వింబుల్డన్ సెమీస్‌లో ఉక్రెయిన్ సంచలనం
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఉక్రెయిన్ సంచలనం మార్తా కొష్ట్యుక్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ కొష్ట్యుక్ 6-3, 6-2తో ఇటలీకి చెందిన 13వ సీడ్ జాస్మిన్ పవోలినిను మట్టికరిపించింది. కేవలం గంటా 9 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో కొష్ట్యుక్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండు సెట్లలోనే మ్యాచ్‌ను కైవసం చేసకున్న కొష్ట్యుక్ 3 ఏస్‌లు సంధించడంతో పాటు 19 విన్నర్లు కొట్టగా, పవోలిని 8 విన్నర్లకే పరిమితమైంది. 26 అనవసర తప్పిదాలతో పవోలిని మూల్యం చెల్లించుకుంది. మరో క్వార్టర్స్‌లో లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 7-5తో ఎలిస్ మెర్టిన్స్ (బెల్జియం)పై సునాయాస విజయం సాధించి సెమీస్ చేరుకుంది. లిండా నొస్కోవాగురువారం జరగనున్న సెమీస్‌లో గాఫ్‌తో ముచ్కోవా, కొష్ట్యుక్తో నొస్కోవా తలపడనున్నారు. గత 22 మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి మాత్రమే చవిచూసిన కొష్ట్యుక్‌కు మేజర్ టోర్నీల్లో ఇది వరుసగా రెండో సెమీఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లో మిర్రా ఆండ్రీవా చేతిలో కొష్ట్యుక్ ఓటమి చవిచూసింది. Marta Kostyuk's 96mph forehand. Unstoppable. 💥 pic.twitter.com/b65WxCl89e— Wimbledon (@Wimbledon) July 8, 2026