breaking news
hand ball league tournment
-
ఆలియా జీహెచ్ఎస్ శుభారంభం
స్కూల్ హ్యాండ్‌బాల్ లీగ్ ఎల్బీ స్టేడియం: విశాల్ స్మారక హైదరాబాద్ స్కూల్ హ్యాండ్‌బాల్ లీగ్ టోర్నమెంట్లో బాలుర విభాగంలో ఆలియా గవర్నమెంట్ మోడల్ హైస్కూల్ (జీహెచ్ఎస్), గతి జీహెచ్ఎస్ జట్లు శుభారంభం చేశాయి. హైదరాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ (హెచ్‌డీహెచ్‌ఏ) ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన పోటీల్లో ఆలియా జీహెచ్ఎస్ జట్టు 7-6తో శివరాంపల్లి కేంద్రీయ విద్యాలయం (కేవీ)పై విజయం సాధించింది. రెండో లీగ్ మ్యాచ్‌లో గతి గవర్నమెంట్ హైస్కూల్ (బంజారాహిల్స్) 7-2తో ఎంవీఎం హైస్కూల్ (కొండాపూర్) జట్టుపై గెలిచింది. అంతకుముందు ఈ పోటీలను గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డీహెచ్‌ఏ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, కార్యదర్శి ఫ్రాంక్లిన్, హ్యాండ్‌బాల్ కోచ్‌లు రవి కుమార్, జగన్ మోహన్‌లు పాల్గొన్నారు. లీగ్ ఫలితాలు బాలుర విభాగం: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్) 9-0తో మమత హైస్కూల్ (సికింద్రాబాద్)పై, బ్లూ డైమండ్ ఈఎస్ఐ 7-0తో గవర్నమెంట్ హైస్కూల్ (విజయనగర్‌కాలనీ)పై, జీహెచ్ఎస్ (చాదర్‌ఘాట్) 5-4తో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ (షేక్‌పేట్)పై, ఆలియా జీహెచ్ఎస్ 13-4తో చిరెక్ స్కూల్ (ఖాజాగూడ)పై, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ 6-0తో మమత హైస్కూల్‌పై, ఆర్మీ స్కూల్ 7-3తో నల్లగొండ జెడ్పీ హైస్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ (కింగ్ కోఠి) 1-0తో చిరెక్ స్కూల్ (ఖాజాగూడ)పై గెలిచాయి. బాలికల విభాగం: హోలీ ఫ్యామిలీ హైస్కూల్ (సికింద్రాబాద్) 2-0తో ఎంవీఎం హైస్కూల్ (కొండాపూర్)పై, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ 5-0తో మమత హైస్కూల్‌పై, నల్గొండ జెడ్పీ హెస్కూల్ 6-2తో చిరెక్ స్కూల్ (కొండాపూర్)పై, ఎంవీఎం హైస్కూల్ 5-1తో చిరెక్ పబ్లిక్ స్కూల్ (కొండాపూర్)పై విజయం సాధించాయి. -
22 నుంచి స్కూల్ హ్యాండ్‌బాల్ లీగ్ టోర్నీ
ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ జిల్లా స్కూల్ హ్యాండ్‌బాల్ లీగ్ టోర్నమెంట్ ఈనెల 22 నుంచి 24 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనుంది. హైదరాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్డీహెచ్బీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈటోర్నీని విశాల్ సింగ్ స్మారకార్థంగా నిర్వహిస్తున్నట్లు సి.హెచ్ ఫ్రాంక్లిన్ తెలిపారు. బాల బాలికల విభాగాల్లో ఈపోటీలు నిర్వహిస్తున్నట్లు, ఆసక్తి గల స్కూల్ జట్లు తమ ఎంట్రీలను ఈనెల 21లోగా పంపించాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. ఇతర వివరాలకు పి.జగన్మోహన్ గౌడ్(98491-94841), డాక్టర్ రవి కుమార్(98662-29937)లను సంప్రదించవచ్చు.