breaking news
India Art Fair
-
ఊరే ప్రేరణ
ఒక బొమ్మలో మాతృత్వం మరో బొమ్మలో పెళ్లి ఆనందం ఇంకో బొమ్మలో రైతు శ్రమ ఓ చిత్రంలో అందమైన బాల్యం మొత్తంగా ఈ గ్యాలరీ అంతా... అచ్చమైన పల్లెసీమకు చిత్రరూపం.తల్లి ఆవును ముద్దాడుతున్న లేగదూడ, పాలు తాగుతున్న లేగదూడ తోకను మురిపెంగా ముద్దాడుతున్న గోమాత, గిర్రున తిరుగుతున్న చక్రం మీదున్న మట్టికి పాత్ర రూపమిస్తున్న కుమ్మరి, పెళ్లి పందిట్లోకి అరటి గెలను భుజాన మోసుకొస్తున్న రైతు, రెండు జడలు వేసుకుని రిబ్బన్లను పువ్వుల్లా ముడి వేసుకున్న బాలికల ముఖాల్లో విరిసిన ఆనంద విరులు, తోటలో పూలబుట్ట మోస్తున్న శ్రామికురాలి ముఖంలో పరిమళిస్తున్న సంతోషాల తావి... ఇవన్నీ అంబిక ఆర్ట్ గ్యాలరీ కొలువుదీరిన అందమైన చిత్రాలు. ఇక... తలమీద నీరు తాగేసిన ఖాళీ కొబ్బరి బోండాలను తట్టలో నింపుకుని తలమీద మోస్తున్న మహిళ ముఖంలో మాతృత్వపు మధురిమకు మరేదీ సాటిరాదు. పై చిత్రాలన్నీ ఒక ఎత్తయితే ఇదొక్కటే ఒక ఎత్తు. చంటి బిడ్డను చంకలో కట్టుకుని, పెద్ద బిడ్డను చేయి పట్టి నడిపించుకు వెళ్తున్న మహిళ ముఖంలో తల మీద మోస్తున్న బరువు కంటే కంటిపాపల్లాంటి ఇద్దరు బిడ్డల మాతృత్వపు సంతృప్తి నిండిన దరహాసం ప్రస్ఫుటమవుతోంది. ఇక రైతు కష్టాన్ని కళ్లకు కడుతూ వీక్షకుల మనసును ద్రవింపచేస్తున్న చిత్రం ఒకటుంది. ట్రాక్టర్ ట్రక్కులో ఎర్రగా నవనవలాడుతున్న మిరపకాయల మీద పడుకుని సేదదీరుతూ ఠీవిగా కాలు మీద కాలు వేసుకున్న రైతు చిత్రం అది. మిరపకాయల ఘాటును లెక్కచేయకుండా తాను పండించిన పంట మీద సాధికారత, ప్రేమ అంతకు మించిన ధీమా రైతు ముఖంలో వ్యక్తమవుతున్నాయి. అంబిక మనసులో అనంతంగా పరిభ్రమిస్తున్న ఆలోచనలకు ఆమె చేతిలో ఉన్న కుంచె ఇచ్చిన రూపాలివన్నీ. స్కూల్ రోజుల్లో భయభయంగా పెన్సిల్ పట్టుకున్న అంబిక ఇప్పుడు చిత్రకళా ప్రదర్శనల్లో తన మార్కు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండియా ఆర్ట్ ఫెస్టివల్లో అంబిక తన చిత్రాలను ప్రదర్శించారు. ఆ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అనుభవాలివి. దార్శనికులు లేరు! అంబిక... ఏలూరులో పుట్టి పెరిగారు. స్కూల్లో బయాలజీ రికార్డు బొమ్మలు కజిన్స్‌ని బతిమాలి ఎప్పటికప్పుడు ఎలాగో గట్టెక్కుతూ వచ్చారు. ఒకసారి కజిన్స్ ఎవరికీ అంబికకు బొమ్మ వేసిచ్చేటంత ఖాళీ లేదు. ఇక తప్పదని ధైర్యం చేశారు. బొమ్మ బాగా వచ్చింది. తన మీద తనకు నమ్మకం కలిగిన క్షణాలవి. ఆ తర్వాత టెక్ట్స్ బుక్స్‌లో