breaking news
Jaidev unadkat
-
వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియా క్రికెటర్ రీఎంట్రీ! 9 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్
టీమిండియా వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ 9 ఏళ్ల తర్వాత తొలి వన్డే మ్యాచ్ ఆడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గురువారం బార్బోడస్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉనద్కట్కు చోటు దక్కనున్నట్లు సమాచారం. విండీస్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ దూరమయ్యాడు. మడమ నొప్పితో బాధపడుతున్న సిరాజ్‌కు మేనేజ్మెంట్ విశ్రాంతి నిచ్చింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా ధ్రువీకరించింది. విండీస్‌తో తొలి వన్డే ఆరంభానికి ముందు ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. ఈ క్రమంలో తొలి వన్డేలో సిరాజ్ స్ధానాన్ని ఉనద్కట్‌తో భర్తీ చేయాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉనద్కట్ చివరగా 2013లో ఇదే వెస్టిండీస్‌పై వన్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు భారత్ తరపున 7 వన్డేలు ఆడిన జయదేవ్.. 8 వికెట్లు పడగొట్టాడు. అతడి కెరీర్లో 4/41 అత్యత్తుమ బౌలింగ్ గణాంకాలగా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి టీమిండియా తరపున సత్తా చాటేందుకు అతడికి సువర్ణ అవకాశం లభించింది. అతడితో పాటు పేస్ బౌలింగ్‌లో , శార్ధూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్ బంతిని పంచుకునే ఛాన్స్ ఉంది. కాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో కూడా భాగమైన జయదేవ్ ఉనద్కట్.. రెండు టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. తుది జట్లు(అంచనా) భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ , జయదేవ్ ఉనద్కట్ విండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్, జేడెన్ సీల్స్ చదవండి: వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు టీమిండియాకు భారీ షాక్! అందుకే సిరాజ్ దూరం: బీసీసీఐ -
మారువేషంలో జడేజా.. అంతా ఉనాద్కట్ మాయ!
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలీ సర్జరీతో టి20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. జడ్డూతో పాటు బుమ్రా కూడా దూరమవ్వడం టీమిండియా అభిమానులకు షాక్ తగిలేలా చేసింది. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే టీమిండియా ప్రపంచకప్‌లో ఆడనుంది. మరి టీమిండియా అంచనాలు అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఈ విషయం పక్కనబెడితే.. ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జడేజా బ్యాటర్‌గా ప్రత్యక్షమైన ఫోటో వైరల్‌గా మారింది. అదేంటి ప్రస్తుతం జడేజా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో ఉన్నాడు కదా.. ఇరానీ కప్‌లో ఆడడమేంటీ అనుకుంటున్నారా. అదంతా సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ మాయ. అతని పెట్టిన ఒక ఫోటో ఇప్పుడు చర్చకు దారి తీసింది. రెస్టాఫ్ ఇండియాతో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ ఉనాద్కట్‌తో పాటు ప్రేరణ్ మన్కడ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరి మధ్య ఎనిమిదో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే ప్రేరక్ మన్కడ్‌ను దూరం నుంచి చూస్తే కాస్త రవీంద్ర జడేజాలానే పోలి ఉంటాడు. ఇక్కడే ఉనాద్కట్ తన తెలివిని ఉపయోగించాడు. తనతో బ్యాటింగ్ చేసిన ప్రేరక్ మన్కడ్ ఫోటోకు కాస్త మార్ఫింగ్ చేసి జడేజాను పెట్టాడు. ''జడ్డూ టీమ్‌లో ఉండడం ఆనందంగా ఉంది(మారువేషంలో)'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కేవలం సరదా కోసమే చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. జడేజా, ప్రేరక్ మన్కడ్లకు పోలికలు దగ్గరగా ఉండడంతో..'' మరో జడేజా వచ్చేశాడు.. టి20 ప్రపంచకప్‌కు ఈ జడ్డూను పంపిద్దామా'' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 380 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెస్టాఫ్ ఇండియా ముందు 104 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతం రెస్టాఫ్ ఇండియా 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 25, శ్రకర్ భరత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. Glad to have Jaddu in the team.. (in disguise 😂) @imjadeja = @PrerakMankad46 pic.twitter.com/3URrzEMgD2 — Jaydev Unadkat (@JUnadkat) October 3, 2022 చదవండి: 'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం గెలిపించిన షేన్ వాట్సన్.. ఫైనల్‌కు బిల్వారా కింగ్స్ -
పృథ్వీ షాను ఔట్ చేయడానికి ఆ ప్లాన్ ఉపయోగించా
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్ మూడు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. మొదటి స్పెల్‌లోలోనే మూడు ఓవర్లు వేసిన అతను ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్‌లతో పాటు అజింక్య రహానే వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 4 ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఉనాద్కట్ 15 డాట్ బాల్స్ వేయడం విశేషం. ఈ నేపథ్యంలో పృథ్వీ షాను ఔట్ చేసేందుకు ఒక ప్లాన్ అమలు చేసినట్లు ఉనాద్కట్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. ''సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా ఎక్కువగా గ్రౌండ్ షాట్లు ఆడి విజయవంతమయ్యాడు. అందునా గత మ్యాచ్‌లో షా ఆడిన ఎక్కువ షాట్లు మిడ్‌వికెట్ రీజియన్ నుంచి వచ్చాయి. ఈ మ్యాచ్‌లో అలా కాకూదనే జాగ్రత్త వహించాం. స్లో బాల్ వేస్తే పృథ్వీ మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేస్తాడు. అందుకే నా రెండో ఓవర్లో ఆఖరి బంతిని స్లో బాల్‌గా వేశాను.. పృథ్వీ దానిని మిడ్‌వికెట్ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అది బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న మిల్లర్ చేతికి చిక్కడంతో నా ప్లాన్ ఫలించింది. అలా