breaking news
Justice Dilip B. Bhosale
-
చెరకుతోట దహనం’పై వివరాలివ్వండి
గుంటూరు పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం, మల్కాపురంలో చెరకుతోట దహనమైన కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తమముందు ఉంచాలని గుంటూరు జిల్లా పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విషయమై తన కుమారుడు నూతక్కి సురేశ్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆచూకీ తెలపడం లేదని తండ్రి రాములు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం ధర్మాసనం విచారణ చేసి పూర్తి వివరాలు అందజేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
పదేపదే వాయిదాలు కోరతారెందుకు?
ఇరు రాష్ట్రాల జీపీలు, ఏజీపీలపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కేసుల విచారణ సందర్భంగా ఇరురాష్ట్రాల ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదులు(ఏజీపీ) పదేపదే వాయిదాలు కోరుతుండటంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోరిన వివరాల్ని అధికారులు సకాలంలో అందించడం లేదన్న కారణాన్ని సాకుగా చూపుతూ తరచూ వాయిదాలు కోరుతుండటాన్ని తప్పుపట్టింది. విచారణకు సహకరించని కిందిస్థాయి అధికారులను బాధ్యులుగా చేస్తూ ఆయాశాఖల ముఖ్య కార్యదర్శులకు భారీ జరిమానా విధిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. చిత్తూరు జిల్లాల్లో ఓ భూవివాదానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ గతవారం విచారణకొచ్చినప్పుడు పూర్తి వివరాలు కోర్టు ముందుంచేందుకు గడువుకావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇందుకు జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం అనుమతినిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకొచ్చింది. ఈసారి కూడా ప్రభుత్వ న్యాయవాది వివరాలు సమర్పించేందుకు గడువు కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. ఇలా పదేపదే వాయిదాలు కోరడం సరికాదని పేర్కొంది. అయితే ప్రభుత్వ న్యాయవాది, వివరాల సమర్పణకు చివరి అవకాశమివ్వాలని కోరగా, ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.