బొమ్మలను యథాతథంగా వేయడంతోపాటు గ్రీటింగ్ కార్డుల కోసం పువ్వులు, పక్షుల బొమ్మలు వేశారు. లెక్కకు మించిన బొమ్మలు వేశారు, కానీ చిత్రకారిణిగా ఎదగడానికి అవసరమైన శిక్షణ ఎక్కడ దొరుకుతుందో, ఎలా ముందుకెళ్లాలో కూడా తెలియదు. బొమ్మలో భావం పలికిందిఎమ్మెస్సీ తర్వాత పెళ్లి, ముంబయికి వెళ్లడం, ఆ తర్వాత ఏడాదికే బెంగళూరుకు బదిలీ. బెంగళూరు ఆమె చేతిలో కలర్ పాలెట్ అనే చెప్పాలి. అక్కడి చిత్రకళా పరిషత్‌లో ఏడాది కోర్సు చేసి, ముఖ కవళికలు, ముఖంలో భావాలు పలికించడం నేర్చుకున్నారు. హ్యూమన్ అనాటమీ కొలతల వంటి మెళకువలు పట్టుపడ్డాయి. అప్పటి నుంచి ఆ కుంచెకు విరామం లేదు. బొమ్మను అలాగే రిప్లికా వేస్తున్న దశ నుంచి సొంత థీమ్‌తో బొమ్మలు వేయడం 2018లో మొదలు పెట్టారు. హైదరాబాద్, బెంగళూరుల్లో డజను ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె అత్తగారి ఊరు గుళ్లపూడిలో సొంత ఆర్ట్ స్టూడియో, గ్యాలరీ ఏర్పాటు చేసుకున్నారు. ఆమె చిత్రాలకు విదేశీ చిత్రకారుల నుంచి ప్రశంసలు వచ్చాయి. సింగపూర్, దుబాయ్ ఆర్ట్ ఎగ్జిబిషన్లలో పాల్గొనడానికి ఆహా్వనాలు వస్తున్నాయి. పల్లెటూరి చిత్రాలు నా చిత్రాల్లో గ్రామీణ జీవనం కనిపించడానికి కారణం మా సొంతూరు రాజమండ్రి దగ్గర వానపల్లి. నేను పెరిగింది పట్టణంలోనే. ఇంటర్ సెలవుల్లో ఒకసారి నాన్నగారు నన్ను ఊరికి తీసుకెళ్లారు. రాజమండ్రి ప్రకృతి సౌందర్యం నా మనోఫలకం మీద ముద్రించుకు పోయింది. నా బొమ్మలు కోనసీమ జీవితాలను కళ్లకు కడుతుంటాయి. నన్ను ‘నారీ కళామహోత్సవ్ పురస్కారం’ పురస్కారానికి ఎంపిక చేసింది మా ఊరి ప్రకృతి, గ్రామాల్లోని శ్రమ జీవన సౌందర్యమే. ఇప్పుడు హైదరాబాద్‌లో 250 మంది చిత్రకారులు వేసిన మూడు వేల చిత్రాల ప్రదర్శనలో నా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు దక్కడానికి కారణమూ స్వచ్ఛత నిండిన అచ్చమైన జీవితాలకు చిత్రరూపమివ్వడమే. – అంబిక ఊరకరణం, చిత్రకారిణి – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గ్రౌండ్ జీరో హీరో
కళారూ΄ాలు అద్భుతాలకు మాత్రమే పరిమితం కానక్కర్లేదని చెబుతాయి సాహిల్ నాయక్ మినీయేచర్లు. అతడి కళాప్రపంచంలో నిర్మాణాల రూపంలో అసహాయుల హాహాకారాలు వినిపిస్తాయి. మహా నిర్మాణాలకు రాళ్లెత్తిన కూలీల జాడలు దొరుకుతాయి. పల్లకీ మోసిన బోయీల అడుగు జాడలు కనిపిస్తాయి.... గోవాలోని పొండలో పెరిగిన సాహిల్ నాయక్‌కు చిన్నప్పుడు ఒక్క దీపావళి పండగ వస్తే... వంద పండగలు వచ్చినంత