షాను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపడంలో సక్సెస్ అయ్యాం. ఇక మొదటి మ్యాచ్‌లో నాకు అవకాశం రాలేదు.. అయినా సరే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని ఎదురుచూశా. అలా రెండో మ్యాచ్‌లోనే ఒక మంచి స్సెల్ వేయడం .. కీలక వికెట్లు తీయడం నాకు కలిసొచ్చింది. గత సీజన్లో పెద్దగా రాణించలేకపోయా.. కానీ ఈ సీజన్లో దానిని పునరావృతం చేయకుండా చూసుకుంటా'' అని చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో ఉనాద్కట్ రాజస్తాన్ రాయల్స్ తరపున 7 మ్యాచ్‌లాడి కేవలం 4 వికెట్లు మాత్రమే తీసి ఘోరంగా విఫలమయ్యాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ మోరిస్ మెరుపులతో ఆఖరి ఓవర్ నాలుగో బంతికి విజయాన్ని అందుకుంది. కాగా రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 19న సీఎస్కేతో ఆడనుంది. చదవండి: సంజూ ఎంతో చక్కగా షాట్స్ ఆడాడు.. కాబట్టి సామ్సన్.. నా బ్యాటింగ్ చూడు! -
కోట్లతో ‘జై’ కొట్టారు
అనూహ్యానికి, ఆశ్చర్యానికి అడ్రస్‌లాంటి ఐపీఎల్ వేలంలో మరో పెద్ద సంచలనం. ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున డజను మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగిన లెఫ్టార్మ్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్‌పై కోట్ల వర్షం కురిసింది. రాజస్తాన్ రాయల్స్ ఏకంగా రూ. 11.5 కోట్ల మొత్తానికి అతడిని సొంతం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. గత ఏడాది ఐపీఎల్లో నిలకడగా రాణించడం ఒక కారణమైనా... ఇంత భారీ ధర పలకడం మాత్రం నివ్వెరపరిచేదే! తాజా వేలంలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన భారత ఆటగాడిగా నిలిచిన ఉనాద్కట్... స్టోక్స్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. అన్క్యాప్డ్ ఆటగాడు కృష్ణప్ప గౌతమ్‌కు రూ.6.2 కోట్లు లభించడం మరో విశేషం కాగా... ఎట్టకేలకు రూ. 2 కోట్ల కనీస ధరతో క్రిస్ గేల్ పంజాబ్ చెంత చేరడం కొసమెరుపు. బెంగళూరు: ఐపీఎల్–2018 కోసం జరిగిన వేలంలో రెండో రోజు కూడా ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. ఇప్పటికే గుర్తింపు పొందిన ఆటగాళ్లతో పాటు కొత్తవాళ్లకు కూడా పెద్ద మొత్తం చెల్లించేందుకు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో ఉనాద్కట్, గౌతమ్ ముందు వరుసలో నిలిచారు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ఆండ్రూ టైని పంజాబ్ జట్టు రూ.7.20 కోట్లకు గెలుచుకుంది. విదేశీ ఆటగాళ్లలో రెండో రోజు ఇదే అత్యధిక మొత్తం. తొలి రోజు సన్‌రైజర్స్ తీసుకున్న రషీద్ ఖాన్‌తో పాటు మరో ముగ్గురు అఫ్గానిస్తాన్ ఆటగాళ్లకు కూడా ఐపీఎల్లో చోటు లభించగా... సందీప్ లిమిచానే ఈ లీగ్‌లో అడుగు పెడుతున్న తొలి నేపాల్ క్రికెటర్‌గా నిలవడం విశేషం. కోల్‌కతా జట్టు తమకు అందుబాటులో ఉన్న మొత్తం రూ. 