breaking news
Gopalakrishnan
-
అడూర్.. ఇదేం విడ్డూరం!
అడూర్ గోపాలకృష్ణన్.. సినీఫైల్స్ ముఖ్యంగా న్యూవేవ్ మూవీ లవర్స్‌కి అభిమాన దర్శకుడు. స్క్రిప్ట్ రైటర్,ప్రోడ్యూసర్ కూడా అయిన అడూర్ గోపాలకృష్ణన్.. ‘స్వయంవరం’ సినిమాతో మలయాళ చిత్రపరిశ్రమలో న్యూవేవ్ మూవీకి రీళ్లు పరిచాడు. అంతేకాదు ‘చిత్రలేఖ ఫిల్మ్ సొసైటీ అండ్ చలచిత్ర సహకరన సంఘం’ను స్థాపించి చిత్రనిర్మాణంలో కో ఆపరేటివ్ సెక్టార్‌కు ఆద్యుడిగా నిలిచాడు. అంతటి దూరదృష్టి కల అడూర్ అనవసరంగా నోరుపారేసుకుని అతని అభిమానుల ఆగ్రహానికీ పాత్రుడయ్యాడు.ఏమన్నాడంటే.. కేరళ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మహిళా ఫిల్మ్‌మేకర్స్‌ను ప్రోత్సహించేందుకు కోటిన్నర రూపాయల ఫండ్‌ను అందిస్తోంది. ఈ ఫండ్ అనుకున్న అవుట్‌కమ్‌ను అందించట్లేదు కాబట్టి దీన్ని పునరుద్ధరించడమే కాక, ఆ ఫండ్‌ను ఇచ్చేముందు వాళ్లకు నిపుణుల చేత మూడు నెలల పాటు శిక్షణనిప్పించాలని అంటాడు అడూర్ గోపాలకృష్ణన్.వాళ్లకిస్తున్న ఫండ్ ప్రజల సొమ్మని.. క్వాలిటీ ఫిల్మ్స్ తీయడానికి ఉపయోగించాలనే స్పృహ వాళ్లకు కల్పించాలనీ కామెంట్ చేశాడు. అలాగే సినిమారంగంలోకి అడుగుపెట్టే మహిళల విషయంలో కూడా ఓ మాట విసిరాడు. మహిళలు అయినంత మాత్రాన ఫండ్ ఇవ్వకూడదని.. వాళ్లకూ సునిశిత శిక్షణనిచ్చాకే ఫండ్‌ను గ్రాంట్ చేయాలన్నాడు. అంతేకాదు ఒక్కొక్కరికీ కోటిన్నర రూపాయలు ఇచ్చేబదులు రూ. యాభై లక్షల చొప్పున ముగ్గురికి పంచాలనే సలహా కూడా ఇచ్చాడు.ఏ సందర్భంలో అన్నాడంటే.. మలయాళ చిత్రపరిశ్రమలో వివక్షను రూపుమాపేందుకు తీసుకురావాల్సిన పాలసీ మీద కేరళరాష్ట్ర ప్రభుత్వం తిరువనంతపురంలో ఇటీవల రెండు రోజుల సమావేశమొకటి నిర్వహించింది. దానికి హాజరైన అడూర్ గోపాలకృష్ణన్ అలా మాట్లాడి సంచలనానికి కేంద్రమయ్యాడు. అతని ఈ వ్యాఖ్యల పట్ల దళిత రచయితలు, యాక్టివిస్ట్‌లు, స్త్రీవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఏదైనా మాట్లాడొచ్చు అనుకోవడం కరెక్ట్ కాదుఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. వాటి అమలులో ఎంతోకొంత ప్రజాధనం వృథా అవుతుంది. అలాగే ఆర్ట్, కల్చర్, ఫిల్మ్‌మేకింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, మహిళలను ప్రోత్సహించడానికి కేరళ ప్రభుత్వం అందిస్తున్న ఫండ్‌ను ఎవరూ వ్యతిరేకించాల్సిన పనిలేదు. ఆ ఫండ్‌ను ఇచ్చే ముందు మూడునెలలు వాళ్లకు సినిమాతీయడమెలాగో నేర్పించాలి అనేది ఇంపాజిబుల్ థింగ్. సినిమా క్రాఫ్ట్‌ను నేర్పించగలరమో కానీ.. ఏం తీయాలన్నది ఎవరూ ఎవరికీ నేర్పించలేరు. ఏం తీయాలన్నది వ్యక్తిగత చాయిస్.తరతరాలుగా వాళ్లు పడ్డ బాధ, అనుభవించిన వేదనను ఎలా పిక్చరైజ్ చేయాలో మనమెలా చెబుతాం? వాళ్ల ఆలోచనలకు తెరరూపం కల్పించే అవకాశమివ్వడంలో తప్పేముంది! పైగా ఓ కమిటీని పెట్టి, స్క్రూటినీ చేసి, అర్హులైన వాళ్లకే ఇస్తామంటున్నారు. ఇంక ప్రాబ్లమేంటీ? నేను ఎస్సీ, ఎస్టీ.. అమ్మాయిని అని చెప్పుకోగానే ఫండ్ గ్రాంట్ చేయట్లేదు కదా! వందల ఏళ్లుగా మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వాళ్లు అనుభవిస్తున్న పీడన, చేస్తున్న స్ట్రగుల్‌కి ఎంతిచ్చినా తక్కువే. అలాంటి వాళ్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చొరవ తీసుకున్నప్పుడు బాధ్యతగల ఫిల్మ్‌మేకర్‌గా అడూర్ గోపాలకృష్ణన్ అలా మాట్లాడకూడదు.