breaking news
Janaseva Dal
-
కార్యకర్తలు క్రమశిక్షణతో మెలగాలి
చింతలపాలెం (హుజూర్నగర్) : జనసేవాదళ్ కార్యకర్తలు క్రమశిక్షణ, నిబద్ధతో మెలగాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గన్నా చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం చింతలపాలెంలో సూర్యాపేట జిల్లా సీపీఐ జనసేవాదళ్, రెడ్ షర్ట్ వలంటీర్స్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించే సీపీఐ రాష్ట్ర 2వ మహాసభల్లో భాగంగా 1వ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తేల నారాయణరెడ్డి, మేకల శ్రీనివాస్, పాలకూరి బాబు, కంబాల శ్రీనివాస్, రామలు, కొండా కోటయ్య, నాయకులు అబ్దుల్‌భాషా, మల్లయ్య, ఎల్లావుల రమేష్, జియాలుద్దీన్, భూకర్ణ, వీరబాబు, వెంకట్‌రెడ్డి, సైదులు, కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, భద్రారెడ్డి, కోటయ్య, రజాక్, శేఖర్, మణికంఠ, విక్రమ్ పాల్గొన్నారు. -
మతోన్మాద అంతానికి సిద్ధం కావాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న అప్రజాస్వామిక పోకడలు, మతోన్మాదం అంతానికి జనసేవ దళ్ వలంటీర్లు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ, ఏఐవైఎఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మూడ్రోజుల జనసేవదళ్ వలంటీర్ల శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సమావేశానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలమల్లేశ్, ఐలయ్యగౌడ్ పాల్గొన్నారు.