీల్లో ఉండే గుజరాతీ కిచన్లే ‘అన్నపూర్ణలు’గా మారాయి. న్యూజెర్సీ, కాలిఫోర్నియా తదితర నగరాల్లో ఉండే భారతీయులు ఈ హోమ్ కిచెన్ల రుచుల కోసం క్యూ కడుతుంటారు.ఎన్ని పెద్ద బ్రాండ్లు ఉన్నా..న్యూజెర్సీలో పనిచేసే పలువురు భారతీయ టెక్కీలు తమ 30 కిలోల లగేజీలో దాదాపు 8 కిలోలు కేవలం ఈ తినుబండారాలకే కేటాయిస్తుంటారు. థెప్లా, ఫాఫ్డా, ఖాక్రా, రెడీ-టు-ఈట్ పావ్ భాజీ తదిరత వంటకాలు వాక్యూమ్ సీలింగ్ సాంకేతికతతో నెల రోజుల పాటు తాజాగా ఉంటున్నాయి. అమెరికాలో ఎన్ని పెద్ద బ్రాండ్లు అందుబాటులో ఉన్నా, గుజరాతీ మహిళలు (బెన్స్) ఎటువంటి రసాయనాలు లేకుండా చేసే ‘ఇంటి రుచి’కి ఏదీ సాటిరాదని ప్రవాసులు చెబుతుంటారు.బడ్జెట్ ఫ్రెండ్లీ రుచులువిదేశాలకు వెళ్లే కొత్తలో విద్యార్థులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఆహార ఖర్చు . న్యూయార్క్ వంటి నగరాల్లో ఒక వెజిటేరియన్ శాండ్విచ్ ధర సుమారు 5 నుండి 7 డాలర్లు (రూ. 400 - 600) ఉండగా, భారత్‌లో కేవలం 20-30 రూపాయలకే లభించే థెప్లా ప్యాకెట్లు వారికి గొప్ప ఊరటనిస్తున్నాయి. అమెరికాలో లభించే ప్యాక్డ్ ఫుడ్ కంటే ఇవి ఐదు రెట్లు తక్కువ ధరకే లభిస్తుండటం విద్యార్థుల బడ్జెట్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది.ప్రకటనలు లేని వ్యాపారంఈ గుజరాతీ కిచెన్ల వెనుక ఎటువంటి భారీ మార్కెటింగ్ టీమ్‌లు లేవు. ముంబైలోని విలే పార్లే, ఘాట్కోపర్ వంటి ప్రాంతాల్లోని గృహిణులు నాణ్యతనే పెట్టుబడిగా పెట్టి అంతర్జాతీయ స్థాయికి తమ వ్యాపారాన్ని తీసుకువెళ్లారు. ‘ఇందుబెన్ ఖాక్రావాలా’ లాంటి సంస్థల స్ఫూర్తితో తమ ఇంటి వంటగదుల నుంచే పలువురు మహిళలు టెక్కీల ఆకలిని తీర్చే పనిలో నిమగ్నమవుతున్నారు.తెల్లవారుజాము నుంచే విదేశీ ఆర్డర్ల సందడిఅహ్మదాబాద్కు చెందిన సెజల్ షా లాంటివారు తెల్లవారుజామున 4 గంటలకే తమ ‘కిచెన్’లో వంట పనిని ప్రారంభిస్తారు. విదేశాల్లో ఉండే ఐటీ నిపుణుల కోసం, విద్యార్థుల కోసం రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తారు. ఈ చిన్న కిచెన్ల నుండి వెళ్లే ఆహారం అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లోని భారతీయ మేధావుల ఆకలిని తీరుస్తోంది.సంస్కృతుల ఎగుమతివిదేశాల్లో స్థిరపడిన వారు కూడా తమ పిల్లల కోసం, బంధువుల కోసం ఈ వంటకాలను ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు. స్టార్టప్‌లు, గిగ్ ఎకానమీ యుగంలోనూ, గుజరాతీ మహిళల వ్యాపార దృక్పథం గ్లోబల్ మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. కేవలం రుచి మాత్రమే కాదు, ఒక సంస్కృతిని, అనుబంధాన్ని ఈ వంటకాల ద్వారా వారు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: ‘రైతే ఎప్పటికీ రారాజు’.. అమెరికా ఒప్పందంలో స్పష్టం! -
పట్టాలపై లైఫ్‌లైన్
