breaking news
Indias sovereign credit rating
-
భారత్ రేటింగ్‌పై ఎన్పీఏల ప్రభావం: మూడీస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య భారత్ సావరిన్ క్రెడిట్ రేటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ పేర్కొంది. మొండి బకాయిల సమస్య పరిష్కారంలో ప్రభుత్వం నుంచి తగిన చొరవలు అవసరమని అభిప్రాయపడింది. మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ కష్టమవుతున్న తరుణంలో బడ్జెట్ కేటాయింపులకన్నా అధికంగా... భారీ మూలధన కల్పన విషయంలో ప్రభుత్వం నుంచే తగిన చర్యలు అవసరమని అభిప్రాయపడింది. వచ్చే నాలుగేళ్లలో బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధనం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2015 ఏప్రిల్‌లో మూడీస్ భారత్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్’కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే రేటింగ్‌ను ‘బీఏఏ3’గానే ఉంచింది. ‘చెత్త’స్థాయికి ఇది ఒక మెట్టు అధికం. -
భారత్ రేటింగ్ ‘స్థిరం’: మూడీస్
ముంబై: భారత్ సార్వభౌమ పరపతి రేటింగ్‌కు ఇప్పుడున్న స్థిరమైన అంచనాను (స్టేబుల్ అవుట్‌లుక్) కొనసాగిస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్ దిగ్గజం మూడీస్ బుధవారం ప్రకటించింది. ‘బీఏఏ3 (స్టేబుల్ అవుట్‌లుక్)’ రేటింగ్‌లో మార్పులేవీ లేవని పేర్కొంది. ప్రధానంగా మెరుగైన ప్రైవేటు పొదుపు రేటు, భారీ, విభిన్న రంగాలతో కూడిన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు మూడీస్ విశ్లేషకుడు (సావరీన్ క్రెడిట్) అత్సి సేథ్ పేర్కొన్నారు. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చని తాజా నోట్లో ఆయన అంచనా వేశారు. అదే విధంగా సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 2016 మార్చిచివరినాటికి 6.5 శాతానికి పెరగవచ్చని (ఈ ఏడాది మార్చి నాటికి అంచనా 4.6 శాతం) అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ అతితక్కువ స్థాయి తలసరి ఆదాయాలు, బలహీన మౌలిక సదుపాయాలను చూస్తే.. భవిష్యత్తులో వృద్ధికి మరింత ఆస్కారం ఉందని సేథ్ పేర్కొన్నారు. స్టేబుల్ అవుట్‌లుక్ అంటే రానున్న కాలంలో రేటింగ్ పెంపునకు(అప్‌గ్రేడ్) ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లే లెక్క.