breaking news
On the job
-
లీవు లేకుండా 74 ఏళ్లుగా ఉద్యోగం..! 16 ఏళ్ల వయసులో ఎంట్రీ
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మహిళ ఉద్యోగానికి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా ఏకంగా 74 ఏళ్లపాటు విధులకు హాజరయ్యారు. మెల్బా మెబానె 16 ఏళ్ల వయసులో 1949లో టైలర్ అనే స్టోర్‌లో ఉద్యోగంలో చేరారు. 1956లో ఆ సంస్థను డిలార్డ్ సొంతం చేసుకుంది. లిఫ్ట్ ఆపరేటర్‌గా జాయినయి దుస్తులు, కాస్మటిక్ విభాగంలో 74 ఏళ్లపాటు పనిచేశారు. 90 ఏళ్ల వయసులో ఇటీవలే రిటైరయ్యారు. ఇప్పుడిక మంచి ఆహారం తీసుకుంటూ, ప్రయాణాలు చేస్తూ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని అన్నారు. -
అమ్మకు ఫోన్ చేసిన అరగంటకే..
బూర్జ: తోటవాడ గ్రామానికి చెందిన చోడి లక్ష్మీ నరసింహరాజు (23)కర్నాటకలోని బీదర్‌లో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అతను ఆదివారం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న గృహం నుంచి విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజు మృతదేహం మంగళవారం తోటవాడ గ్రామానికి చేరుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.ఇంటి దీపం ఆరిపోయింది మా ఇంటి దీపం ఆరిపోయిందని తల్లితండ్రులు చోడి రమణమ్మ, అప్పారావు కుమారుని మృతదేహంపై పడి బోరున విలపించారు. సంక్రాంతి పండగకు 20రోజులు సెలవుపై వచ్చిన తమ కుమారుడు, తమతోపాటు మిత్రులతో ఎంతో ఆనందంగా గడిపాడని, ఇంతలోనే మాయమయ్యాడని వారు రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. అక్కడ ఉద్యోగానికి వెళ్లేందుకు ద్విచక్రవాహనం అవసరమంటూ శ్రీకాకుళంలో వాహనాన్ని కొనుగోలు చేసుకొని నాలుగు రోజుల కిందటే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లాడని చెప్పారు. హైదరాబాద్ చేరుకొని, ఇక్కడ నుండి పార్సిల్ చేసిన బండిని తీసుకున్నానని మరుసటి రోజు ఫోన్‌చేసిన అరగంటలోనే కుమారుడి మరణవార్త తెలియటంతో నమ్మలేకపోయామని వారు గుండెలు బాదుకున్నారు. తమ కుమారుడు ఉద్యోగం చేసి ప్రయోజకుడయ్యాడని ఇక మా కష్టాలు గట్టేక్కాయని ఎంతో సంతోషపడ్డామని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని బోరు రోదించారు. ఇక ఈ కుటుంబ భారం నా కొడుకే చూసుకుంటాడనుకుంటే.. దేవుడు మా కొడుకు ప్రాణాలు తీసుకువెళ్లాడంటూ వారు నెత్తీ నోరు కొట్టుకొని ఏడుస్తూ కుప్పకూలిపోయారు. లక్ష్మీనరసింహరాజు మృతిని మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. బంధువులు, మిత్రులు,తోటి ఉద్యోగులతో ఆ గ్రామం విషాద ఛాయల్లో మునిగిపోయింది.