నర్సు ఓల్గా.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంతటా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. రోగుల ఆక్సిజన్ స్థాయిలను తనిఖీ చేసి నోట్ చేసుకుంటున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగులను ఓ కంట కనిపెడుతున్నారు. ఓ ఆస్పత్రిలో ఇదో సాధారణ దృశ్యం. కానీ ఆమె పనిచేస్తున్నది నడుస్తున్న రైలులో. వైద్యం అందిస్తున్నది యుద్ధంలో గాయాలపాలైన సైనికులకు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి ఉక్రెయిన్ ఈ రైలాస్పత్రిని నడుపుతోంది. ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఇప్పుడిది కీలక భాగంగా మారింది. యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం తూర్పు ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో పడకలు లేవు. అవి ఖాళీ చేయడానికి కొందరిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అంబులెన్సుల్లో సుదూర ప్రయాణంతో సైనికుల ప్రాణాలకే ముప్పుకావచ్చు. రష్యా దాడుల నేపథ్యంలో హెలికాప్టర్ అంబులెన్స్‌లు కూడా ఉపయోగించలేరు. ఈ క్లిష్ట స్థితిలో రైళ్లు సైనికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ఇందులోని బోగీలు పూర్తి స్థాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి. ఆర్మీ డాక్టర్లు, ఇతర సిబ్బంది సైనికులకు రైలులోనే సేవ లు అందిస్తున్నారు. కదులుతున్న రైలులో ఐసీయూ యూనిట్ నడపడం చాలా కష్టమైన పని. అయినా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ‘ఇక్కడ మా సామర్థ్యం చాలా పరిమితం. ఏదైనా జరిగితే బయటి కన్సల్టెంట్‌ను పిలవలేం. రక్తస్రావాన్ని ఆపడానికి చిన్న చిన్న ఆపరేషన్లు వంటివి చేస్తాం. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయలేం’అని డాక్టర్స్ చీఫ్ ఒకరు తెలిపారు. పర్యాటక రైలు కాస్తా ఆస్పత్రిగా.. యుద్ధం ప్రారంభంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఉక్రెయిన్ సమయస్ఫూర్తికి రైలాస్పిత్రి ఒక ఉదాహరణ. 2022 ఫిబ్రవరిలో దేశంపై రష్యా దాడులు ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్ వద్ద ఎటువంటి మెడికల్ రైలు బోగీలు లేవు. గాయపడిన సైనికులను సాధారణ రైళ్లలోకి కిటికీల గుండా బలవంతంగా ఎక్కించేవారు. దీనికి పరిష్కారం ఆలోచించిన ఉక్రెయిన్ రైల్వే.. సాధారణ రోజుల్లో పర్యాటకులను కార్పాతియన్ పర్వతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగించే రైళ్లను పునరుద్ధరించింది. అలా ఆస్పత్రి రైలుకు రూపకల్పన జరిగిందని ఉక్రెయిన్ రైల్వే ప్యాసింజర్ ఆపరేషన్స్ సీఈఓ ఒలెక్సాండర్ పెర్తోవ్స్కీ చెప్పారు. గంటకు 50 మైళ్ల వేగంతో.. ఈ రైలు గంటకు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ రైలు వేగంలో సగమే అయినప్పటికీ ఐసీయూ మాత్రం అటూఇటూ కదిలిపోతూంటుంది. దీంతో పనిచేసేటప్పుడు సిబ్బంది చాలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంబులెన్స్ రైళ్లను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధం సమయంలో ఉపయోగించారు. కానీ ఈ ఆధునిక వెర్షన్లలో వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ యంత్రాలు, అ్రల్టాసౌండ్ స్కానర్లు, పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ప్రతి