breaking news
Librarians
-
ఆ పుస్తకం 100 ఏళ్లకు.. లైబ్రరీకి తిరిగి చేరుకుంది!
లైబ్రరీ నుంచి పుస్తకాలను ఇంటికి తెచ్చుకుని చదవడం గురించి అందరికీ తెలిసింది. వాళ్లు ఇచ్చిన గడువు తీరిపోయాక ఒక్కోసారి ఇచ్చేస్తాం. కొన్నిసార్లు గడువు దాటిన సందర్భాలు ఉంటాయి. ఐతే ఇక్కడొక లైబ్రరీలోని పుస్తకం ఏకంగా రెండు, మూడు ఏళ్లు కాదు ఏకంగా 100 ఏళ్ల తర్వాత తిరిగి లైబ్రెరికీ చేరుకుంది.ఈ ఆశ్చర్యకరమైన ఘటన యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో న్యూ బెడ్ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీ నుంచి అరువు తెచ్చుకున్న ఓ పుస్తకం దాదాపు 100 ఏళ్ల తర్వాత లైబ్రరీకి వచ్చింది. ఈ ఘటన అక్కడ ఉన్న లైబ్రెరియన్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత అరుదైన పుస్తకాలను ముద్రించే అవెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ లైబ్రరీ అసిస్టెంట్ డైరెక్టర్ స్టీవర్ట్ ప్లీ కొన్ని పుస్తకాలను సదరు గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చిన కొద్ది రోజుల తర్వాతే ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇక లైబ్రరీకీ తిరిగి వచ్చిన పుస్తకం పేరు "ఎలెమెంటరీ ట్రీటైజ్ ఆన్ ఎలక్ట్రిసిటీ" అనే పుస్తకం. దీని రచయిత జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్. న్యూ బెడ్ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీలో ఈ పుస్తకం ఉండేది. ఈ పుస్తకాన్ని 1904లో ఎవరో జారీ చేశారు. ఆ పుస్తకాన్ని ప్రస్తుతం ఎవరో వ్యక్తి తిరిగి లైబ్రరీకి హ్యండోవర్ చేశారు. అయితే ఆ పుస్తకం చెక్కు చెదరకుండా బాగానే ఉండటం విశేషం. ఈ మేరకు బెడ్ఫోర్డ్ పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ ఒలివియా మెలో మాట్లాడుతూ..ఈ పుస్తకాన్ని చాలా మంచి స్థితిలోనే తీసుకువచ్చి అరలో ఉంచారు. ఏ పుస్తకం అయినా గడవుకి ఇంకాస్త ఆలస్యంగా చేరిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. అదీకూడా మహా అయితే 10 లేదా 15 సంవత్సరాలు మాత్రమే ఆలస్యంగా తిరిగి లైబ్రరీకి చేరుకునే అవకాశం ఉంటుది. కానీ మరి ఇంత దారుణంగా వందేళ్ల తర్వాత తిరిగి రావడం ఇదే మొదటిసారి. ఈ పుస్తకాన్ని 1881లో ముద్రించారు. చరిత్రలో దీనికి గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే ఈ పుస్తకం విద్యుదయస్కాంత రంగంలో ప్రముఖ సహయకారి అయిన రచయిత జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ మరణం తర్వాత వచ్చిన పుస్తకమే ఇది. చెప్పాలంటే ఇది సరిగ్గా 119 ఏళ్లు తిరిగి లైబ్రరీకి చేరుకుంది. ఇంకో వందేళ్లు ఇలానే ఉంటుంది. ఎందుకంటే ముద్రించిన పుస్తకం ఎప్పటికి విలువైనదే. అని సదరు లైబ్రరీ డైరెక్టర్ ఒలివియా నమ్మకంగా చెబుతోంది. (చదవండి: అందాల పోటీల్లో.. తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ కిరీటం దక్కించుకుంది!) -
‘ఇంటర్’కు ఇబ్బందులెన్నో..