80 కోట్లను పూర్తిగా వినియోగించుకోగా... చివర్లో ఆటగాళ్లను ఎంచుకోవడంలో గందరగోళానికి గురైన చెన్నై రూ.6.50 కోట్లను ఉపయోగించుకోలేక వృథా చేసుకుంది. ఎనిమిది జట్లలో కోల్‌కతా, పంజాబ్ గరిష్ట విదేశీ ఆటగాళ్లు (8)ను ఎంచుకోకుండా 7కే పరిమితమయ్యాయి. ఒక్కోజట్టు సభ్యుల సంఖ్య గరిష్టంగా 25 కాగా చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సరిగ్గా 25 మందిని తీసుకున్నాయి. బెంగళూరు (24), రాజస్తాన్ (23), పంజాబ్ (21), కోల్‌కతా (19) తక్కువ సంఖ్యకే తమ వేలాన్ని ముగించాయి. ఉనాద్కట్ కోసం పోటీ పడి... స్వయంగా ఉనాద్కట్ కూడా కలలో ఊహించలేని విధంగా అతని కోసం వేలం సాగింది. రూ. 1.5 కోట్ల కనీస ధరతో అతను వేలంలోకి అందుబాటులోకి వచ్చాడు. అందరికంటే ముందుగా చెన్నై రేసులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత పంజాబ్ వేలానికి సిద్ధమైంది. ఒకరితో మరొకరు పోటీ పడి విలువ పెంచేశారు. ఫలితంగా 4 కోట్లు... 5... 8... ఇలా పంజాబ్ 10 కోట్లకు తీసుకుపోయింది. చెన్నై 10.5 చెప్పినా మళ్లీ పంజాబ్ 11కు పెంచి ఆగిపోయింది. ఇక పంజాబ్‌కే ఖాయం అనిపించిన దశలో అనూహ్యంగా రాజస్తాన్ ముందుకొచ్చింది. రూ. 11.5 కోట్లకు సిద్ధమని ప్రకటించి ఉనాద్కట్‌ను సొంతం చేసుకుంది. నిజానికి ఉనాద్కట్ వేలానికి వచ్చే సమయానికి రాయల్స్ వద్ద మొత్తం 16.5 కోట్లు మాత్రమే మిగిలాయి. కానీ ఆ జట్టు ఒక్క ఆటగాడి కోసం అందులో 70 శాతం మొత్తాన్ని ఖర్చు చేయడం అమితాశ్చర్యం కలిగించింది. గత ఏడాది పుణే తరఫున ఆడిన ఉనాద్కట్ హ్యాట్రిక్ సహా 7.02 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ (26) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. గౌతమ్ కనీస ధర రూ. 20 లక్షలు కాగా... బెంగళూరు, కోల్‌కతాలతో పోటీ పడి రాయల్స్ చివరకు అతడిని తీసుకుంది. ఇది గౌతమ్ కనీస ధరకంటే 31 రెట్లు ఎక్కువ కావడం విశేషం. అంతర్జాతీయ టి20ల్లో భారత్‌పైనే 2 సెంచరీలు చేసిన ఎవిన్ లూయీస్ (వెస్టిండీస్) కోసం సన్‌రైజర్స్ ఆసక్తి చూపించినా, అతడిని ముంబై దక్కించుకుంది. ధోని ఫేవరెట్ మోహిత్ శర్మను చెన్నై రూ.2.4 కోట్లకు గెలుచుకోగా... రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా అతను పంజాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ముచ్చటగా మూడోసారి... విధ్వంసకర ఆటగాడిగా లెక్కలేనన్ని టి20 రికార్డులు తన పేరిట ఉన్న క్రిస్ గేల్ ఐపీఎల్ కెరీర్‌కు చివరకు పంజాబ్ ఊపిరి పోసింది. ఆదివారం రెండోసారి వేలంలో కూడా అతడిని ఎవరూ తీసుకోలేదు. మూడోసారి మాత్రం కనీస ధర రూ. 2 కోట్లకు కింగ్స్ ఎలెవన్ ఎంచుకోగా, మరే ఫ్రాంచైజీ పోటీ పడలేదు. శ్రీలంక తరఫున ఆఫ్ స్పిన్నర్ అఖిల ధనంజయ, ఆల్‌రౌండర్ దుష్మంత చమీరాలకు మాత్రమే ఐపీఎల్ అవకాశం లభించింది. మురళీ విజయ్ కూడా... తొలి రోజు వేలంలో అమ్ముడుపోని భారత టెస్టు ఓపెనర్ మురళీ విజయ్‌కు రెండో రోజు అదృష్టం వెంట వచ్చింది. అతని సొంత నగరానికే చెందిన చెన్నై సూపర్ కింగ్స్ కనీస ధర రూ. 2 కోట్లకు విజయ్ను ఎంచుకుంది. చెన్నైకి ఆ సమయంలో కచ్చితంగా ఒక భారత బ్యాట్స్‌మన్, అదీ ఓపెనర్ అవసరం ఉండటం కూడా విజయ్‌కు కలిసొచ్చింది. శనివారం ఎవరూ పట్టించుకోని పార్థివ్ పటేల్ (రూ.1.7 కోట్లు–బెంగళూరు), మిచెల్ జాన్సన్ (రూ. 