breaking news
jagannath pahadia
-
జీవితంలో గెలిచి.. కరోనాపై ఓడి!
న్యూఢిల్లీ: ఫ్లైయింగ్ సిఖ్‌గా ప్రఖ్యాతిగాంచిన అథ్లెట్ మిల్కాసింగ్ కరోనా అనంతర లక్షణాలతో శుక్రవారం కన్నుమూశారు. కేవలం ఐదు రోజుల ముం దే ఆయన భార్య నిర్మల్ కౌర్‌ను కరోనా రక్కసి బలితీసుకుంది. వీరిద్దరే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది దంపతులు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వయోధికులే కాదు... నిండు నూరే ళ్లు కలిసి జీవించాల్సిన యువ దంపతులూ ఎంద రో మహమ్మారి వల్ల అర్ధాంతరంగా తనువు చాలిం చారు. దశాబ్దాల క్రితం ఒక్కటైనవారు మాత్రమే కాదు, కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం మరణించడంతో వారి కుటుంబాలకు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. వారాల వ్యవధిలో.. కొన్ని సందర్భా ల్లో రోజుల వ్యవధిలోనే దంపతులు తుదిశ్వాస విడి చిన సంఘటనలు ఉన్నాయి. దంపతుల్లో ఒకరి మరణం గురించి తెలిసి మరొకరు షాక్‌తో కన్ను మూసిన ఉదంతాలు బయటపడ్డాయి. ఇందుకు ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ కారణమని నిపుణులంటున్నారు. అనాథలైన 3,261 మంది చిన్నారులు! కరోనా వల్ల దేశంలో ఎంతమంది దంపతులు మరణించారన్న స్పష్టమైన గణాంకాలు ప్రభుత్వం వద్ద లేవు. అయితే, కరోనా కాలంలో దేశవ్యాప్తంగా 3,261 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారినట్లు జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) అంచనా వేసింది. అయితే, ఇవి 18 ఏళ్లలోపు పిల్లల గణాంకాలే. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చావుబతుకుల్లోనూ కలిసే... రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా(89) కరోనా బారినపడ్డారు. గుర్గావ్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 20న చనిపోయారు. ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే శాంతి పహాడియా(87) కూడా కరోనా కారణంగా అదే ఆసుపత్రిలో మూడు రోజుల తర్వాత మృతిచెందారు. వారిద్దరికీ బాల్యంలోనే వివాహం జరిగింది. సుదీర్ఘకాలం కలిసి బతికిన పహాడియా దంపతులు దాదాపు ఒకేసారి స్వర్గానికి చేరుకున్నారని వారి కుమారుడు ఓంప్రకాశ్ పహాడియా కన్నీటిపర్యంతమయ్యారు. సీనియర్ జర్నలిస్టులు, దంపతులైన కల్యాణ్ బారువా, నీలాక్షి భట్టాచార్య కరోనా వల్ల గుర్గావ్ ఆసుపత్రిలో మే నెలలో మృతిచెందారు. పహాడియా దంపతుల తరహాలోనే కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. రాజస్తాన్‌లోని బికనీర్ పట్టణానికి చెందిన దంపతులు ఓంప్రకాశ్, మంజుదేవీ గత ఏడాది నవంబర్‌లో 15 రోజుల వ్యవధిలో చనిపోయారు. వారికి 40 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా రాకాసి కరోనాను మాత్రం జయించలేకపోయారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో నంజుండే గౌడ ఈ ఏడాది ఏప్రిల్ 30న మృతి చెందారు. పెళ్లయిన తొమ్మిదేళ్లకు భార్య మమత గర్భవతి కావడంతో ఆనంద డోలికల్లో మునిగిపోయిన నంజుండే గౌడ సంతానాన్ని చూసుకోకుండానే కన్నుమూశారు. మే 11న భార్య మమత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మూడురోజులకే ఆమె కూడా కరోనాతో కన్నుమూసింది. పూర్తిగా కోలుకునేదాకా చెప్పొద్దు భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య.. భార్య మరణాన్ని భరించలేక భర్త గుండె పగిలి మరణించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకి ఒకరు చనిపోతే ఆ సమాచారాన్ని మరొకరికి తెలియజేయకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రెండో వ్యక్తి పూర్తిగా కోలుకునేదాకా చావు కబురు చెప్పొద్దని అంటున్నారు. ఒక్కోసారి జీవన సహచరి/సహచరుడి మరణం గురించి తెలియకపోవడం సైతం ఎంతో మేలు చేస్తుందని ముంబైకి చెందిన సైకియాట్రిస్టు హరీష్ షెట్టి అన్నారు. అధిక ఒత్తిడి, తీవ్రమైన భావోద్వేగానికి గురికావడం బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కు కారణమని గుర్గావ్ సైకియాట్రిస్టు జ్యోతి కపూర్ వెల్లడించారు. దశాబ్దాలపాటు కలిసి బతికిన దంపతుల్లో ఒకరి ఎడబాటు మరొకరికి అంతు లేని దుఃఖాన్ని కలిగించడం సహజమేనని పేర్కొన్నారు. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుందని వివరించారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేనివారు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌తో మరణిస్తుంటారని అన్నారు. భార్య ఆకస్మిక మరణం వల్ల భర్త మరణించే రిస్కు 18 శాతం, భర్త ఆకస్మిక మరణం వల్ల భార్య చనిపోయే రిస్కు 16 శాతం ఉంటుం దని తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. -
Coronavirus: రాజస్థాన్ మాజీ సీఎం కన్నుమూత
జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పహాడియా 1980-81లో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బిహార్, హర్యానా గవర్నర్‌గా సేవలందించారు. జగన్నాథ్ పహాడియా మృతిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో షాక్‌కు గురయ్యానన్నారు. ఆయనకు మొదటి నుంచీ నాకు చాలా అనుబంధం ఉందని, పహాడియా మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి మృతికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశమై సంతాపం తెలుపనుంది. అధికారిక లాంఛనాలతో నేడు పహాడియా అంత్యక్రియలు జరుగనున్నాయి. (చదవండి:బ్లాక్ ఫంగస్: అంటువ్యాధిగా ప్రకటించిన రాజస్థాన్) -
రాజ్యసభ సభ్యుడిని వరించిన గవర్నర్ పదవి
న్యూఢిల్లీ: హర్యానా నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు కప్టన్ సింగ్ సోలంకి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్ జగన్నాథ్ పహడియా పదవి కాలం నేటితో (శనివారం) ముగియనుంది. ఈ నేపథ్యంలో సోలంకిని జగన్నాథ్ స్థానంలో నియమించినట్లు పేర్కొంది. జగన్నాథ్ పదని నుంచి తప్పుకోగానే కప్టన్ సింగ్ సోలంకి బాధ్యతలు స్వీకరిస్తారని ఆ ఆదేశాలలో పేర్కొంది. మధ్యప్రదేశ్ కు చెందిన కప్టన్ సింగ్ సోలంకి ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. -
కుప్పకూలిన హర్యానా గవర్నర్ విమానం
హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహాడియా పెను ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ప్రమాదానికి గురైంది. గవర్నర్ ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ తరువాత దాదాపు ఇరవై అడుగుల ఎత్తు ఎగరగానే మంటలు అంటుకుంది. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వెంటనే విమానం రన్ వే పైనే కుప్పకూలిపోయింది. విమానంలో గవర్నర్ సహా అయిదుగురు వ్యక్తులున్నారు. మిగతా సిబ్బంది వెంటనే గవర్నర్ ను విమానం నుంచి బయటకు తీసుకొచ్చారు. మిగతా ప్రయాణికులకు కూడా ఎలాంటి గాయాలు కాలేదు. గవర్నర్ ఢిల్లీ కి బయలుదేరుతూండగా ఈ సంఘటన జరిగింది. గవర్నర్ ను వెంటనే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్ టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లారు.