breaking news
gollapalli reservoir
-
రేపు ముఖ్యమంత్రి పర్యటన
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 2న జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తోంది. ఈనెల 2న ఉదయం పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు హంద్రీ–నీవా నీటిని విడుదల చేస్తారు. అక్కడే గంగపూజ నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మడకశిర చేరుకుంటారు. స్వయం సహాయక సంఘాలతో సమావేశం అనంతరం ‘పసుపు-కుంకుమ’ కార్యక్రమంలో పాల్గొంటారు. -
‘యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి’
పెనుకొండ రూరల్ : హంద్రీ–నీవా పనులు నత్తనడకన సాగుతున్నాయని, యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఓపీడీఆర్ రాష్ట్ర జలసాధన సమితి అధ్యక్షులు శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ను హంద్రీనీవా ఈఈ రామకృష్ణారెడ్డితో కలిసి జలసాధన సమితి సభ్యులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన జిల్లా అయిన అనంతపురంలో కరువు విలాయతాండవం చేస్తోందని, ఈ జిల్లాను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా పనులు త్వరితగతిన పూర్తి చేసి పెనుకొండ మీదుగా సోమందేపల్లి, హిందూపురం, పరిగి, మడకశిరకు నీళ్లు వదలాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి, జలసాధన సమితి సభ్యులు ఇందాద్, శ్రీరాములు, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.