2 కోట్లు – కోల్‌కతా) రెండోసారి మాత్రం ఎంపికయ్యారు. ఐపీఎల్లో బిర్లా వారసుడు బిర్లా... ఈ పేరు వినగానే మన మదిలో అతి పెద్ద పారిశ్రామికవేత్త, అపార సంపద కలిగిన కోటీశ్వరుని పేరే మదిలో మెదులుతుంది! ఇప్పుడు అలాంటి బిర్లా కుటుంబ వారసుడు ఐపీఎల్లో అడుగు పెట్టబోతున్నాడు. ఐపీఎల్ రాకతో పేదలు ధనవంతులుగా మారిన కథలతో పోలిస్తే ఇది కాస్త భిన్నం. 20 ఏళ్ల ఆర్యమాన్ విక్రమ్ బిర్లా తాజా వేలంలో రాజస్తాన్ రాయల్స్ జట్టులోకి ఎంపికయ్యాడు. కుమార మంగళం బిర్లా కుమారుడే ఆర్యమాన్ కావడం విశేషం. రూ.20 లక్షల కనీస విలువతో ఆర్యమాన్ పేరు వేలంలోకి వచ్చింది. రాజస్తాన్ అదే మొత్తానికి ముందుగా రాగా పంజాబ్ మరో ఐదు లక్షలు పెంచింది. అయితే ఆ తర్వాత రాయల్స్ రూ. 30 లక్షలకు ఆర్యమాన్‌ను సొంతం చేసుకుంది. ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అయిన ఆర్యమాన్ మధ్యప్రదేశ్ తరఫున ఇటీవల తన ఏకైక రంజీ మ్యాచ్ ఆడాడు. కొన్నాళ్ల క్రితమే అండర్–23 సీకే నాయుడు టోర్నీలో 153 పరుగులతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబై జట్టులో అవకాశాలు లభించడం కష్టంగా భావించి మధ్యప్రదేశ్‌కు తరలి వెళ్లిన ఆర్యమాన్... వ్యాపారంకంటే క్రికెట్ కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పాడు. సిరాజ్ అదే మొత్తానికి.... హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఈసారి కోహ్లి సారథ్యంలోని బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు. గత ఏడాదిలాగే ఈసారి కూడా సిరాజ్ సరిగ్గా రూ. 2.6 కోట్ల ధర పలకడం విశేషం. 2017 ఐపీఎల్లో 6 మ్యాచ్‌లలో 10 వికెట్లు పడగొట్టిన సిరాజ్... ఆ తర్వాత భారత జట్టుకు కూడా ఎంపికై రెండు టి20లు ఆడి 2 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం వేలంలో సిరాజ్ కోసం వరుసగా కోల్‌కతా, ముంబై, చెన్నై, పంజాబ్ పోటీ పడినా... చివరకు బెంగళూరు అతడిని దక్కించుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఇతర ఆటగాళ్లలో తన్మయ్ అగర్వాల్ ఈసారి కూడా కనీస ధర (రూ. 20 లక్షలు)కు సన్‌రైజర్స్‌కే ఎంపికయ్యాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్‌ను కూడా తొలిసారి రైజర్స్ ఎంచుకోవడం విశేషం. ఆంధ్ర క్రికెటర్లలో రికీ భుయ్ (రూ.20 లక్షలు) వరుసగా రెండోసారి రైజర్స్ తరఫున కొనసాగనున్నాడు. మరో ఇద్దరు... అఫ్గానిస్తాన్ తరఫున గత ఏడాది ఐపీఎల్లో ఇద్దరు ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఈసారి కూడా రషీద్ ఖాన్ (రూ. 9 కోట్లు), మొహమ్మద్ నబీ (రూ. 1 కోటి) హైదరాబాద్‌కే ఆడనున్నారు. వీరితో పాటు కొత్తగా మరో ఇద్దరు కూడా ఐపీఎల్లో అడుగు పెడుతుండటం విశేషం. ప్రస్తుతం అండర్–19 ప్రపంచ కప్ ఆడుతున్న ముజీబ్ జద్రాన్, జహీర్ ఖాన్ పక్తీన్లకు చోటు లభించింది. 17 ఏళ్ల ముజీబ్‌కు ‘మిస్టరీ స్పిన్నర్’గా గుర్తింపు ఉంది. ప్రధానంగా ఆఫ్ స్పిన్నర్ అయినా లెగ్ స్పిన్, గుగ్లీలు కలగలిపి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. రెండు రోజుల క్రితం న్యూజిలాండ్‌పై 4 వికెట్లు తీసి అఫ్గాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ముజీబ్‌ను పంజాబ్ ఏకంగా రూ. 4 కోట్లకు సొంతం చేసుకుంది. 19 ఏళ్ల జహీర్ ఖాన్ చైనామన్ బౌలర్. ఇటీవల వైవిధ్యమైన శైలి బౌలర్లకు డిమాండ్ కనిపిస్తున్న నేపథ్యంలో రూ. 20 లక్షలకు జహీర్‌ను ముంబై గెలుచుకుంది. ముజీబ్, జహీర్ వీళ్లకు ఐపీఎల్ యోగం లేదు: ఇషాంత్ శర్మ, టైల్‌మిల్స్, ఫాల్క్‌నర్, హాజల్‌వుడ్, ఏంజెలో మాథ్యూస్, మోజెస్ హెన్రిక్స్, హషీం ఆమ్లా, నాథన్ లయన్, జో రూట్, డ్వేన్ స్మిత్, మెక్లీనగన్, లసిత్ మలింగ, డారెన్ స్యామీ, రాస్ టేలర్, మోర్నీ మోర్కెల్, తిసారా పెరీరా, ఇర్ఫాన్ పఠాన్, అశోక్ దిండా, వరుణ్ ఆరోన్. 169 అమ్ముడుపోయిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య 113 మొత్తం భారత ఆటగాళ్లు 71 అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు 56 మొత్తం విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీలు వెచ్చించిన మొత్తం రూ. 431 కోట్ల 70 లక్షలు ► కోల్‌కతా ముగ్గురు భారత అండర్–19 ఆటగాళ్లను సొంతం చేసుకుంది. వీరిలో పేసర్లు కమలేశ్ నాగర్కోటి (రూ. 3.20 కోట్లు), శివమ్ మావి (రూ. 3 కోట్లు) భారీ మొత్తాలకు అమ్ముడుపోగా, శుభ్‌మాన్ గిల్‌కు రూ. 1.80 కోట్లు దక్కాయి. ► పంజాబ్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్న మయాంగ్ డాగర్ సెహ్వాగ్‌కు స్వయానా మేనల్లుడు ► పంజాబ్ తీసుకున్న మంజూర్ దార్ లీగ్‌లో ఏకైక జమ్మూ కశ్మీర్ ఆటగాడు. ► చెన్నై జట్టులో ఏకంగా ఎనిమిది మంది అన్క్యాప్డ్ ఆటగాళ్లున్నారు. -
విదర్భ 151 ఆలౌట్
సౌరాష్ట్రతో రంజీ క్వార్టర్స్ మ్యాచ్ సాక్షి, విజయనగరం: జైదేవ్ ఉనాద్కట్ (5/70) బంతితో చెలరేగడంతో... బుధవారం సౌరాష్ట్రతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు తడబడింది. బ్యాటింగ్‌లో నిలకడలేకపోవడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 50.4 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. వసీమ్ జాఫర్ (41), ఉమేశ్ యాదవ్ (25), గణేశ్ సతీష్ (21) మినహా మిగతా వారు విఫలమయ్యారు. హార్దిక్ రాథోడ్, చిరాగ్ జానీ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. జోగియాని (19 బ్యాటింగ్), పుజారా (45 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అవి భరోత్ (5) నిరాశపర్చాడు. ప్రస్తుతం సౌరాష్ట్ర ఇంకా 81 పరుగులు వెనుకబడి ఉంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్ స్కోర్లు ♦ అస్సాం తొలి ఇన్నింగ్స్: 223/8 (సయ్యద్ మొహమ్మద్ 50 నాటౌట్, దాస్ 46, అమిత్ వర్మ 42, సిద్ధార్థ్ కౌల్ 4/81, బరీందర్ శరణ్ 2/67); పంజాబ్‌తో మ్యాచ్. ♦ మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 254/4 (ఆదిత్య 65, నమన్ ఓజా 64, హర్‌ప్రీత్ సింగ్ 51 నాటౌట్, దేవేంద్ర బుండేలా 42 బ్యాటింగ్, ప్రతాప్ సింగ్ 2/55); బెంగాల్‌తో మ్యాచ్. ♦ ముంబై తొలి ఇన్నింగ్స్: 303/6 (అఖిల్ హర్‌వాడేకర్ 107, సూర్యకుమార్ యాదవ్ 75, శ్రేయస్ అయ్యర్ 45, జస్కరణ్ సింగ్ 2/57, నదీమ్ 2/96).