క్యారేజీలో నిరంతర విద్యుత్ కోసం జనరేటర్లుంటాయి. బోగీల్లో పిల్లల చిత్రాలు, ఉక్రెయిన్ జాతీయ జెండాలు ఉంటాయి. గాయపడిన సైనికులకు ఇవి కొంత ఓదార్పును అందిస్తాయి. రెండు భిన్న దృశ్యాలు.. తొమ్మిది గంటల ప్రయాణం తరువాత రైలాస్పత్రి ఒక నగరంలోని రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించగానే.. అంబులెన్సులు సైనికుల కోసం ఎదురు చూస్తుంటాయి. ఐసీయూ లోని నర్సులు సైనికులను ప్లాట్‌ఫామ్‌పై ఎదురుచూస్తున్న వైద్యులకు అప్పగిస్తారు. స్టేషన్ నుంచి అంబులెన్సులు బయల్దేరి వెళ్లాక ఊపిరి పీల్చుకుంటారు. వారికి ఎదురుగా కొత్తగా రిక్రూట్ అయిన సైనికులతో ఓ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. తల్లిదండ్రులకు వీడ్కోలు పలుకుతూ పిల్లలు కనపడతారు. సాయంత్రానికి ఆ యువసైనికులు అపస్మారక స్థితిలోనో, తీవ్ర గాయాలతోనే అదే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ రెండు దృశ్యాలకు ప్రత్యక్ష సాకు‡్ష్యలు రైలాస్పత్రి సిబ్బందే. యుద్ధం మిగుల్చుతున్న అంతులేని విషాదమిది. ‘యుద్ధ క్షేత్రం నుంచి తీవ్రంగా గాయపడి వచ్చే సైనికులను చూడటం బాధాకరమైన విషయమే. కానీ, వారికి సేవ చేస్తున్నామన్న తృప్తి మాత్రం మాకు మిగులుతుంది’అని చెబుతున్నారు ఐసీయూ నర్సు ఓల్గా. 2015లో సైన్యంలో నర్సుగా చేరిన ఆమె.. 2022 నుంచి యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్నారు. అలసిపోయాం.. యుద్ధం చెల్లించుకుంటున్న మూల్యానికి ఈ రైలాస్పత్రి ఓ చిన్న ఉదాహరణ. ‘రష్యన్ విసిరిన గ్రెనేడ్‌తో నా చేతులు, భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దాలు నా వినికిడి శక్తినే దెబ్బతీశాయి. నేనే కాదు.. చాలా మందికి మనోధైర్యం ఉంది. కానీ చాలా అలసిపోయారు. ఇలాంటప్పుడు ఏదేమైనా కానీ భారమంతా దేవుడిదే అనుకుంటాం’అని చెబుతున్నారు రష్యా డ్రోన్ దాడిలో గాయపడి రైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల సైనికుడు. అలసట యుద్ధక్షేత్రంలోని సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందనడానికి ఇదో ఉదాహరణ. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయన 18 నెలల నుంచి డోనెట్స్క్ ప్రాంతంలోని పదాతిదళంలో యాంటీ ట్యాంక్ గన్నర్‌గా పనిచేస్తున్నారు. ఇన్ని రోజుల్లో కేవలం 45 రోజులు మాత్రమే ఫ్రంట్‌లైన్‌కు దూరంగా ఉన్నారు. గాయాల నుంచి ప్రేరణ.. ఈయనకు కొన్ని పడకల దూరంలో కూర్చున్న స్టానిస్లావ్ మూడు నెలల క్రితం స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. అతడున్న కందకంపైన డ్రోన్ దాడి జరగడంతో ఊపిరితిత్తులకు గాయమైంది. పక్కటెముకలు విరిగాయి. అయినా స్టానిస్లావ్ పూర్తి భిన్నమైన మానసిక స్థితిలో కనిపించారు. ‘‘గాయపడ్డాక నాలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. నేను మరింత ప్రేరణ పొందాను’’అని చిరునవ్వుతో చెబుతున్నారు. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్నాప్‌డీల్ పీకేసింది.. పేటీఎం పిలుస్తోంది!