ఆయన ఇనీషియల్ డేస్‌లో ఆయనేం తీస్తారో తెలియకుండానే కదా ఆయనకు ఫస్ట్ చాన్స్ వచ్చుంటది! అలాగే ఇప్పుడు వీళ్లలోంచీ అద్భుతమైన ఫిల్మ్‌మేకర్స్ రావచ్చు.. కళాకారులు రావచ్చు. గవర్నమెంట్ ఒక మంచి ప్రయత్నం చేస్తుంటే ప్రశంసించాలి కానీ నీరుగార్చకూడదు. పెద్దవాళ్లం కాబట్టి, చేతిలో నాలుగు అవార్డులున్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు అనుకోవడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. – కరుణ కుమార్, సినీ దర్శకుడు, నటుడు -
ఒకసారి చార్జింగ్‌తో 650 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న చైనా దిగ్గజం బీవైడీ.. భారత్‌లో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను మూడు వేరియంట్లలో ఆవిష్కరించింది. ధర రూ.41 లక్షలతో ప్రారంభమై రూ.53 లక్షల వరకు ఉంది. ఒకసారి చార్జింగ్‌తో వేరియంట్‌నుబట్టి ఈ కారు 510–650 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.8 సెకన్లలో అందుకుంటుంది. 15.6 అంగుళాల టచ్‌్రస్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్–అప్ డిస్ప్లే వంటి హంగులు ఉన్నాయి. ప్రపంచంలో తొలిసారిగా సెల్ టు బాడీ, ఇంటెలిజెంట్ టార్క్ అడాప్షన్ కంట్రోల్ సాంకేతికతలతో రూపుదిద్దుకుందని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను పొందుపరిచారు. 4.8 మీటర్ల పొడవు ఉంది. పూర్తిగా తయారైన కారును చైనా నుంచి భారత్‌కు దిగుమతి చేస్తారు. ఇప్పటికే బీవైడీ భారత్‌లో ఈవీ6 ఎలక్ట్రిక్ ఎంపీవీ, ఆటో3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. రూ.30 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో భారత్‌లో తాము నాయకత్వ స్థానంలో ఉన్నామని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. -
తప్పతాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ.. మాజీ ఎంపీని చితకబాదిన ఓనర్
చెన్నై: మందుబాబులు తప్ప తాగి.. తమ ఇంటికి బదులు వేరే వాళ్ల ఇంట్లోకి వెళ్లి.. గొడవ చేయడం.. ఆనక ఆ ఇంటి వారి చేతులో దెబ్బలు తినే సన్నివేశాలను ఎక్కువగా సినిమాలో చూస్తుంటా. రియాలిటీలో కూడా అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. మాజీ ఎంపీ ఒకరు తప్ప తాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ రచ్చ చేయడంతో ఆగ్రహించిన సదరు ఇంటి యాజమాని.. మాజీ ఎంపీని చికతబాదాడు. ఆ వివరాలు.. (చదవండి: ‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్ జాబ్ పక్కా’) ఈ సంఘటన దీపావళి పండుగ నాడు చోటు చేసుకుంది. అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్ ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ మత్తులో మదురై నీలగిరి ముత్యాలమ్మన్‌పేట్‌లోని ఓ నివాసంలోకి ప్రవేశించారు. వచ్చిన వ్యక్తి ఎంపీ అని వారికి తెలియదు. తాగిన మత్తులో వచ్చి ఉంటాడు అని భావించిన