breaking news
Home Minister George
-
ఆగిన రవాణా
నగరంలో పగలు గూడ్స వాహనాలు సంచరించరాదంటూ ప్రభుత్వ ఉత్తర్వులు గూడ్స్ వాహనాల యజమానులు, డైవర్ల ధర్నా ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశీలిస్తామన్న హోం మంత్రి జార్జ నిర్ణయం మార్చుకోకుంటే ఆందోళన తప్పదని హెచ్చరిక బెంగళూరు : సరుకు రవాణా వాహనాలు నగరంలోకి ప్రవేశించరాదని రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లారీ, టెంపో యజమానులు, డ్రైవర్లు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం బెంగళూరులోని టౌన్ హాల్ ఎదుట ఫెడరేషన్ ఆఫ్ గూడ్స ట్రక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ... ఉదయం ఆరు నుం చి రాత్రి పది గంటల వరకు సరుకు రవాణా వా హనాలు నగరంలో సంచరించకూడదంటూ గత ఏడాది డిసెంబర్ 16న ప్రభుత్వం ఉత్తర్వులు జా రీ చేసిందని గుర్తు చేశారు. అంతకు ముందే 12 టన్నులు, 7 టన్నుల సరుకులు తీసుకువచ్చే వా హనాలను నగరంలో సంచరించడాన్ని నిషేధిం చారని తెలిపారు. తిరిగి మూడు టన్నుల సరుకు లు రవాణా చేసే వాహనాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, దీని వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడే అవకాశముందని ఆం దోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో టెం పోలపై ఆధారపడిన వారి బతుకు దుర్భరమవుతోందని అన్నారు. నగరంలో 60 వేల మంది సరుకు రవాణా చేసే వాహనాలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. బెంగళూరు నగరంలో ఇండ్రస్టియల్ ఏరియాలు, కూరగాయల మార్కెట్లు, ఆహారపదార్థాలు తయారు చేసే సంస్థలు ఉన్నాయని, వీటికి సరుకు రవాణా చేసే వాహనాలు వెళ్లకపోతే అయా ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు పని లేకుండా పోతోందని అన్నారు. ఆర్టీఓ చట్టం ప్రకారం 7 టన్నుల సామర్థ్యం ఉన్న గూడ్స్ వాహనాలు నగరంలో సంచరించరాదన్న నియమాలు ఉన్నాయని తెలిపారు. అయితే ట్రాఫిక్ పోలీసలుఉ అనవసరంగా గూడ్స వాహనాలను నిలిపి సిగ్నల్ జంప్, ఓవర్ లోడ్, నోపార్కింగ్ స్థలంలో నిలిపారంటూ వేధిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు టన్నుల సామర్థ్యంతో ఉన్న వాహనాలను నగరంలో సంచరించేందుకు అనుమతించాలని కోరారు. కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు పరిశీలిస్తున్నాం : జార్జ ఎక్కువ టన్నుల సరుకు తీసుకు వస్తున్న వాహనాలు నగరంలో సంచరించ రాదన్న ప్రభుత్వ ఉత్తర్వులపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర హోం శాఖ మంత్రి జార్జ్ అన్నారు. సోమవారం గూడ్స్ వాహనాల యజమానులు, వివిధ సంఘాల నాయకులతో ఆయన సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రవాణ శాఖ మంత్రి, అధికారులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తరువాత లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు షణ్ముగప్ప, నాయకుడు సంపత్రామన్ మాట్లాడుతూ... డిమాండ్ల పరిష్కారానికి మంత్రి జార్జ సానుకూలంగా స్పందించారని, ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపి వేసి ఆందోళనను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. -
నిఘా పెంచాం
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో మత ఘర్షణలు జరగడానికి అవకాశం ఉందని కేంద్ర గూఢచార సంస్థలు అప్రమత్తం చేయడంతో సర్వత్రా నిఘా పెంచామని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. విధాన సౌధలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో మత ఘర్షణలు చెలరేగిన నేపథ్యంతో పాటు రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో కొంత మంది విద్రోహులు సున్నితమైన ప్రాంతాల్లో ప్రజలను రెచ్చ గొడుతున్నారనే సమాచారం ఉందన్నారు. మత ఘర్షణలకు ఆస్కారమున్న సున్నిత ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని ఆయన తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద పీట నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య వల్ల కాలుష్యం పెరిగి పోతోందని మంత్రి తెలిపారు. దీనిని నివారించడానికి ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతం చేయదలిచామన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చైనా పర్యటన నుంచి వచ్చిన వెంటనే ‘మోనో రైలు’ పనులకు శ్రీకారం చుడతామన్నారు. మెట్రో రైలుకు ఫీడర్ ఛానల్‌గా మోనో రైలు పని చేస్తుందని చెప్పారు. దీని వల్ల నగర పౌరుల సొంత వాహనాల వినియోగం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వివిధ ప్రభుత్వ శాఖలు కొన్ని ప్రతిపాదనలు రూపొందించాయన్నారు. వీటి అమలు, ఫలితాల కోసం 45 రోజుల సమయాన్ని విధించుకున్నామని తెలిపారు. అనంతరం మరో సారి సమీక్షించి లోపాలుంటే సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు.