breaking news
India & UK
-
ఎఫ్‌టీఏపై బ్రిటన్‌తో చర్చలు ముమ్మరం
న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్ మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కోసం చర్చలు వేగవంతమయినట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడమే ఈ ఒప్పందం లక్ష్యమని వివరించారు. భారతదేశం ‘రికార్డు‘ సమయంలో యునైడెట్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిందని, ఇప్పుడు బ్రిటన్‌తోనూ చర్చలు వేగంగా జరుగుతున్నాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలు తమ మధ్య వర్తకం చేసే గరిష్ట సంఖ్యలో వస్తువులపై కస్టమ్స్ సుంకాలను గణనీయంగా తగ్గిస్తాయి లేదా తొలగిస్తాయి. అంతేకాకుండా, ఒప్పందం చేసుకున్న దేశాలు వస్తువులు, పెట్టుబడులలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి నిబంధనలను సులభతరం చేస్తాయి. జనవరిలో భారతదేశం, బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం అధికారికంగా చర్చలు ప్రారంభించాయి. దీపావళి నాటికి చర్చలు ముగించాలని గడువును నిర్దేశించుకున్నాయి. భారత్‌కే కొన్ని సవాళ్లు కెనడా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఇజ్రాయెల్‌లతో కూడా భారతదేశం ఇదే విధమైన ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని మంత్రి తెలిపారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరపడానికి అనేక ఇతర దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నాయని వెల్లడించారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ), యురేషియన్ ఎకనమిక్ యూనియన్ (ఈఏఈయూ), యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ) ఈ ఒప్పందాలపై చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే, పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే విషయంలో భారత్ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్న ఆయన, అనేక దేశాలతో ఏకకాలంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి భారత్ వాణిజ్య మంత్రిత్వ శాఖ వద్ద తగినంత వనరులు లేవని వ్యాఖ్యానించడం విశేషం. జీసీసీ.. గల్ఫ్ ప్రాంతంలోని ఆరు దేశాల యూనియన్. ఈ యూనియన్‌లో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలు ఉన్నాయి. ఇక ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టెయిన్ సభ్య దేశాలు. ఐదు దేశాల ఈఏఈయూలో రష్యా, అర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ సభ్యులుగా ఉన్నాయి. వ్యాపార సంఘాల్లో ఐక్యతకు పిలుపు దేశీయ వ్యాపారుల సంఘాలు ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి సారించాలని, ఐక్యంగా పని చేయాలని గోయెల్ ఈ సందర్భంగా కోరారు. విధాన పరమైన క్లిష్ట అంశాలను సరళతరం చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 30,000 నియమ, నిబంధనలను సడలించినట్లు తెలిపారు. -
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ భారత్‌లో కొనసాగుతోంది. ఇప్పటికీ గణనీయ సంఖ్యలో కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 35,551 మంది కోవిడ్ బారిన పడగా, 526 మరణాలు సంభవించినట్టు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 95,34,965 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,38,648కి చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 4,22,943గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం బాధితులు 89,73,373 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 40,726 మంది కోలుకున్నట్లు సమాచారం. -
లిక్కర్ కింగ్ మాల్యాకు ఇక గడ్డుకాలమే!
న్యూఢిల్లీ: భారీరుణ ఎగవేతదారుడు, పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించే ప్రయత్నాల్లో భారత విచారణ అధికారులు మరో కీలక అడుగు ముందుకు వేశారు. బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యాను భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అత్యున్నత స్థాయి అధికారుల మధ్య జరిగిన సమావేశంలో అంగీకారం కుదిరింది. మాల్యాను ఇండియాకు పంపించేందుకు భారతదేశం , యూకే మధ్య పరస్పర మార్పిడి చట్టాలకు లోబడి పూర్తి సహాయ సహకారాలు అందించేందకు అంగీకరించారు. ఈ మేరకు భారత నిబంధనలకు బ్రిటన్ అధికారులు అంగీకరించారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య పెండింగ్ లో ఉన్న మిగతా కేసుల్లో కూడా పరస్పరం సహకరించుకునేందుక ఇరుదేశాలు అంగీకరిచాయి. ఈ మేరకు జూన్‌లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. మాల్యాను రప్పించే విషయంలో భారత నిబంధనలకు యూకే అధికారుల ఆమోదం మంచి పరిణామమని ఎనలిస్టులు వ్యాఖ్యానించారు. కాగా మాల్యా వ్యవహారంలో ఎన్ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ (ఇడి) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సీనియర్ అధికారుల ప్రత్యేక బృందం లండన్ చేరుకుంది. అక్కడి న్యాయవాదులతోపాటు,ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శులు రాజీవ్ మెహ్రిషి , అంబర్ రుద్ల చర్చలు జరపుతోంది. ఇటీవల లండన్ లో అరెస్ట్ చేసిన విజయ్ మాల్యాకు బెయిల్ మంజూరైంది. ఈ కేసు మే 17న విచారణకు రానున్న సంగతి తెలిసిందే.