breaking news
hundi conuting
-
హుండీ లెక్కింపులో తప్పులు జరుగుతాయి
సాక్షి, అమరావతి: ఆలయాల్లో హుండీ లెక్కింపులో, ఇతరత్రా తప్పులు జరుగుతాయని, అవన్నీ మామూలేనని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. అయినా వీటిపై వైఎస్సార్సీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆయన దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, దేవదాయశాఖ సలహాదారులు సీతారామాంజనేయ ప్రసాద్‌లతో కలిసి రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. విజయవాడ దుర్గగుడి, అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామి ఆలయం, పెనుగంచిప్రోలు, పెదకాకాని శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయాల్లో రెండేళ్లలో భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ, ఆలయ నికర ఆదాయం గతం కన్నా తగ్గడంపై వివరణ ఇచ్చేందుకు సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి.. ఆ మాటే మాట్లాడలేదు. దేవదాయ శాఖ పరిధిలోని 22 పెద్ద ఆలయాల్లో ఉమ్మడిగా ఆదాయం పెరుగుదల గురించి మాత్రమే వివరణ ఇచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి గతంలో 93 లక్షల మంది భక్తులు రాగా, కూటమి ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య ఏకంగా 1 కోటి 19 లక్షల మందికి పెరిగిందని చెబుతూ.. ఆదాయంలో తగ్గుదల విషయాన్ని దాట వేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో మెరుగైన వసతులు కల్పించడం వల్ల భక్తుల సంఖ్య పెరిగిందన్నారు. విజయవాడ దుర్గగుడి భూముల్లో కొనసాగుతున్న సిద్ధార్థ విద్యా సంస్థల లీజు గడువు ఏడాది క్రితమే ముగిసిందని, అయితే ఆ విద్యా సంస్థ లీజు గడువు పొడిగించాలని కోరడంతో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గంలో చర్చించి దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి లభిస్తున్న విశేష ఆదరణను జీర్ణించుకోలేక కొందరు ఉద్దేశ పూర్వక దుష్ప్రచారాలు, సమాజాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారందరిపై రాజ ద్రోహం కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
శబరిమలలో సిబ్బంది కొరత.. హుండీ లెక్కింపు ఆలస్యం
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరోవైపు.. శబరిమలలో మకరవిళక్కు పూజలు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో మకర జ్యోతి వేడుకలకు శబరిమల సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 14న లక్ష మందికి పైగా భక్తులు జ్యోతి దర్శనం కోసం వస్తారని దేవస్థానం బోర్డు అంచనా వేసింది. ఇక, తొలిసారిగా ఫోటోలతో కూడిన పాస్‌లు, 900 బస్సులను భక్తుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు. జనవరి 14న 35,000 మందికే అనుమతి ఉండటంతో రద్దీ నియంత్రణకు స్పాట్ బుకింగ్ నిలిపివేశారు. భక్తులకు అన్నదానం, వసతి సౌకర్యాలు కల్పించారు.ఇదిలా ఉండగా.. శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో కానుకలు, హుండీ లెక్కింపులు జరుగుతున్నాయి. దేవస్థానం ఖజానాలో నాణేలు కొండలా పేరుకుపోయాయి. ప్రతిరోజూ, కానుకల హుండీలోని నోట్ల నుండి నాణేలను వేరు చేసి ఖజానాలోని ఒక భాగంలో ఉంచుతున్నారు. మండల కాలం నుండి మరియు మకరవిళక్కు పండుగ ప్రారంభమైన తర్వాత వచ్చిన నాణేలు కొండలా పేరుకుపోతున్నాయి. అయితే, దేవస్థానంలో డబ్బులు, నాణేలు లెక్కించడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది.వేధిస్తున్న ఉద్యోగుల కొరత.. ప్రస్తుతానికి దేవస్థానం ఖజానాలో 175 మంది ఉద్యోగుల కొరత ఉంది. సిబ్బందిని నియమించుకోవడానికి దేవస్థానం ఉద్యోగులు అందుబాటులో లేరు. దీనికి బదులుగా తాత్కాలిక ఉద్యోగులను నియమించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ, వారు కూడా లభించడం లేదు. అందువల్ల, డబ్బు లెక్కించడం అసాధ్యంగా మారింది. తీర్థయాత్రల సీజన్లో, సన్నిధానం, పంపా మరియు నిలక్కల్‌లో సేవ చేయడానికి ప్రతి సంవత్సరం 2000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమిస్తారు. మరోవైపు.. భద్రతా సిబ్బంది కోసం ఈసారి కేవలం 1750 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1632 మందిని నియమించారు. వారిలో 50 మంది సన్నిధానం చేరుకున్న తర్వాత తిరిగి వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది సరిపోక అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా, తాత్కాలిక ఉద్యోగులకు రోజుకు రూ. 650, ఉచిత వసతి, భోజనం ఇస్తామని హామీ ఇచ్చారు. భద్రతా విధులకు జీతం రోజుకు రూ. 900. వసతి, భోజనం అదనంగా ఉండనుంది.నాడు రోబోలతో లెక్కింపు.. మకరవిళక్కు కోసం ఆలయం తెరిచిన తర్వాత, యాత్రికుల రద్దీ భారీగా పెరిగింది. దీనితో పాటు, కానుకల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది. అదే ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుత పరిస్థితిలో, మకరవిళక్కు తర్వాత ఆలయం మూసివేసినా, కానుకలను లెక్కించడం సాధ్యం కాదు. 2023లో, రోబోల సహాయంతో కానుకలను లెక్కించే ప్రణాళికను అమలు చేయడానికి దేవస్థానం బోర్డు ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. అప్పటి దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. అనంతగోపన్ తిరుపతిని సందర్శించి ఒక అధ్యయనం నిర్వహించారు. అది విజయవంతమైందని తేలింది. ఇక్కడ కూడా దానిని అమలు చేయాలని నిర్ణయించారు. అప్పటికే అనంతగోపన్ పదవీకాలం ముగిసింది. తర్వాత వచ్చిన దేవస్థానం బోర్డు దీనిపై ఆసక్తి చూపకపోవడంతో అది అమలు కాలేదు.ఈ కారణంగా, గత 2 సంవత్సరాలుగా, నాణేలను లెక్కించడానికి ఖజానాలో తాత్కాలిక సిబ్బందిని నియమిస్తున్నారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో సన్నిధానంలోని ప్రతి డ్యూటీ పాయింట్ నుండి 10 మంది సిబ్బందిని ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు నాణేలను లెక్కించడానికి ఖజానాకు పంపాలని దేవస్వం కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. -
లేపాక్షి ఆలయ హుండీ లెక్కింపు
లేపాక్షి : లేపాక్షి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 2016 ఫిబ్రవరి 29 నుంచి జూలై 27వ తేదీ వరకు హుండీని లెక్కించగా రూ.62,802 ఆదాయం వచ్చిందన్నారు. హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రామతులసి, మేనేజర్ నరసింహమూర్తి, గ్రామపెద్దలు రామాంజినేయులు, రవీంద్ర, అంజినరెడ్డి, అర్చకులు నరసింహశర్మ, సూర్యప్రకాష్‌రావు, పురావస్తు శాఖ సిబ్బంది రాము తదితరులు పాల్గొన్నారు.


