breaking news
Jagdish Gagneja
-
ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత కన్నుమూత
గత నెలలో కాల్పులకు గురైన ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు బ్రిగెడియర్ (రిటైర్డ్) జగదీష్ గగ్నేజా (68) గురువారం ఉదయం మరణించారు. లూథియానా లోని హీరో డీఎంసీ హార్ట్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ పంజాబ్ ఉపాధ్యక్షుడైన గగ్నేజా.. ఆర్ఎస్ఎస్-బీజేపీలలో కీలక నాయకుడు. మంచి వాగ్ధాటి కలిగిన ఆయనను పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విజయానికి బాటలు పరుస్తారని అంతా భావించారు. భారత సైన్యంలో చేరడానికి ముందు ఆయన ఆర్ఎస్ఎస్లో ప్రచారక్గా పనిచేశారు. 40 ఏళ్లపాటు సైన్యంలో చేసిన తర్వాత మళ్లీ ఆర్ఎస్ఎస్లోకి సంఘ్చాలక్గా వచ్చారు. ఆగస్టు ఏడో తేదీన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఆయనపై అతి దగ్గర నుంచి కాల్పులు జరపడంతోఅప్పుడే ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడి.. చివరకు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి ఆయన పరిస్థితి బాగా విషమించిందని, బీపీ బాగా పడిపోవడంతో గురువారం ఉదయం 9.16 గంటలకు మరణించారని వైద్యులు ప్రకటించారు. -
ఆర్ఎస్ఎస్ నాయకుడిపై హత్యాయత్నం
జలంధర్: పంజాబ్ లో ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు బిగ్రేడియర్(రిటైర్డ్) జగదీశ్ గగనేజపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. జలంధర్ లోని జ్యోతి చౌక్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యతో కలిసి కారులో వెళుతున్న జగదీశ్ పై బైకుపై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన దేహంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. జగదీశ్ పై దాడిని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ఖండించారు. మరోవైపు ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి భద్రత పెంచారు.