మంచిర్యాల సిటీ : ప్రతీ విద్యార్థికి అత్యంత కీలక దశ ఇంటర్మీడియెట్. ఉన్నత విద్యకు ఇక్కడే పునాది పడుతుంది. భవిష్యత్‌కు మార్గనిర్దేశనం చేస్తుంది. అంతటి ప్రాధాన్యం కలిగిన ఇంటర్ విద్యకు జిల్లాలో అన్నీ ఇక్కట్లే. కీలకమైన వివిధ పోస్టులు ఖాళీగా ఉండడంతో జిల్లాలోని 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి అధ్వానంగా మారింది. ఖాళీలు వెక్కిరిస్తుండడంతో పూరిస్థాయిలో బోధన జరగక విద్యార్థులు చదువులో వెనుకబడే పరిస్థితి తలెత్తుతోంది. డీవీఈవో.. : జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషన్ అధికారి పోస్టు ఖాళీగానే ఉంది. ఈ అధికారి కేవలం ప్రభుత్వ కళాశాలలను పర్యవేక్షించి, ఉత్తమ ఫలితాలు సాధిం చేందుకు కృషి చేయాలి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా డీవీఈవో వెంకటయ్య ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈయనే ఇంటర్ వరంగల్ ఆర్జేడీగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వెంకటయ్య 2015, జూన్‌లో ఉద్యోగ విరమణ చేయనుండగా.. ఒక్క అధికారిపైనా ఇన్ని బాధ్యతలు మోపడంతో ఇంటర్ విద్య పూర్తిస్థాయిలో న్యాయం జరగడంలేదని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రిన్సిపాళ్లు.. : జిల్లాలో 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు తొమ్మిది కళాశాలల ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తానూర్, కౌటాల, దహెగాం, బెజ్జూర్, బెల్లంపల్లి(బాలికలు), మందమర్రి, కుభీర్, సారంగాపూర్, నార్నూర్ మండల కేంద్రాల్లోని కళాశాలలకు అక్కడి సీనియర్ అధ్యాపకుడే ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. కుభీర్, నార్నూర్ మండలాలకు కళాశాలలను మంజూరు చేసినా అధికారులు కనీసం ప్రిన్సిపాల్ పోస్టు కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం. అధ్యాపకులు.. : జిల్లాలోని 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 552 మంది అధ్యాపకులు అవసరం. ఇం దులో నేరుగా నియామకమైన వారు 80 మంది మా త్రమే. 400 మంది కాంట్రాక్టు, ఉద్యోగ విరమణ పొం దినవారు తరగతులు బోధిస్తున్నారు. మరో 72 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండడంతో బోధన కుంటుపడిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏకైక పీడీ.. : జిల్లాలో ఒకేఒక ఫిజికల్ డెరైక్టర్ ఉన్నాడు. అది కూడా కాసిపేట జూనియర్ కళాశాలకు మాత్రమే. మిగ తా 45 కళాశాలలకు పీడీలు లేకపోవడంతో ఆటలంటే ఎలా ఉంటాయో తెలియని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు. లైబ్రేరియన్లదీ అదే పరిస్థితి.. జిల్లాలో 12 కళాశాలల్లో లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేరడిగొండ, జైనూర్, కెరమెరి, ఉట్నూర్, తిర్యాణి, బోథ్, వాంకిడి, బెజ్జూర్, మామడ, బేల, ఇంద్రవెల్లి, కడెం కళాశాలల్లో లైబ్రేరియన్ లేరు. దీం తో విద్యార్థులు గ్రంథాలయ సేవలు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారు. బోధనేతర సిబ్బంది ప్రతీ జూనియర్ కళాశాలకు అటెండర్, వాచ్‌మన్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ఉండాలి. 90 శాతం కళాశాలల్లో పూర్తి స్థాయిలో బోధనేతర సిబ్బంది లేరు. దీంతో అన్నీ తాైమై అధ్యాపకులు, విద్యార్థులు పనులు కానిచ్చేస్తున్నారు. ఒక్కరికి ఎన్ని పనులో.. బెజ్జూర్, కౌటాల, దహెగాం, నార్నూర్, తానూర్, తిర్యాణి, బెల్లంపల్లి(బాలికలు) కళాశాలలకు ఒకే ఒక్క రెగ్యులర్ అధ్యాపక పోస్టు మంజూరైంది. ఆ ఒక్కరే ఆ కళాశాలకు ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించాలి. కళాశాల రికార్డులు, విద్యార్థుల ఫీజు, పరీక్ష, ప్రవేశాలు, అధికారులు.. ఉన్నతాధికారుల సమావేశాలకు హాజరు ఇలా.. వివిధ పనులన్నీ తానే చూసుకోవాల్సి వస్తోంది. ఆ పనులన్నీ చేసుకోలేక హైరానా పడుతున్నారు.