breaking news
JC Satyanarayana
-
ఆహార భద్రత కార్డులపై నేడు ఫోన్‌ఇన్
సమస్యలు తెలియజేయాల్సిన నంబర్ 08682-244509 సమయం : ఉదయం 10 నుంచి 11 గంటల వరకు రాంనగర్ : జిల్లా ఆహారభద్రత కార్డుల కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేసీ సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులై ఉండి ఆహారభద్రత కార్డులు రాకున్నా, ఒకవేళ జాబితాలో పేరు వచ్చి రేషన్‌షాపులో పేరు లేకున్నా ఫోన్ ఇన్ కార్యక్రమానికి తెలియజేయాలని కోరారు. అదే విధంగా అనర్హులకు కార్డులు వచ్చినా కూడా తనకు తె లియజేయాలని తెలిపారు. ఈ అ వకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 08682-244509 ఫోన్ నంబర్ ద్వారా తెలిపాలని సూచించారు. -
అవసరమైతే 20 గంటలు పనిచేస్తా
జేసీ సత్యనారాయణ కలెక్టరేట్లో బాధ్యతల స్వీకరణ రాంనగర్ : బంగారు తెలంగాణ కోసం అవసరమైతే 20 గంటలు పనిచేసేందుకు కూడా వెనుకాడబోనని నూతన జాయింట్ కలెక్టర్‌గా సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన జేసీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వంద శాతం విజయవంతం అయ్యే విధంగా పని చేస్తానని తెలిపారు. ఉద్యోగులందరి సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లానుంచి కొన్ని కీలక పథకాలు మొదలు పెడుతుందని, వాటిని సజావుగా పూర్తి చేసేందుకు తన శక్తి మేరకు పని చేస్తానన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అనంతరం డీఆర్ఓ నిరంజన్, నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్ఓ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, నల్లగొండ తహసీల్దార్ అశోక్‌రెడ్డి తదితరులు బోకేలు అందజేసి అభినందనలు తెలిపారు.