breaking news
Jisat 16
-
జీ శాట్-16 ప్రయోగం విజయవంతం
బెంగుళూరు : భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-16 ప్రయోగం ఎట్టకేలకు దిగ్విజయంగా జరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా గత రెండు రోజులుగా ఈ ప్రయోగం వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక 2.10 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. -
జీశాట్-16 ప్రయోగం వాయిదా
సూళ్లూరుపేట/బెంగళూరు: ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం తె ల్లవారుజామున చేపట్టాల్సిన జీశాట్-16 ఉపగ్ర హ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ రాకెట్ ద్వారా జీశాట్-16ను ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు పూర్తిచేసినా, వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఏరియన్ రాకెట్ ద్వారా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న ఈ ఉపగ్రహంలో సమాచార వ్యవస్థకు ఉపయోగించే 12 కేయూ బ్యాండ్, 24 సీబ్యాండ్, 12 ఎక్స్టెండెడ్ సీబ్యాండ్ ట్రాన్స్పాండర్ల(సిగ్నళ్లను స్వీకరించి, ప్రసారం చేసే పరికరాలు)ను అమర్చారు. జీశాట్-16 ఉపగ్రహం భారత్ ప్రయోగిస్తున్న 11వ సమాచార ఉపగ్రహం కాగా, పెద్దమొత్తంలో 48 ట్రాన్స్పాండర్లను ఒకేసారి పంపనుండటం ఇదే తొలిసారి.