breaking news
Kenyan government
-
కేరింతలతో అంత్యక్రియలు..
చితికి నిప్పుపెట్టే సందర్భంలో ఎవరైనా హర్షధ్వానాలు చేస్తారా? కణకణమండే ఆ నిప్పుల్ని చూసి కిలకిలా నవ్వుతారా? చచ్చింది ఏ విలనో, విలనిజం తాలూకు గుర్తులో అయితే జనం అలా చేయడంలో తప్పేముంటుంది? తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో అదే జరిగింది. ఉగ్రవాదులు, సంఘవిద్రోహక శక్తుల నుంచి ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్న 5,250 అక్రమ ఆయుధాలను 15 అడుగుల ఎత్తులో వరుసగా ఏర్పాటుచేసిన దండాలకు కు చితిలా పేర్చి పెట్రోల్ కుమ్మరించి నిలువునా దహనం చేశారు. వందలాది మంది జనం కేరింతల మధ్య గత వారం నైరోబీలో కెన్యా ఉపాధ్యక్షుడు విలియం రూటో తుపాకులకు నిప్పుపెట్టారు. అగ్నికి ఆహుతైన తుపాకుల్లో అధికశాతం ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చినవేనని, ఇంకోన్ని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నవని ఉపాధ్యక్షుడు చెప్పారు. తుపాకులను పేర్చి దహనం చేసిన దృశ్యాలను విలియం తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. సోమాలియాలో విధ్వంసం సృష్టిస్తోన్న అల్-షబీబ్ ఉగ్రవాద సంస్థ కెన్యాలోనూ కాలు మోపే ప్రయత్నం చేస్తున్నదని, ఆ క్రమంలో పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాలను సరఫరా చేస్తున్నదన్న విలియం..ఇకపై అలాంటిచర్యలను ఉపేక్షించబోమని ఉగ్రవాదులను హెచ్చరించారు. ఇప్పుడు కాల్చేసినవి కాకుండా కెన్యాలో మరో 5 లక్షల అక్రమ ఆయుధాలు ఉన్నట్లు, అతి త్వరలోనే వాటిని కూడా స్వాధీనం చేసుకుని తగలబెడతామని ఆయన అన్నారు. -
అది ప్రకృతికి విరుద్ధం.. మేం ఒప్పుకోం
నైరోబీ: తాము స్వలింగ సంపర్కానికి వ్యతిరేకం అని కెన్యా ఉపాధ్యక్షుడు విలియమ్ రూటో స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు తాము ఏమాత్రం అనుమతించబోమని చెప్పారు. అది మానవ నైజానికి పూర్తిగా విరుద్ధమైన చర్య అని, క్రిస్టియానిటికి కూడా వ్యతిరేకమని చెప్పారు. మేం మతపెద్దలు చెప్పిన అంశాలకు కట్టుబడి ఉంటాం. మా నమ్మకాలు, విశ్వాసాలు కాపాడుకుంటాం. మా సమాజంలో స్వలింగ సంపర్కానికి అనుమతించం. అది మా సంస్కృతిని, సంప్రదాయాలను, మతాన్ని దెబ్బతీస్తుంది' అని ఆయన తెలిపారు. ఇలాంటి చర్యలను వ్యతిరేకించే ఎలాంటి మతసంస్థకైనా.. ఇతర సంస్థలకైనా ప్రభుత్వం తరుపునా పూర్తి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా గత వారంలో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం తరుఫున అటార్నీ జనరల్, గేలు, లెస్బియన్ల తరుపున మరికొందరు కోర్టులో వాదనలు జరిపారు. అందరి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.