breaking news
indian map
-
మా చరిత్రను తొలగిస్తే ఇక మేమెవరం?: ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మాత్రమే చూపించడం దారుణమన్నారు కేటీఆర్. ఇలా తమ చరిత్రను తొలగిస్తే ఇక మేమెవరం? అని నేరుగా ప్రధాని మోదీకే ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా? అని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు కేటీఆర్. ఈ మేరకు పలు పశ్నలు సంధించారే కేటీఆర్. ‘దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ. అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మా సాంస్కృతిక గుర్తింపుని అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మాత్రమే చూపించడం దారుణం. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఇది పూర్తిగా అనుచితమైంది. భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరం?, ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా?, లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై మీరు వెంటనే స్పష్టత ఇవ్వాలి. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బిజెపి నేతలు క్షమాపణ చెప్పాలి. పొరపాటైతే, తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు మీ పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.Honourable PM @narendramodi ji,We have fought for generations for our cultural identity, our rightful place in history, and our geographical position - TELANGANAToday, your Andhra Pradesh state BJP chief; Madhav Garu, has belittled our struggle by gifting a United Andhra… pic.twitter.com/vbFi2t1g2i— KTR (@KTRBRS) July 10, 2025 -
దేశ భద్రత కోసం మొత్తం సరిహద్దు రీమ్యాప్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ సరిహద్దులను రీ మ్యాప్ చేయడానికి కేంద్ర హోం శాఖ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలనుంచి మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చొరబాటుదారులు, ఉగ్రవాదులు ప్రవేశిస్తున్న నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌షా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాక, ఆయా సరిహద్దులలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాయింట్ యాక్షన్ దళాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ పెరుగుతున్న నేపథ్యంలో హోం మంత్రి అమిత్‌షా అక్టోబరులో పారా మిలిటరీ దళాల డీజీ, ఐబీ చీఫ్, రా, సీబీఐ అధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారని తెలుస్తోంది. హోంశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. సరిహద్దు వెంబడి బైక్ మీద లేదా అవసరమైతే కాలినడకన వెళ్లి బలమైన కంచెను ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. సరిహద్దు రాష్ట్రాల భాగస్వామ్యంతో ఐబీ, సీబీఐ, కస్టమ్స్ అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నిరోధించే చర్యకు ప్రభుత్వం ఉపక్రమించింది. మరోవైపు పంజాబ్‌లోకి పాక్ పెద్దెత్తున మాదకద్రవ్యాలు అక్రమంగా సరఫరా చేస్తుంది. ఐఎస్ఐ ప్రేరేపిత ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని స్థానికంగా రెచ్చగొడుతోంది. అంతేకాక, ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఆ దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, జీహాదీ ఉగ్రవాదం, భయంకర ఆర్థిక ఇబ్బందుల దృష్యా సరిహద్దుల్లోనూ, దేశంలోనూ తీవ్ర అలజడి సృష్టించే అవకాశాలున్నట్టు నిఘా వర్గాలు సమాచారమందించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ, రా, ఎన్ఏఐ, ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజం, పంజాబ్ పోలీసులతో స్పెషల్ కౌంటర్ గ్రూపును ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో గతంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అక్కడ ఎస్పీజీ కమాండో యూనిట్‌ను నెలకొల్పాలని అమిత్‌షా భావిస్తున్నారు. పాకిస్తాన్‌లోని నరోవర్ జిల్లాలో సరిహద్దు వెంబడి ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల క్యాంపును గుర్తించామని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కూడా దీనికి కారణం అయ్యింది. ఉగ్రదాడులను ఎస్పీజీ బలగాలు సమర్థంగా ఎదుర్కొంటాయి. -
బల్బులో భారతదేశం
సాక్షి, వజ్రపుకొత్తూరు : వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి గ్రామానికి చెందిన యువకుడు తామాడ జోగారావు భారత దేశ చిత్ర పటం, జాతీయ జెండా చిత్రాలను విద్యుత్ బల్బులో నిక్షిప్తం చేసి దేశ భక్తిని చాటుకున్నాడు. తన చేతి నైపుణ్యంతో రూపొందించిన అపురూప క్రాఫ్ట్ అందరికీ ఆకట్టుకుంది. పలాస ప్రభుత్వ కళాశాలలో ఐఐటీ చదువుకున్న యువకుడు వినూత్న రీతిలో ఆలోచిస్తూ ఆకట్టుకుంటున్నాడు. -
భారత్ మ్యాప్‌లో తప్పుంటే రూ.100 కోట్ల ఫైన్
భారత భౌగోళిక, నైసర్గిక సరిహద్దులకు సంబంధించి మ్యాప్‌లను ఆన్లైన్లో తప్పుగా చూపిస్తే, తప్పుడు మ్యాప్‌లను ప్రచురిస్తే గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష, కోటి రూపాయల నుంచి వంద కోట్ల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం తాజాగా ముసాయిదా బిల్లును రూపొందించింది. జమ్మూ కశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్లో అంతర్భాగంగా, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా ఇటీవల కొన్ని ఆన్లైన్ మ్యాపుల్లో చూపించిన కారణంగా భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా నివారించేందుకు కేంద్రం 'జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్ బిల్-2016'ను రూపొందించింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ ఎర్త్ ఇండియాను నిర్వహించాలంటే గూగుల్ సంస్థ కూడా భారతదేశంలోని సంబంధిత అథారిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా గూగుల్ లాంటి సంస్థలు తగిన ఫీజును చెల్లించి లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త సంస్థలు అయితే ముందుగానే లైసెన్సులు తీసుకోవాలి. భారత నైసర్గిక ప్రాంతాలకు సంబంధించి శాటిలైట్, ఏరియల్, బెలూన్, మానవ రహిత విమానాలు తీసుకునే ఫొటోలు, రూపొందించే మ్యాప్‌లు, గ్రాఫిక్స్ ఏవైనా ఆన్లైన్లో, ఇంటర్నెట్ ఫ్లాట్‌ఫామ్‌లపై, ఎలక్ట్రానిక్ రూపంలో ప్రసారం చేయాలన్నా, ప్రచురించాలన్నా కేంద్రప్రభుత్వం లైసెన్స్ ఉండాల్సిందే. సర్వేలతో ప్రచురించే మ్యాప్‌లు, గ్రాఫిక్‌లకు కూడా లైసెన్స్ ఉండాల్సిందే. భారత భూభాగాలకు సంబంధించిన ఫొటోలు, మ్యాప్‌లు, గ్రాఫిక్స్ సవ్యంగా ఉన్నాయా, లేదా? అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు 'సెక్యూరిటీ వీటోయింగ్ అథారిటీ' అనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అధిపతిగా ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ స్థాయి లేదా చైర్మన్ స్థాయి ఉద్యోగి ఉంటారు. ఈ కమిటీలో ఓ సాంకేతిక నిపుణుడు, జాతీయ భద్రతా నిపుణుడు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను పరిశీలించి లైసెన్స్‌ను మంజూరుచేసే అధికారంతోపాటు దరఖాస్తులను తిరస్కరించే అధికారం కూడా ఈ వీటోయింగ్ అథారిటీకి ఉంటుంది.