సంబరంగా ఉండేది. రావణాసురుడి దిష్టి బొమ్మలను తయారుచేసే పనుల్లో బిజీ బిజీగా ఉండేవాడు. చిన్నప్పుడు నేర్చుకున్న బొమ్మలకళ ఊరకే పోలేదు. భవిష్యత్‌లో స్కల్ప›్టర్గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోడానికి పునాదిగా నిలిచింది. బరోడాలోని ఎంఎస్ యూనివర్శిటీలో చదువుకున్న సాహిల్ తన డెబ్యూ సోలో ఎగ్జిబిషన్‌ను ఆ యూనివర్శిటీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేశాడు. ఆ తరువాతి షో కోల్‌కత్తాలోని ఎక్స్పెరిమెంటల్ గ్యాలరీలో జరిగింది. ‘గ్రౌండ్ జీరో’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లోని మినీయేచర్లు కళాభిమానులను ఆకట్టుకున్నాయి. సాహిల్ కళాప్రపంచం గురించి చె΄్పాలంటే... అందానికి, అద్భుతానికి మాత్రమే పరిమితమై ఉంటే ‘గ్రౌండ్ జీరో’లో విశేషం ఉండేది కాదేమో! సాహిల్ మినీయేచర్స్ను ‘ఆర్టిస్టిక్ రిప్రెంజటేషన్’కు మాత్రమే పరిమితం చేయడం సరికాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సాహిల్ కళా ప్రపంచంలో యుద్ధానంతర, ప్రకృతి విలయం తరువాత కట్టడాల కళ్లలో కనిపించే దైన్యం కదిలిస్తుంది. ప్రశ్నిస్తుంది. ప్రకృతి విలయాల తరువాత దృశ్యాలపై ఆసక్తితో వందలాది ఫొటోలను అంతర్జాలంలో చూసేవాడు. పాత పుస్తకాల్లో దృశ్యాల వెంట వెళ్లేవాడు సాహిల్. అద్భుతమైన ఆర్కిటెక్చర్ కొలువుదీరిన ఊళ్లను వెదుక్కుంటూ వెళ్లేవాడు. ఈ ప్రయాణంలో తనకు ప్రత్యేక ఆసక్తి కలిగించిన గ్రామాల్లో ఒకటి గోవాలోని కుర్దీ. డ్యామ్ నిర్మాణం వల్ల ఈ ఊళ్లోని వాళ్లు నిరాశ్రయులు అయ్యారు. ఎక్కడెక్కడికో వెళ్లి బతుకుతున్న వాళ్లు వేసవి సమయంలో మాత్రం తమ ఊరి ఆనవాళ్లను చూసుకోవడానికి తప్పకుండా వస్తారు. శిథిలమై, చిరునామా లేని ఊరిని తన కళలోకి తీసుకువస్తాడు సాహిల్. టెక్ట్స్, క్లిప్స్, రి΄ోర్ట్... తన అన్వేషణలో ఏదీ వృథా పోయేది కాదు. కొన్ని కట్టడాలను ఆర్ట్‌కి తీసుకురావడానికి ప్రత్యేకమైన పరికరాలను ఆశ్రయించడమో, తయారుచేయడమో జరిగేది. ‘ఆర్కిటెక్చర్ అనేది కళ కంటే ఎక్కువ. చరిత్రకు మౌనసాక్షి’ అంటాడు సాహిల్. ఆ మౌన సాక్షిని తన కళతో అనర్ఘళంగా మాట్లాడించడం సాహిల్ ప్రత్యేకత! ‘మాన్యుమెంట్స్, మెమోరియల్ అండ్ మోడ్రనిజం’ పేరుతో చేసిన సెకండ్ సోలో షోకు కూడా మంచి స్పందన లభించింది. చాలా మంది సాహిల్ మొదటి షో ‘గ్రౌండ్ జీరో: సైట్ యాజ్ విట్నెస్/ఆర్కిటెక్చర్ యాజ్ ఎవిడెన్స్’ తో ΄ోల్చుకొని మంచి మార్కులు వేశారు. ‘ఎక్కడా తగ్గలేదు’ అని ప్రశంసించారు. కోల్‌కత్తాలో