ఆ ఇంటి సభ్యులు బయటకు వెళ్లాల్సిందిగా కోరారు. కానీ గోపాలకృష్ణన్ వారి మాట వినకుండా.. ఆ ఇంట్లో రచ్చ చేశాడు. తాగుబోతు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఆగ్రహించిన ఆ కుటుంబ యజమాని ఎంపీని చితకబాదాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. (చదవండి: మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు... ) ఫిర్యాదుదారుడి ఇంటికి చేరుకున్న పోలీసులు గోపాలకృష్ణన్‌ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన మాజీ మంత్రి అని తెలిపారు. అనంతరం గోపాలకృష్ణన్‌ని కూనూర్ ఆస్పత్రిలో చేర్చారు. చదవండి: ‘దొంగ’ తెలివి.. అమ్మవారికి మొక్కి పని కానిచ్చేశాడు.. వైరలైన దృశ్యాలు -
సినిమా, సాహిత్యం పరస్పర ప్రభావితాలే
సాక్షి, హైదరాబాద్: సాహిత్యం సినిమాలపైన ప్రభావం చూపించినట్లుగానే వాటిపై సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయని ప్రముఖ మలయాళ సినీ దర్శకుడు, రచయిత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆదూర్ గోపాల కృష్ణన్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ విద్యారణ్య స్కూల్లో ఏర్పాటు చేసిన మూడు రోజుల హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సారి వేడుకలకు అతిథి దేశంగా పాల్గొన్న ఆస్ట్రేలియా ప్రతినిధిగా చెన్నైలోని ఆ దేశ కాన్సుల్ జనరల్ సుసాస్ గ్రేస్ మరో అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదూర్ గోపాల కృష్ణన్ మాట్లాడుతూ..‘సాధారణంగా సాహిత్యంనుంచి సినిమాలు రూపొందుతాయి. నవల,కథా సాహిత్యం ఇందుకు దోహదం చేస్తుంది. సమాజంలోని విభిన్న దృక్కోణాల నుంచి వెలువడే సాహిత్యం ఆధారంగానే సినిమాలు రూపొందినట్లుగానే సినిమాల నుంచి కూడా సాహిత్యం వస్తుంది.’అని అన్నారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం మంచి సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయని, అధికం హోటల్ గదుల్లోనే తయారవుతున్నాయని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.సినిమాలు నిజ జీవితాన్ని ప్రతిబింబించడం లేదన్నారు. ‘ఎలిపఠాయం’, ‘సప్తపది’వంటి గొప్ప చిత్రాలను రూపొందించిన ఆదూర్ తన సినీ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గొప్ప సాంస్కృతిక చరిత్ర భారత్ సొంతం... ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సుసాన్ మాట్లాడుతూ, తాను భారతదేశ చరిత్ర, సాహిత్యం, సాంస్కృతిక వైవిధ్యాన్ని వివిధ రచనల ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. 20 ఏళ్లుగా తాను ఇండియాలో ఉంటున్నప్పటికీ పుస్తకాల ద్వారానే ఎక్కువ విషయాలు తెలుసుకోగలిగినట్లు చెప్పా రు. అరుంధతీరాయ్ ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’, విక్రమ్‌సేద్ ‘ది సూటబుల్ బాయ్’వంటి పుస్తకాలు తనను ప్రభావితం చేశాయన్నారు. ఆస్ట్రేలియాలో చెలరేగుతున్న కార్చి చ్చు వల్ల తాము నష్టపోతున్నట్లు ఆమె విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ అండమాన్ జైలు తరహాలో ఒకప్పుడు ఖైదీలకు .జైలు శిక్ష విధించే కారాగారంగా ఉన్న ఆస్ట్రేలియా ఒక గొప్ప దేశంగా ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ టి. విజయ్‌కుమార్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు ప్రపంచానికి విషాదకరమన్నారు. -