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న స్నాప్‌డీల్, స్టేజిల్లా వందల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకగా... వారికి పేటీఎం ఆహ్వానం పలికింది. పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ట్విట్టర్లో ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కారణంగా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఉద్యోగం కోల్పోయిన టెక్/ప్రొడక్టు ఉద్యోగులకు తాము ఆహ్వానం పలుకుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటైన స్నాప్‌డీల్ సుమారు 500–600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరగా వృద్ధి చెందే క్రమంలో పొరపాట్లు చేసినట్టు స్పాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్బాహ్ అంగీకరించారు. వ్యయాలు తగ్గించుకుని వ్యాపారాన్ని తిరిగి గాడిన పెట్టే క్రమంలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. చెన్నై కేంద్రంగా నడిచే ఆన్లైన్ హోటల్ గదుల బుకింగ్ సంస్థ స్టేజిల్లా మార్కెట్లో విపరీతమైన పోటీ కారణంగా కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించింది. -
ఆత్మహత్యల నివారణకు ఫేస్ బుక్ టూల్స్
నిరుత్సాహంతో, నైరాశ్యంతో పెరిగిపోతున్న ఆత్మహత్యలను నివారించడంపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక టూల్స్‌ను ఆవిష్కరించింది. భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ టూల్స్ ప్రవేశపెట్టింది. ఈ టూల్స్‌ను గతేడాదే అమెరికాలోకి అందుబాటులోకి తెచ్చింది. ఫోర్ ఫ్రంట్, లైఫ్ లైన్, సేవ్.ఆర్గ్ సంస్థల భాగస్వామ్యంతో ఈ టూల్స్ ను ఫేస్ బుక్ అమెరికాలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం భారతదేశంతో పాటు అన్ని దేశాల్లోకి తీసుకొచ్చేసింది. భారత్ లో దీపికా పదుకొనే లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్, ఆస్రాల సహకారంతో ఈ టూల్స్ ను ప్రవేశపెట్టింది. భారత్ లో ఫేస్ బుక్ అందుబాటులో ఉన్న అన్ని భాషలు.. బెంగాలీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూల్లోకి ఈ టూల్స్ ను తీసుకొచ్చింది. మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ సంస్థలతో కలిసి ఫేస్ బుక్ ఈ టూల్స్‌ను డెవలప్ చేసింది. స్నేహితుడు నైరాశ్యంలో, నిరుత్సాహంతో ఉండడాన్ని సోషల్ మీడియా కాంటాక్టుల ద్వారా, చాటింగ్స్ ద్వారా యూజర్లు గుర్తించినప్పుడు ఆ సమాచారాన్ని వేగంగా ఇతరులతో షేరు చేసుకోవడం, ఆ వ్యక్తికి ధైర్యాన్ని నింపడం వంటి చర్యలకు ఈ టూల్స్ సహకరిస్తాయి. తమ స్నేహితుడు ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న విషయాన్ని గుర్తించిన స్నేహితులు నేరుగా ఫేస్ బుక్ గ్లోబల్ టీమ్ కు కూడా రిపోర్టు చేయవచ్చు. ఇలా స్నేహితులను ఆత్మహత్యల నుంచి బయటపడేయొచ్చని ఫేస్ బుక్ పేర్కొంది. ఎవరైనా ప్రమాదంలో ఉన్నారని భావిస్తే వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులను కాంటాక్టు చేసేలా ఫేస్ బుక్ యూజర్లకు సూచించనుంది. ఫేస్ బుక్ సపోర్టు చేసే అన్ని భాషల్లో ఈ టూల్స్ అందుబాటులోకి ఉండనున్నాయి. -
లైఫ్ లైన్: సాయం కావాలి - పార్ట్ 1
-
లైఫ్ లైన్: సాయం కావాలి - పార్ట్ 2
-
శశిధర్ కోసం లైఫ్‌లైన్
-
విమలకోసం లైఫ్‌లైన్
-
జ్యోతీశ్వర్ కోసం లైఫ్ లైన్
-
రాము కోసం లైఫ్ లైన్
-
విధి రాత
-
లైఫ్ లైన్ ఫర్ ఎల్లయ్య