జరిగినా, అక్కడెక్కడో జ΄ాన్లోని కాంటెంపరరీ ఆర్ట్స్ సెంటర్లో జరిగినా సాహిల్ ఎగ్జిబిషన్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఒక్కటే. ‘మన ఆలోచనల్లో ఉండే సంక్లిష్టతను కళలోకి తీసుకురావడం అంత తేలిక కాదు. సాహిల్ మాత్రం ఆ క్లిష్టమైన పనిని తేలిక చేసుకున్నాడు’ అంటారు ‘ఖోజ్’ గ్యాలరీ క్యూరెటర్, ్ర΄ోగ్రామ్ మేనేజర్ రాధ మహేందు. గోవాలో మొదలైన సాహిల్ ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే ‘గౌండ్ జీరో’ రూపంలో గ్రౌండ్ రియాలిటీకి ఎప్పుడూ దూరం కాలేదు. అదే అతడి విజయ రహస్యమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా! -
హార్ట్ వర్క్
పెద్దగా సందేశాలిచ్చే పనేమీ పెట్టుకోలేదు సీనియర్ చిత్రకారుడు రమేశ్. దేన్నైనా టచ్ చేసి వదిలేస్తారు. టచింగ్‌లు మాత్రం ఇవ్వరు. అదే ఆయన ప్రత్యేకత. ఉన్నది ఉన్నట్టుగా గీసేసి, ‘ఇక మీ పని’ అన్నట్లు లేచి వెళ్లిపోతారు. ప్రపంచానికి మనిషిని మెత్తగిలేలా చెయ్యడం ఇది. ఈ కళలో ‘ఆర్ట్’తేరిపోయారు రమేశ్. ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో ప్రస్తుతం ఆయన షో నడుస్తోంది. షో ప్రారంభానికి ఎప్పుడో జనవరి 13న ఢిల్లీ వెళ్లొచ్చారు. మళ్లీ వెళ్లలేదు. వైజాగ్‌లోనే ఉండిపోయారు. ఏమిటీ మనిషి? తన ఆర్ట్ గురించి నలుగురికీ చెప్పుకోవాలని ఉండదా... అంత పెద్ద ఢిల్లీలో!! ఢిల్లీ అయినా, ఆయన ఎగ్జిబిషన్ పెట్టొచ్చిన వాషింగ్టన్ అయినా అంతే. ‘నేను చెప్పాలనుకున్నది నా ఆర్ట్ చెబుతుంది. నా గురించి చెప్పుకోవలసిన అవసరం ఏముంది?’ అని పెద్దగా నవ్వుతారు రమేశ్. ఆ నవ్వే ఒక ఆర్ట్ పీస్‌లా ఉంటుంది. రమేశ్ రంగులకు ముఖ్య కాన్వాస్... భక్తి విశ్వాసాలు. పెయింటింగ్ పూజలో కూర్చున్నాడంటే అయ్యేవరకు కదలరు. ఇదేం గొప్పకాదు కానీ... ఆయన బొమ్మ గీస్తుంటే, ఆ బొమ్మ ఆయన్ని చెక్కుతూ ఉంటుందట! ‘నాకేదో సిద్ధించినట్టుగా ఉంటుంది. ఆర్ట్‌వర్క్ పూర్తవగానే’ అంటారు. రమేశ్‌కి ఇష్టమైన భారతీయ చిత్రకారుడు భూపేన్ కక్కర్. ఇక ఆయన ఆరాధించే హెరానిమస్ బాష్ (ఏజ్ఛీటౌnyఝuటఆౌటఛిజి) 16వ శతాబ్దపు చిత్రశిల్పి. వాళ్లిద్దరి ప్రభావం ఆయన్ని ఆర్ట్పైపు తిప్పడం వరకే కనిపిస్తుంది. ఆర్ట్ బ్రష్ తిప్పడంలో ఉండదు. అంతమాత్రాన తనదొక ప్రత్యేక రేఖాంశమని చెప్పుకోడానికి ఉవ్విళ్లూరరు రమేశ్. ఇక ఆయన ఇచ్చిన షోలు, ఆయనకు వచ్చిన అవార్డులు ఆయన చెయ్యి తగిలిన ఒలికిన రంగులే తప్ప, ఆయన అభిమానుల దృష్టిలో వాటికి ఏమంత ప్రాముఖ్యం లేదు.