ఐటీ వృద్ధి మందగించింది
♦ అందుకే కొత్త నియామకాలు, ప్రమోషన్ల అవకాశాల తగ్గుదల ♦ భారీగా ఉద్యోగాల కోతలేమీ లేవు ♦ ఇన్ఫీ క్రిస్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యలు హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్తగా నియామకాలు, ప్రమోషన్ల అవకాశాలు తగ్గడానికి ఐటీ రంగం వృద్ధి మందగించడమే కారణమని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ చెప్పారు. ఐటీలో భారీగా ఉద్యోగాల కోతల వార్తలను ఆయన కొట్టిపారేశారు. ‘వృద్ధి రేటు తగ్గినప్పుడు.. కొత్తగా ఉద్యోగులను తీసుకోవాల్సిన అవసరం కూడా తక్కువగా ఉంటుంది. రెండోదేమిటంటే.. మరింత ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేనందువల్ల ప్రమోషన్ అవకాశాలూ కూడా తగ్గుతాయి‘ అని పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వూ్యలో క్రిస్ పేర్కొన్నారు. ‘భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడాన్ని నేనైతే చూడలేదు.. వినలేదు. సాధారణంగా ప్రమోషన్ల ప్రక్రియ ఎప్పుడూ కఠినతరం అవుతూనే ఉంటుంది. ఇది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది‘ అని ఆయన వివరించారు. ఇకపైనా ప్రమోషన్ల ప్రక్రియ కఠినతరంగా ఉంటుందని, మదింపు ప్రక్రియ మరింత కఠినతరం అవుతుందని క్రిస్ చెప్పారు. అయితే ఐటీ రంగంలో ఇది సర్వసాధారణమని.. గతంలో 2001లో, 2008లోనూ ఇలాంటివే చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఐటీ రంగ వృద్ధిపై ప్రస్తుతం పలు అంశాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు. భారత ఐటీ ఎక్కువగా ఆధారపడే అమెరికా, యూరప్‌లో వృద్ధి మందగించడం ఒక కారణం కాగా, ప్రస్తుతం కూడా మెరుగైన వృద్ధి సాధిస్తున్నప్పటికీ.. ఇప్పటికే దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం భారీగా పెరగడంతో ’బేస్ ఎఫెక్ట్’ వల్ల అది నామమాత్రంగానే కనిపిస్తుండవచ్చని క్రిస్ చెప్పారు. ఐటీ ఉద్యోగుల యూనియన్ అనవసరం.. ఐటీ రంగ ఉద్యోగులు యూనియన్ ఏర్పాటు ప్రతిపాదనపై స్పందిస్తూ.. ఇది సరైన యోచన కాదని క్రిస్ వ్యాఖ్యానించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ ఉద్యోగులు భారీ జీతాలే అందుకుంటున్నారని, కంపెనీలూ వారిని బాగానే చూసుకుంటున్నాయని, పైగా ఉద్యోగాలు మారేందుకు వారికి అనేక అవకాశాలూ ఉన్నాయన్నారు. ‘ఐటీలో యూనియన్ ఏర్పాటు ఆలోచన సరికాదు. ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వారికైతే అది అర్థవంతంగా ఉంటుంది. కానీ, ఐటీ రంగం అలాంటిది కాదు. ఉద్యోగులకు మంచి జీతాలు ఉంటాయి. అలాగే ప్రత్యామ్నాయంగా అవకాశాలూ ఉంటాయి’ అని క్రిస్ చెప్పారు. ఐటీలో ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొదలైన కీలక విభాగాల్లో ఇప్పటికీ సిబ్బంది అవసరమన్నారు. సరైన నిపుణులు దొరకని అమెరికా కంపెనీలు.. భారత్ వైపు మొగ్గు చూపొచ్చని క్రిస్ పేర్కొన్నారు.