Language and cultural department
-
Marathi Language Day: దేశంలో ‘థర్డ్ లాంగ్వేజ్’
మరాఠీ భాషా దినోత్సవాన్ని(Marathi Language Day) ప్రతీయేటా ఫిబ్రవరి 27న జరుపుకుంటారు. ప్రముఖ మరాఠీ కవి విష్ణువామన్ శివాడ్కర్(Vishnuvaman Sivadkar) జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. విష్ణువామన్ శివాడ్కర్ను ‘కుసుమాగ్రజ’ అని కూడా అంటారు. ఈ రోజున మరాఠీ సాహిత్యానికున్న గొప్పదనాన్ని గుర్తిస్తూ, మరాఠీ భాషా రచయితలను సన్మానిస్తుంటారు.మరాఠీ భాష ఆధునిక ఇండో- ఆర్యన్ భాషలలో అత్యంత పురాతనమైనదిగా గుర్తింపు పొందింది. క్రీస్తు శకం 900 నుంచి మరాఠీ భాష మనుగడలో ఉంది. 1999లో కుసుమాగ్రజ మరణానంతరం ప్రభుత్వం ‘మరాఠీ అధికారిక భాషా గౌరవ దినోత్సవం’ను ఆయనకు గుర్తుగా నిర్వహిస్తూ వస్తోంది. అలాగే ఈరోజు మరాఠీ భాషా సాహిత్యంలో విశేష కృషి చేసినవారిని సన్మానిస్తుంటారు. మరాఠీ భాషా దినోత్సవం సందర్భంగా ఈ భాషకున్న కొన్ని ప్రత్యేకతలను తెలుసుకుందాం.మరాఠీ ప్రత్యేకతలు1. హిందీ, బెంగాలీ తరువాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష మరాఠీ. మరాఠీ భాషను తొమ్మిది కోట్లమంది మాట్లాడుతుంటారు.2. మరాఠీలో మొత్తం 42 రకాల యాసలు ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాలను అనుసరించి మారుతుంటాయి.3. మరాఠీని కూడా దేవనాగరి లిపి(Devanagari script)లో రాస్తారు. మరాఠీకి లిపి ఉంది. దీనిని మోదీ లిపి అని అంటారు.4. మరాఠీ లిపిని గుర్తిస్తూ పోస్టల్ శాఖ(Postal Department) ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది.5. 11వ శతాబ్ధంలో మరాఠీ భాషలో తొలి గ్రంథం వెలువడింది.6. మరాఠీ భాషకు ప్రత్యేక వ్యాకరణం కూడా ఉంది. మరాఠీ భాషను మహారాష్ట్రీ, మరహట్టీ అని కూడా పిలిచేవారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ.. -
నేటి నుంచి తెలంగాణ కవితా సప్తాహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మహాకవులు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య, డాక్టర్ సి.నారాయణరెడ్డిల జయంతిని పురస్కరించుకొని ఆదివారం నుంచి కవితా సప్తాహం కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి తెలిపారు. ఈ నెల 22న దాశరథి కృష్ణమాచార్య, 29న సి.నా.రె. జయంతి ఉందని, వీరి పేరుతో ఓ మంచి సాహిత్య కార్యక్రమం చేపట్టామని చెప్పారు. శనివారం రవీంద్రభారతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కవితా సప్తాహంలో భాగంగా ప్రముఖుల ప్రసంగాలు, కవి సమ్మేళనాలు ఉంటాయని తెలిపారు. దాశరథి, సినారెల మధ్య సోదర సంబంధాలు ఉండేవని, వారిది అన్నాతమ్ముళ్ల అనుబంధమని పేర్కొన్నారు. 7 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా రోజూ 40 నిమిషాలు ప్రధాన ప్రసంగం, 11 మంది కవుల కవితాపఠనం ఉంటాయన్నారు. 22న మహాకవి దాశరథి కవితాప్రస్థానంపై డాక్టర్ గురిజాల రామశేషయ్య ప్రసంగముంటుందని తెలిపారు. 23న ‘తెలంగాణ వచన కవితావికాసం’పై డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, 24న ‘తెలంగాణ పద్య కవితా ప్రాభవం’పై డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, 25న ‘తెలంగాణ కవిత్వం – పాట ప్రస్థానం’పై డాక్టర్ పసునూరి రవీందర్, 26న ‘తెలంగాణ కవిత్వం–జీవితం’పై డాక్టర్ ఎస్ రఘు, 27న ‘తెలంగాణ కవిత్వం–అలంకారికత’పై డాక్టర్ లక్ష్మణచక్రవర్తి, 28న ‘తెలంగాణ కవిత్వ విమర్శ’పై డాక్టర్ జి.బాలశ్రీనివాసమూర్తి ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. ఈ ఏడురోజుల కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా డాక్టర్ కేవీ రమణాచారి, బుర్రా వెంకటేశం, దేశపతి శ్రీనివాస్, డాక్టర్ వెలిచాల కొండలరావు, దేవులపల్లి ప్రభాకర్‌రావు, డాక్టర్ ఆయాచితం శ్రీధర్, డాక్టర్ ఎన్ గోపిలు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమాలు రోజూ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కవితా సప్తాహం పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు. రవీంద్రభారతిలో నేడు దాశరథి జయంతి దాశరథి 94వ జయంతి కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతిలో జరగనుంది. ఈ సందర్భంగా దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రముఖకవి వఝల శివకుమార్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజ్మీరా చందులాల్ పాల్గొంటారని ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇరాన్‌తో ‘సాంస్కృతిక’ ఒప్పందం
హైదరాబాద్: రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఇరాన్‌కు మధ్య ఓ ఒప్పందం కుదిరింది. మంగళవారం రవీంద్రభారతి ప్రాంగణంలోని భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. రాష్ట్రం తరఫున భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఇరాన్‌కి చెందిన సాంస్కృతిక ప్రజా సంబంధాల అధికారి అలీ ఎ నిరూమాండ్, అలీ పర్గడ్ తదితరులు పాల్గొని చర్చించారు. ఒప్పందం ప్రకారం ఈ నెల 26న రవీంద్రభారతిలో ఇరాన్ కళాకారులు ఓ వినూత్న సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రయత్నం దీర్ఘకాలం కొనసాగుతుందని, బయటి దేశాల కళారూపాలను తాము స్వాగతిస్తున్నామని హరికృష్ణ తెలిపారు. అలాగే తెలంగాణ కళారూపాలను కూడా ఇరాన్ ఇదేవిధంగా గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ కళారూపాలను ప్రపంచ వ్యాప్తం చేసే ఆలోచనతో సాంస్కృతిక జైత్రయాత్రను నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు.